స్నెహం అంటే ఇదేరా!

>> Tuesday, November 22, 2011

ఒక రోజు ఇంటికి చాలా ఆలస్యముగా వెళ్ళాను.

నాన్న : ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? ఇప్పుడు టైం ఎంతయ్యిందో తెలుసా?

నేను : ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.

(నాన్న వెంటనే...నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసాడు.)

రాము: అవును అంకుల్, ఇప్పటి దాకా ఇక్కడే ఉన్నాడు.

రెడ్డి: అంకుల్, ఇప్పుడే బయలుదేరాడు.

శ్రీను: ఇక్కడే ఉన్నాడు, చదువుకొంటున్నాడు..పోన్ ఇచ్చేనా?


ఐసే హర్ ఫ్రెండ్ జారూరీ హోతాహై.

(ఇది కేవలము నవ్వు కోవడానికే)

Read more...

జాగ్రత్త....

>> Friday, June 24, 2011

లెటుగా వస్తున్నా, లేటెస్టుగా వస్తున్నా!!! జాగ్రత్త....

Read more...

పంచ రత్నాలు

>> Sunday, October 12, 2008

ప్రస్తావన - ౧
విశ్వ సృష్టిలోనూ, మానవ జీవితములోనూ, పంచ సంఖ్యకు విశిష్టత కనబడుతుంది..పంచభూతాత్మికమైనది ఈ జగత్తు. పృధ్వి, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశము - వీటిని పంచభూతాలు అంటారు.వీటి సంగమము వలన ఏర్పడ్డదే ఈ లోకం. ప్రాణులన్నీ ఈ ఐదు తత్వాలవల్ల ఉధ్బవించినవే. ప్రాణపానవ్యానోదాన సమాన వాయువులనే ఈ ఐదు పంచప్రాణాలనే పేరుతో దేహాన్ని నడిపిస్తూ ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు ఐదు. ఇంద్రియాది విషయాలు కూడా ఐదే. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ, అనే కర్మేద్రియాలు కుడా ఐదే. ఇక జ్ఞనేంద్రియాలునూ ఐదే. త్వక్, చక్షుః, శ్రోత్ర, జిహ్వ, ఘూణములు అనగా చర్మము, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు, చేతుల వ్రేళ్ళు, కాలివ్రేళ్ళు కూడా ఒకొక్కటీ ఐదే. ఈ ప్రపంచానికి, పంచ సంఖ్యకు అవినాభావ సంబంధం ఉన్నట్లు రూఢీగా తెలుస్తుంది.

మనుష్యుని జన్మకు మూలం అన్నం. "అన్నాద్భవం తిభూతాని" - ఏ ప్రాణులైనా అన్నం నుంది ఉద్భవించినవే. మానవుని జన్మ ప్రాణకోటిలో విశిష్టమైనది. ఆనందం మానవుని గమ్యం. అన్నగత ప్రాణియైన మానవుడు తన ప్రాణాన్ని కుదుటపరచుకొని మనస్సు ఆలోచన్లో ప్రవేశపెట్టి విజ్ఞానాన్ని సంపాదించి ఆనందస్థితిని అందుకొంటాడని ఉపనిషత్తులు ప్రభోదిస్తాయి. ఈ వికాస క్రమాన్నంతటినీ 'పంచకోశ శుద్ధి' అని తాత్వికులు పేర్కొన్నారు.

Read more...

జ్యోతిచిత్ర - సినీ 'మా' లోకం

>> Sunday, September 28, 2008

ప్రియమైన బ్లాగు మిత్రులకు,

ఇది మరో క్రొత్త బ్లాగు...జ్యోతిచిత్ర.

ఈ పేరు పెట్టడానికి ముఖ్య కారణాలు మూడు...

1. జ్యోతి చిత్ర - శాన్నాల క్రితం దాకా అంధ్రజ్యోతి వారినుండి వెలువడిన సినిమా పత్రిక.

2. జ్యోతి - సరదా సమాలోచనల పందిరి, షడ్రుచులు, గీతా లహరి అనే బ్లాగులతో చంపే "టెక్నికల్ రంగనాయకమ్మ", శ్రీమతి. జ్యోతి వలబోజుల, మీద ప్రేమ, గౌరవము లతో (నేను, అనిల్ చీమలమఱ్ఱి మరియు జోకులాష్టమి అనే భ్లాగులలో, చాలా టపాలద్వరా మిమల్ని భాధించుటకు ముఖ్య కారణము), ఈ సెప్టెంబరులో, బ్లాగులోకము లో జరిగిన రెండవ పుట్టినరోజు కానుకగా...వారి పేరుతో 'జ్యోతి'చిత్ర...

