సంక్రాంతి లక్ష్మి

>> Saturday, January 13, 2007


రావమ్మా మహాలక్ష్మి ...రావమ్మా
రావమ్మా మహాలక్ష్మి ...రావమ్మా

నీ కోవెల ఈ ఇల్లు..కొలువై ఉందువు గానీ
నీ కోవెల ఈ ఇల్లు..కొలువై ఉందువు గానీ
కొలువై ఉందువు గానీ కనుముల రాణీ..
రావమ్మా మహాలక్ష్మి ...రావమ్మా...రావమ్మా

గురివింద పొద కింద గొరవంక పలికే
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికే
గురివింద పొద కింద గొరవంక పలికే
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికే


తెల్లారిపోయింది పల్లే లేచింది..
తెల్లారిపోయింది పల్లే లేచింది..
పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది.
రావమ్మా మహాలక్ష్మి ...రావమ్మా
రావమ్మా మహాలక్ష్మి ...రావమ్మా
నీ కోవెల నీ ఈ ఇల్లు..కొలువై ఉందువు గానీ
నీ కోవెల నీ ఈ ఇల్లు..కొలువై ఉందువు గానీ
కొలువై ఉందువు గానీ కనుముల రాణీ..
రావమ్మా మహాలక్ష్మి ...రావమ్మా...రావమ్మా


కడివెడు నీళ్ళు కళ్ళాపి చల్లి ..గొబ్బిళ్ళో...గొబ్బిళ్ళు

చారెడు పసుపు గడపకు పూసి...గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళు


కడివెడు నీళ్ళు కళ్ళాపి చల్లి ..గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళు
చారెడు పసుపు గడపకు పూసి...గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళు

ముత్యాల ముగ్గుల్లో.... ముగ్గుల్లో గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో... ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో... ముగ్గుల్లో గొబ్బిల్లు
రతనాల ముగ్గుల్లో.... ముగ్గుల్లో గొబ్బిల్లు
రావమ్మా మహాలక్ష్మి ...రావమ్మా...రావమ్మా
కృష్ణార్పణం!





పాడిచ్చే గోవులకు పసుపు కుంకం..పనిచేసే బసవినికి పత్రి పుష్పం
పాడిచ్చే గోవులకు పసుపు కుంకం..పనిచేసే బసవినికి పత్రి పుష్పం


గాదుల్లో ధాన్యం... చావిళ్ళ భాగ్యం
గాదుల్లో ధాన్యం... చావిళ్ళ భాగ్యం
కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం... కలకాలం సౌఖ్యం
- దేవులపల్లి కృష్ణశాస్త్రి











































































1 అభిప్రాయాలు:

Anonymous January 16, 2007 10:05 am  

సంక్రాంతి నీ మీ బ్లాగులో కి తీసుకొచ్చేశారు అందరికంటే ముందుగా.
రంగ వల్లులతో, గంగిరెద్దులతో, భొగి మంటలతో ధన ధాన్యాలతో సరి సమానంగా నింపేశారు. దానికి తల్మానికంగా కృష్ణ శాస్త్రి గీతాన్ని అందించారు. బాగు బాగు మీ బ్లాగు.

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

విహారి.