అర్ధం కాని అవార్డుల భాగోతం

>> Sunday, November 12, 2006


ఎట్టకేలకు 2005 సంవత్సరానికిగానూ నంది అవార్డులు ఇచ్చేశారు ....తన్నుకు చావండి...
తన్నుకోవడామేమో కానీ ఈ అవార్డులు ఏ ప్రాతిపదికనిచ్చారో అర్ధం కాక జుట్టు పీక్కొంటున్నాను.. మీకేమైన అర్ధమైతే తెలుపవలసినది...

ఉత్తమ హీరో - మహేష్ బాబు
చిత్రం - ఆతడు

విచిత్రంగా మనుషులని చంపే పాత్రలకే అవార్డులు వస్తాయేమిటో... ఐనా ఈ చిత్రం లో హీరో గారి పాత్ర 'మొహములో ఏ భావనలూ కనపడనిది"...దీనికి మహేష్ బాబు సరీగానే న్యాయం చేసాడు అని అనుకొందాం...ఈ జ్యూరీకి ఈ భావాలు పండించని ఈ పాత్రకి, ఈ మనిషి కి ఎలా అవార్డు ఇవ్వాలనిపించింది...?

ఉత్తమ దర్శకుడు - కృష్ణవంశీ
చిత్రం - చక్రం

ఇది మరో విచిత్రం ... కీ.శే. హృషీకేష్ ముఖర్జీ తీసినటువంటి "బావర్చి" నుండి inspiration పొంది (దీనిని inspiration అంటారా copy అంటారా?) కొంచెం ప్రేమ, కొంచెం చేజింగ్లు పెట్టి తీసిన సినిమా. ఈ జ్యురీ కాపీ సినిమలకు కూడా అవార్డులు ఇస్తే దీనికంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయిగా.

దిక్కు లేని "NTR" అవార్డ్...

మహానటుడు నందమూరి తారక రామారావు అవార్డు ఏ నిముషంలో పెట్టారో..పాపం ఎప్పుడు అవాంతరాలే...దీనిగురించి ఇంకోసారి మాట్లాడుకొందాం.

స్పెషల్ జ్యూరీ అవార్డు - వడ్డే నవీన్
చిత్రం -
ఊపిరి


దీని గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది...మిగతాది మీ ఊహ కే వదిలేస్తున్నాను..

చివరిగా అతి ముఖ్యమైనది - ఎవరికీ అర్ధం కానిది

ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం - పెళ్ళాం పిచ్చోడు

ఈ సినిమా విదుదలైనది 2006 (అవార్డు వచ్చినది 2005 సం.) ఈ సినిమ ఒకటి రెండు హాళ్ళలో మాత్రమే విడుదల అయినది, రెందు మూడు రోజులే ఆడిండి.. మరి ప్రజాదరణ ఎలా పొందింది?


ఓ దేవుడా .. మా మంచి దేవుడా ...
చూడడానికి సినిమానిచ్చావ్
పీక్కోవడానికి జుట్టు ఇచ్చావ్
ఎందుకు ఈ నందీ అవార్డుల జ్యూరీనిచ్చావ్?

3 అభిప్రాయాలు:

Unknown November 12, 2006 6:27 pm  

ఏదో అందరు ఇస్తారు కాబట్టి మనము కూడా ఇచ్చాము అనే కానీ దానికి ఎంత వరకు న్యాయం చేసామ అన్నది ముఖ్యం కాదు ఈ నందుల ప్రదానోత్సవంలో

Naveen Garla November 12, 2006 9:30 pm  

ఓ అనీల్ బాబు...తెలుగు సినిమాలల్లో విలువలకు వలువలూడ్చి శానా కాలమైనది..పట్టించుకొంటే ప్రతి సంవత్సరం ఇలాగే బాధ పడాల్సొతుంది. నీకు ఓపిక సత్తా ఉంటే చెప్పు..ఇద్దరం కలసి ఒక *ఉత్తమ అవార్డు* సినిమా తీసి చూపిద్దాం..ఏమంటావు? లెదంటావా..నాలాగా పాత తెలుగు సినిమాలు చూసిందే చూసి అనందించు. ఈ మధ్యే "బావా బావా పన్నీరు చూసాను"...అత్యద్భుతంగా ఉంది సినిమా. ఈ "స్టాలిన్", "boss" లాంటి పిచ్చి సినిమాలు చూసి బుర్ర చెడగొట్టుకోక..నామాటిని పాత సినిమాలు చూడు...

- నవీన్ గార్ల
http://gsnaveen.wordpress.com

Anonymous November 13, 2006 2:08 am  

ఇదేం చూశారు, మలి సంవత్సరం చూడండి..స్టాలిన్ కు ఒక అవార్డు తప్పదు. ఈ చిత్రం లో ఒక డైలాగ్ "ఒక అమ్మకు ..అబ్బకు పుట్టిన వాడివైతే..." ఇది చెప్పిన హీరోకు పద్మ భూషణం, గౌరవ డాక్టరేటు..వచ్చాయి..ఇక సినిమా పంది అవార్డు పొందటమే తరువాయి..