స్వీట్ మ్యాజిక్

>> Wednesday, June 13, 2007

'స్వీట్ మ్యాజిక్'...ఇదొక పేరుపొందిన స్వీట్ షాపు...విజయవాడ లో బందరు రోడ్డు మీద, కాంధారి హోటల్ కి దగ్గరగా ఉంటుంది..

దీనిలో స్వీట్లే కాదండోయ్..కేకులు, రొట్టెలు (అదే రోటి, నాన్‌లు)కూడా దొరుకుతాయి..ఇవి మా ఇంటిదగ్గరకూడా దొరుకుతాయి..ఇందులో వింతేముంది?..అంటారా...ఉందండి...

ఆ స్వీట్ మ్యాజిక్ లోపల ఒక వాతావరణ సమతులనా యంత్ర గది (అదే ఏసి రూం) ఉంది...అ గదిలోకి వెళ్ళి ప్రశాంతముగా కూర్చొని..కళ్ళు చీకటికి అలవాటు పడిన తరువాత (అంటే డిమ్ము లైట్లు ఉంటాయి)నెమ్మదిగా తలను మీ ఎడుమ వైపుకు తిప్పండి... అక్కడ 'నర్తనశాల' లోని కీచకుడు కనిపిస్తాడు...మీరు కరెక్టే...మన స్వర్గీయ రంగారావు గారే కనిపిస్తారు...

తరువాత వెనకకి తిరగండి...లేదా తల తిప్పండి..అక్కడ మన తోడి కోడళ్ళు...అదేనండీ "సూర్యకాంతం గారు, సావిత్రి గారు మరియు అందరికి పెద్దదైన కన్నాంబ గారు' కనబడతారు..

సరే ఇంక కుడి వైపుకి చూస్తారా..సరే అక్కడ బెంగాలీ బాబు దేవదాసు, అతని ప్రియురాలు పార్వతీ ప్రేమించుకుంటూ దర్శనమిస్తారు.

అలానే ఇంకొంచెం పక్కకి చూస్తే...సీతా కల్యాణం లో సుందాకారుడైన లంకేశ్వరుడు రావణాసురుడు (ఏవరో మీకు నేను చెప్పాలా?, తెలియని వాడు తెలుగు వాడు కానే కాదు కదా) మృదు మందహాసముతో నిల్చొని ఉంటాడు...ఆ పక్కనే సకల కళా సరస్వతి భానుమతి, చచ్చిన చావు చావకుండా చచ్చి, తన మేధస్సుతో రాయల సామ్రాజ్యాన్ని కాపాడిన మహామంత్రి తిమ్మరుసుగారు...గుమ్మడి...కనపడతారు...

ఇంత విషయము ఉన్న దానిని గురించి బ్లాగించి మీకు తెలుపుదామని నా ప్రయత్నం...ఇవన్నీ సినిమ పోస్టర్లు కాదు (పాత ఆంగ్ల సినిమా పోస్టర్లు మనకు హైదరాబాదు లోని ప్రసాద్స్ లో కనిపిస్తాయి). నలుపు తెలుపులలో ఉన్న భంగిమల చాయా ఛిత్రాలు...

మాంఛి ఎండలో వెళ్ళిన నాకు, శరీరానికి చల్లదనమే కాకుండా, వీనులవిందైన పాత హిందీ పాటలతో చెవులను, ఈ ఫొటోలతో కళ్ళనూ...మొత్తంగా నా మనస్సును చల్ల బరిచినది....ఈ....స్వీట్ మ్యాజిక్...

ఎప్పుడైనా విజయవాడ వెళ్తే...స్వీట్ మ్యాజిక్ వెళ్ళ్డానికి ప్రయత్నించండి..

ఇది నిజంగా స్వీట్ మ్యాజిక్కా కాదా...మీ అభిప్రాయాలను తెలుపుతారు కదూ...

3 అభిప్రాయాలు:

Anonymous June 13, 2007 1:48 pm  

నేనూ ఓసారి వెళ్ళాను కానీ ఈ ఫోటో లు గమనించలేదు.

Bujji June 13, 2007 9:03 pm  

naaku vellalani undi....kaani nenu US lo unnanu.
Theulugu samskruthiki pattukomma ayina vijayawada peru vintene theliyani anubhhothi kaluguthundi naaku.India vachi vijayawada veedhi veedhi kali nadakana thinragaali anivuntundi....

Deepthi Mamiduru(దీప్తి మమిడూరు) June 20, 2007 11:33 am  

మీ బ్లాగు చూడటానికి చాల అందంగా ఉంది అలాగే మీ పొస్టులు కూడ