శ్రీ జే.పి. గారికి చిన్న సలహా

>> Friday, July 07, 2006

నిన్న 3 పాయింట్లు (నేరచరితులు,చట్టసభల గౌరవం,మరియు వ్యవసాయం & పరిశ్రమల గురించి)చెప్పుకున్నాము...ఇలా చెప్పుకొంటూ పోతె ఇంకా చాలా చెప్పాలి....అందువలన ఈ విషయాన్ని ఇక్కడే వదిలేస్తాను....వదిలే ముందు చిన్న విషయం చెబుతాను...
ఒక మనిషి నేరస్తుడు లేక మహాత్ముడు, విద్యావేత్త లేక దగుల్బాజీ, రాజకీయనాయకుడు లేక నక్సలైటు అయ్యాడంటె దానికీ కొన్ని కారణాలు ఉంటాయి. ఆందులో కొన్ని ఇక్కడ చెబుతున్నాను.
1. తల్లిదండ్రుల పెంపకం..: ప్రతీ తల్లి-తండ్రి తన కొదుకు/కూతురు ఇంజనీరో/కలెక్టరో/లేక ఇంకేదొ కావాలని అనుకొంటారె తప్ప ఒక మంచి మనిషి, ఇతరులకు సహయపడె మనిషి కావాలని అనుకోరు.....దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెదతారు.. రండి ఒక పదిమంది విద్యావేత్తలు వారి పిల్లలని ప్రభుత్వ పాఠశాలలొ చేర్పించి ఉపాధ్యాయుల మీద ఒత్తిడి పెట్టండి....పిల్లలు, ప్రభుత్వం ఉన్నత స్థితి లోకి ఎందుకు రావో చూద్దాము.
2. టీచర్ల, ఉపాధ్యాయుల భోధన..: ప్రస్తుతము ఎక్కడ చూసినా పోటీ తత్వమే...LKG లొ చేరాలన్నా ఇంటర్వ్యూలే..పరీక్షలే... స్కూలుకు మంచి పేరు/ఆదాయము రావాలంటె మంచి ర్యాంకులు రావాలి.....ర్యాంకులకి మంచి పద్దతి ప్రష్నలు బట్టీ పట్టించడమే, లేక రొజూ పరీక్షలే (అదేనండీ mock tests)...ఈ చదువును చూసి మా తాతగారు " Education is the botheration for the nation, so cultivation is the best occupation" అని...నిజమే కదా...
ఐనా "Co-operation is better than Competition" అని ఎప్పుడు తెలుసుకుంటారో?
3. తన చుట్టూ ఉన్న సమాజం..: అవినీతి ఎక్కడ మొదలైంది? మన నట్టింట్లొ...అంటె ఉరుకొంటారా?....కానీ ఇది నిజమైన నిజం,అదెలా అంటారా...పిల్లవాడు బడికి పోనని మారాం చేస్తుంటే, అమ్మ, నాన్న "నువ్వు ఇప్పుదు బడికి వెడితే సాయంత్రం పార్కుకి తీసుకెళతా" అని అనడం తొ మొదలు.....అదె పిల్లవాడు పెరిగి పెద్దవాడై ఆఫీసులొ నాకేంటి అని అడుగుతాడు. ఇది చాలదా ఉదాహరణకి?
4. కాలం..: నేను ఎక్కడో చదివా..."మనిషి మార్పుకు కారణం తో పనిలేదు...కాలమే ఆ పని చేస్తుంది" అని..బడిలో చదువుకొనేటప్పుడు ఉన్న సాటి మనిషి మీద ఉన్న ప్రేమ, అభిమానాలు కాలేజీ కి వచ్చిన తరువాత కనపడవు....ఎందుకు?
చివరిగా చెప్పోచ్చేదెమిటంటే...శ్రీ జే.పి.నారాయణ గారు క్రొత్త పార్టీ పెట్టి చేతులు కాల్చుకొనేకంటె, ప్రజలను చైతన్యవంతులని చేసి చరిత్ర లో నిలబడి పోవటం మేలని నా ఉద్దేశ్యం.
ఇక ఈ విషయాన్ని ఇక్కడే వదిలేస్తున్నాను....

1 అభిప్రాయాలు:

మురళీ కృష్ణ July 07, 2006 9:42 pm  

"ప్రతీ తల్లి-తండ్రి తన కొదుకు/కూతురు ఇంజనీరో/కలెక్టరో/లేక ఇంకేదొ కావాలని అనుకొంటారె తప్ప ఒక మంచి మనిషి, ఇతరులకు సహయపడె మనిషి కావాలని అనుకోరు.....దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెదతారు.. "

చాలా బాగా చెప్పారు. హాట్సాఫ్!