మాతా నిర్మలా దేవిజీ
>> Wednesday, March 14, 2007


ఈ అమ్మని దేనితో కొడతారు...నేనైతేనా...చె...కొడతాను...మరి మీరు...




తెలుగు సినిమా వజ్రోత్సవం గురించి అందరూ తమ తమ బ్లాగుల్లో ఇరగదీసి వ్రాశారు.. తెలుగువాడి ఆయువుపట్టు సినిమా అని చెప్పకనే చాటి చెప్పారు..
ఏ దేశమేగినా ఎందు కాలిడినా...మన పద్దతులు, అలవాట్లు, సినిమా వ్యామోహము, పిచ్చి తగ్గవు అని నిరూపించాము..
నిన్నటి దాకా ఆంధ్ర, తమిళనాడులకే పరిమితమైన హీరోల పిచ్చి (అభిమానము) విదేశాలలో కూడా పాకించాము..బానర్లు కట్టి మన అభిమానం చాటుకున్నాము...
కానీ వారికి అంత విలువ ఇవ్వటం ముఖ్యమా అనేదె ఒక గొప్ప ప్రశ్న..
ఇక వజ్రోత్సవం గురించి చెప్పాలంటె నావరకు నాకు, ఇక్కడ వ్యక్తి/వ్యక్తుల అరాధనోత్సవమే జరిగిందని అనిపిస్తోంది..
NTR, ANR, దాసరి, డ్రామానాయుడు (క్షమించండి అది డి.రామానాయుడు), చిరు, బాలకృష్ణ, నాగ్, వెంకి లకు తప్ప మరెవరికీ ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది నా భావన.
సినిమా అంటె అనేక భాగాల సమాహారం..కధ, మాటలు, పాటలు, సంగీతం, కెమరా, లైట్లు ఇంకా చాలా చాలా..
పాతతరం మరియు ప్రస్తుతపు నిర్దేశకులను ఎంతమందిని, తలచుకొన్నాము, అసలు వారికి తగిన విలువ ఇచ్చామా?
సంగీత దర్శకులను, మాటల, పాటల రచయితలను అసలు తలచుకొన్నామా?
ఇలా చాలా చాలా అనుమానాలను నాకు కలగచేసింది ఈ ఉత్సవం.
నా ఉద్దేశంలో పాత విషయాలను ప్రస్తుతతరానికి తెలియచెప్పే వేదికగా కూడా మారిఉంటే బాగుందేది.
పాత తరం హీరో, హీరోయిన్లు, కధ, పాటలు, మాటల రచయితల, స్క్రిప్టు, కెమెరా, మేకప్పు విభాగాలో ప్రతిష్టులైన వారి స్టాళ్ళను నేటి తరం వారితో రీసర్చ్ చేయించి పెట్టి ఉంటే బాగుండేది..
చివరిగా...
మోహన్ బాబుకు ఎందుకు పద్మశ్రీ ఇచ్చారో అనేది లక్ష మిలియన్ డాలర్ల ప్రశ్న. తను వైవిధ్యమున్న నటుడే ఒప్పుకుంటాను.. కానీ ఇతని నటనకు ఈ అవార్డు రాలేదు అన్నది జగమెరిగిన విషయం...లాబీయింగ్ ఎంత బాగా జరిగినది అనేది మన అందరికీ తెలుసు.. (వీరి గురించ్ తరువాత చెప్పుకుందాం)
ఇంకావుంది...మళ్ళా కలుద్దాం
నేను 51 వ వ్యాసంలోకి అడుగు పెట్టానోచ్!!!!
కొంచెం బద్దకము (???) ఎక్కువయ్యింది...తగ్గించుకొంటాను..
నాకు అన్నీవిధములా ప్రోత్సాహము ఇస్తున్న షడ్రుచుల జ్యోతి, బాలసుబ్రమణ్యం, అంతరంగం (చరసాల) ప్రసాద్, త్రివిక్రం, వీవెన్, రావు గార్లకి, మరియు మిగతా తెలుగు బ్లాగు మిత్రులకు, నా వ్యాసాలకు వారి వారి అభిప్రాయాలు వ్రాసిన వారికి, వ్రాయని వారికి..ధన్యవాదములు..
మీ సకారం, మీ అభిప్రాయాలు నాకు అందుతూ ఉంటె ఇంకా వేగం పెంచి, బద్దకం వదిలేస్తాను...
మీ
అనిల్ చీమలమఱ్ఱి




