పిల్లి మెడలో ఎవరు గంట కడతారు?
>> Saturday, September 30, 2006
ఈ వ్యాసం ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు...ముఖ్యంగా విహారి గారి ఉత్తరాలు చదివి నా అభిప్రాయం చెబుతున్నాను అంతే.
పిల్లి మెడలో ఎవరు గంట కడతారు?
ఏవరో ఎందుకు కట్టాలి?., మీరు, నేను చాలమా?
ఈ సాలెగూడులో ఎన్నో అద్దెగృహాలు, సొంతిల్లు, వ్రాత పత్రులు (నేను బ్లాగులను ఇలా పిలుస్తాను..మామూలుగా) ఉన్నాయి, దానికి తోడు ఎన్నో సంఘాలు ( ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే గుంపులు) ఉన్నాయి., ఎవరికి వారు దేశం తగలబడి పోతుందని, తెలుగు మృతభాష అవుతుందని గొతుచించుకు చెబుతారు., సంతోషం...నిజానికి వాళ్ళు అరవడం వరకే పరిమితం.
కొందరు కనీసం తెలుగు అభివృద్ధి కొరకు కొన్ని క్రొత్త ప్రయోగాలు చేసి ఈ గణితేంద్రము (కంప్యూటర్ కు వచ్చిన తిప్పలు) లో కొన్ని మార్పులు చేసినారు...వారికి నా ధన్యవాదములు.
ఇది ఇంతవరకే., మిగిలిన కాలములో వారు వారికి నచ్చిన/వీలైన భాషనే ఉపయోగిస్తారు.. దీనిని కాదనే అధికారం మనకు లేదు.
ఈ మధ్య కాలములో వచ్చిన చలన చిత్రములు (సినిమలు) రంగ్ దె బసంతి, లగే రహో మున్నాభాయి లను దాదాపు అందరూ చూసిఉంటారు, అందరికీ నచ్చి వుంటాయి., ఎందుకంటే అందరం విధ్యావంతులం కదా...కానీ ఇందులో చెప్పిన ఒక్క విషయం మనము మర్చి పోయాము...అదేఅంటే
"మార్పు అనేది ఎక్కడినుంచో రాదు...మనదగ్గర్నుండే మొదలవుతుంది".
వాళ్ళు తెలుగులో వ్రాసారా, ఇంకోకరకంగా వ్రాసారా వద్దు....మీరు మొదలు పెట్టండి. ప్రతీ దానికీ తెలుగులోనే జవాబు వ్రాయండి., (వీలైతే మీ కార్యాలయ విషయాలలో కూడా..మమూలుగా ఐతే ఇది కుదరదు..) నేను ఇప్పుడు ఇదే అనుచరిస్తున్నాను...
ఈ మార్గములో మీతో పాటు నడిచే నాలాంటి బాటసారులు చాలామందే ఉండి ఉంటారులేండి...