శివార్పణం

>> Saturday, September 16, 2006



అల్లన దొండ మెత్తి శివునౌదలయేటి జలంబు వుచ్చి సం
పుల్లత బాద పీఠకము పొంతన యున్న సహస్రనేత్రుని పై
జల్లి శివార్చనా కమల సంహతి బ్రోక్షణ చేయునట్లు శో
బిల్లు గజాననుండు మదభీప్సిత సిద్ది కరుండు గావుతన్||


గనేశుడు తన తండ్రి శివునకు అభిషేకం చేశాడు. అంతకు మునుపే, దేవతల రాజైన ఇంద్రుడు శివునికి అభిషేకము చేసి శివుని పాదపీఠం వద్ద వంగి ప్రణామం చేసి పూజిస్తూ ఉన్నాడు.
ఇంద్రునికి ఒళ్ళంతా కళ్ళే, అందుకే అతనికి సహస్ర నేత్రుడని పేరు., తొండము ఎత్తి శివుని అభిషేకములో నిమఘ్నుడైన గణపతి, శివని పాదాల వద్ద ఉన్న తెరుచుకొని ఉన్న ఆ వేయి కళ్ళను (ఇంద్రుని) చూసి పూలనుకొని భ్రమించి పూజలో ఉంచిన అన్ని వస్తువులను ప్రోక్షణ చేసినట్లు గానే, కళ్ళపై నీరు చల్లి 'శివార్పణం' చేసాడు.

ఈ అద్భుతమైన కావ్యం క్రీ.శ 1550-1560 కాలమునాటి శ్రీ 'పెద్దపాటి జగ్గన' కవి రచించిన 'ప్రబంధ రత్నాకరము' అను సంకలన గ్రంధం లోనిది.

1 అభిప్రాయాలు:

Anonymous September 16, 2006 3:46 pm  

అనీల్ గారు! పద్యం చాల బాగుంది. భక్తి పారవశ్యత లొ పూలకి, కళ్ళకీ తెడా తెలియలేదు గజాననుడికి... మంచి పద్యం అందించారు
మీకు కూడ ' అభీప్సిథ సిద్ధి ' కలగాలని కొరుకుంటున్నాను...