WE, the people of INDIA, having solemnly resolved to constitute India into a
SOVEREGIN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC
and to secure to all its citizens:
JUSTICE, social, economic and political;
LIBERTY of thought, expression, belief, faith and worship;
EQUALITY of status and of opporunity; and to promote among them all
FRATERNITY assuring the dignity of the individual and the unity and integrity of the Nation

బిగ్‌బ్రదర్ రియాల్టీ షో లొ మన అమ్మడిని,
బ్రిటన్ వాసులు జో ఒమేరా, డాన్లీ లాయడ్, గూడీ ఈ విధంగా అన్నారు...
"భారతీయులు ఆరోగ్యంగా ఉండరు, బక్కపలచగా ఉంటారు, సరీగ వండడం చేయడం రాదు, చేతులతొ తింటరు..నల్లవాళ్ళు, తెల్లగా కనపడాలని తాపత్రయపడుతుంటారు, కుక్క, పాకీది, మీదేశానికి దెం....(బూతు)"
మన అమ్మడు అవమానం జరిగిందని, కళ్ళనీళ్ళు పెట్టుకొంది..కన్నీరు చూస్తే కరిగిపోయే భారతీయులు, కన్నేర్ర చేశారు..ఇదంతా ఒక వైపు ఐతే...ఈ అమ్మడు..సినిమాలలో డ్రస్సులు మార్చినట్లు తన డైలాగ్ మార్చింది...
'అబ్బే, అంత ఏమీ ఫీలవలేదు..ఇది జాతి వివక్షత కాదు..నన్ను అవమానిస్తే దేశాన్ని అవమానించడంకాదు (నిన్న కన్నీళ్ళు పెట్టుకొంటూ...తను భారతీయులని అవమాన పరిచారు అనడం మీకు గుర్తే గా?).ఇదేమీ పెద్ద సమస్య కాదు అంటోంది...
మీరేమంటారు?
అవమానం శిల్పకా మనకా?
(మనలని తక్కువగా చూసే దేశాలకు మనము ఎందుకు పోవాలి? ఇప్పటికన్నా ప్రవాసాంధ్రులు కొంచెం ఆలోచించండి...)

చారెడు పసుపు గడపకు పూసి...గొబ్బిళ్ళో... గొబ్బిళ్ళు

పాడిచ్చే గోవులకు పసుపు కుంకం..పనిచేసే బసవినికి పత్రి పుష్పం
పాడిచ్చే గోవులకు పసుపు కుంకం..పనిచేసే బసవినికి పత్రి పుష్పం
దేశం గుర్తిచడం అంటే?
మీ ఉద్దేశం లో వారికి పద్మలు, శ్రీ లు, భూషణలు, రత్నలు ఇవ్వటమేనా, లేక నడి రోడ్డులో విగ్రహం పెట్టటమేనా?
మనపక్కింటి పిల్లవాడు, గొప్ప క్రికెటర్ అని, వాడిని TV చూసినప్పుడు గానీ గుర్తించని మన గొప్పదనాన్ని దేశం మీదకు నెట్టటమే మనకు తెలిసిన విద్య..
పక్కింటి అమ్మాయి టెన్నీస్ ఆడుతుందని, మనము తెలుసుకొనేంత వ్యవధి, తీరిక ఈ పరుగుల కాలంలో మనకి ఉన్నాయా..ఉంటే మనము అలాంటి విషయాలకు ప్రాముఖ్యత యిస్తున్నామా?
ఎవరిదాకో ఎందుకు, నాగురించే తీసుకోండి..డిగ్రీ చదివేటప్పుడు, గణిత బ్రహ్మ లక్కోజు గారి గురించి తెలుసు..కానీ, ఈ రోజు ఇంకెవరోగాని చెబితే గుర్తుకి తెచ్చుకోవటం, నా తప్పు కాదా?
మీ ఇంట్లో లేక పక్కింట్లో లేక తెలిసిన వారి పిల్లలకి "రవీంద్రనాథ్ టాగోర్", "రామానుజం", "ఆర్యభట్ట", "గాంధీ", "లాల్ బహదూర్ శాస్త్రి", "మౌలానా అబుల్ కలాం ఆజాద్" లేక "బాబు జగ్జీవన్ రాం" తెలుసునేమో కనుక్కోండి..
మన దేశంలో పుట్టి, జాతి పితగా పూజింపబడ్డ గాంధీని గురించి తెలుసుకోవాలంటే "Google" లో వెదికే రోజులు వచ్చినప్పుడు...తప్పు ఎవరిది, పరిగెడుతున్న కాలానిది తప్ప.
పూజించవలసిన గాంధీని, వెధవ, చేయవలసినదంతా వయస్సులో చేసి ముసలోడిగా ఉన్నప్పుడు నాటకాలు వేశాడు అని, వాడు లేకపోతే ఇంకా ముందే స్వారాజ్యం వచ్చేది అని, పిల్లలే కాదు, యువకులు ఈరోజు అనటం మన అజాగ్రత్త వలన కాదా?
మీ పిల్లలని అడగండి, "వందేమాతరం" ఎవరు రాశారు అని...A.R. రెహెమాన్ అని చెప్పకపోతే సంతోషమే..దీనికి ఒక కారణం, మన పిల్లలు పెద్ద కంప్యూటర్ ప్రొఫెషనల్ కావాలని, లేక పెద్ద డాక్టర్ కావాలని, పక్కింటి వాళ్ళ అబ్బాయికి నెలకి లక్ష రూపాయల జీతమని, చిన్నప్పటి నుంచే ఇంటర్నేషనల్ బడులలో చేర్చడం, ఒకరకంగా మన అజాగ్రత్తే.
మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీరులు, కలెక్టర్లు కావాలని అనుకోవటమే గానీ, మంచి మనిషి, ఒక బాధ్యత కలిగిన భారతీయుడు కావాలని మనము అనుకోకపోవడమే దీనికి మరొక కారణం.
చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎవరికి వారే తీరికగా కూర్చొని (ఇది జరగని పని అని నాకూ తెలుసు) అలోచిస్తే తెలుస్తాయి.



ప్రపంచంలో అరిష్టాలన్నీ అందరూ విశ్రాంతి లేకుండా, పనిలో నిమగ్నులుకావడం వల్లనే సంభవిస్తాయనుకొనేవాళ్ళలో నేనొకణ్ణి.
ప్రపంచం నామాట వినదు, ఈ ముక్కలు ఎందరెందరో చెప్పారు. ఏ వొకరిద్దరు ధన్యజీవులో తప్ప, యీ భోధ ఎవ్వరూ పాతించరు. గోళాలు తిరిగిపోతున్నాయి, భూమి తిరిగిపోతూంది. కాలం ఇంకా వేగంగా తిరుగుతోంది..ఎవ్వరూ ఆపలేరు, సమాజాలు కదలిపోతున్నాయి..మనిషి నిత్యకర్మ అనే చక్రంలో నలిగి తిరిగిపోతున్నాడు.
ఆ చక్రం (నిన్న చెప్పిన 'ఫ్యాను') తను తయారుచేసుకున్నదే..నాలాంటివారెవరైనా ఆపుదామని చెయ్యి పెడితే, ముక్క వూడిపడుతుంది..
మధ్య నాకెందుకు..?
Read more...ఏమిటో అందరూ...ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక ఆంధ్రా, ప్రత్యేక రాయలసీమ కావాలంటున్నారు...
ప్రత్యేక తెలంగాణా వస్తే... అది ఖమ్మం వరకూ, ప్రత్యేక ఆంధ్రా వస్తే అది గోదావరి జిల్లాలవరకూ, ప్రత్యేక రాయలసీమ వస్తే అది కేవలం తిరుపతి వరకూ మాత్రమే వర్తిస్తాయి...
మరి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుల పరిస్థితి ఏమిటి...?
అందుకే....
నాకు..ప్రత్యేక ఉమ్మడి కృష్ణా (కృష్ణా & గుంటూరు) కావాలి...మా నాన్న గారు ఇక్కడే సెటిల్ అయ్యారు..
మళ్ళీ నాకే...ప్రత్యేక సింహపురి కావాలి....నేను ఇక్కడ 7వ తరగతి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం వరకూ చదివా...మా పెద్దక్కనీ ఇక్కడే ఇచ్చాము..మాకు ఇల్లు కూడా ఉంది..
మళ్ళీ నాకే...ప్రత్యేక రాయలసీమ కూడా కావాలి...ఎందుకంటే...నా డిగ్రీ ఇక్కడే చెశాను.
అందుకే
జై బోలో... ప్రత్యేక సింహపురికి...
జై బోలో... ఉమ్మడి కృష్ణకి...
జై బోలో... ప్రత్యేక రాయలసీమకి...
గమనిక:
దొంగలు ఊర్లు పంచుకుంటున్నారు...మీరూ చేరండి...మీ రాష్ట్రం కోరండి..