3.మామూలుగానే బెజవాడ వారికి సినిమా పిచ్చి ఎక్కువ..అందులోనూ నాకు ఇంకా ఎక్కువ..భాషా బేధం లేదు..కన్నడనా,మలయాళమా, కాష్మీరమా, ఇంగ్లీసైనా, హిందీ అయినా, హింగ్లీషైనా (హింది + ఇంగ్లీష్) .. ఏదైనా...రఢీ... ఆవిధంగా చాలా సినిమాలనే చూసాను..ఈ విషయంలో నాతో పోటీ పడలేరు అని ఘంటాపధంగా మీ కంప్యూటర్ మానిటర్ మీద కొట్టి మరీ చెప్పగలను.. అందులో కొన్ని మాంఛివి, తుస్సు లు , ఢాం లు కూడా ఉన్నాయి...వాటిని మీతో పంచుకుందామని...ఈ ప్రయోగం...ఆదరిస్తారు కదూ...

మీ
అనిల్ చీమలమఱ్ఱి

Read more...

వికసించిన పద్మాలు

>> Saturday, January 26, 2008

పద్మ భూషణ్ పి.సుశీల



పద్మశ్రీ వెంకటేశ్వర రావు ఎల్లా



పద్మ భూషణ్ కె. సూర్యా రావు

అందరికీ అభినందన మందార మాలలు.

Read more...

నాకో అనుమానం...

>> Thursday, January 10, 2008

పద్మశ్రీ అల్లు రామలింగయ్య..
పద్మశ్రీ చిరంజీవి..
పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు..
పద్మశ్రీ రామారావు...

ఇంతమందికి "పద్మశ్రీ"లు ఇచ్చారు గానీ...

గుమ్మడి గారికి ఎందుకు ఇవ్వలేదు...ఆయన అర్హుడుకాదా..?
S.జానకి గారికి అంత టాలేంటులేదా..?
మనవారికి బుద్ధి లేదా..?

అనిల్ చీమలమఱ్ఱి

Read more...

డాక్టర్

>> Thursday, July 19, 2007

photo courtesy : eenadu.net


ఔరా! డాక్టరేట్ తెచ్చుకోవడం ఇంత తేలిక అని తెలిస్తే, నేను కూడా ఎవరో ఒక ఫిరంగిని (అదే పళ్ళుతోమని ఫారినర్ని) (ఆడవాళ్ళనే లేండి) ముద్దు పెట్టేసుకొని, ఫేమస్ అయిపోయి, బిగ్‌బ్రదర్ లో పాలుగొనేవాడిని కదా?

అకటా! ఏంత నష్టం జరిగిపోయినది, అనవసరంగా ప్రతీవారు, తమ మోధో సంప్పత్తిని అనవసరముగా ఖర్చు చేసి, సమయాన్ని, ధనమును వృధా చేసితిరిగా!

అయ్యలూ! ఒక చిన్న ధర్మ సందేహం, మనము డాక్టర్ అని ఎవరినిపిలవాలి?

ఫైవ్‌స్టార్ హోటళ్ళూ (అదే ఆసుపత్రులు, కాల్పులు చేసి, తగాదా పెట్టుకొని, ఎలిబీకోసము, బైలు కోసము వచ్చే పెద్దవాళ్ళను రక్షించే భవనాలు, ఇంకా వెలగలేదా..అదేనండీ మన "కేర్ హాస్పిటల్", అపోలో హాస్పిటల్" లాంటివి అన్నమాట) కట్టే వైద్యులనా?, మేధోసంపత్తితో (రి)సెర్చ్ (వెదికినదే వెదికతం కాబోలు) చేసి కట్టలకట్టలు కాగితాలు సమర్పించినవారినా లేక కులంపేరుచెప్పుకోకుండా బ్రతకలేని(తప్పుతప్పు ఆడలేని, సినిమాలులేని) రియల్ స్టార్ "శ్రీహరినా", ఒళ్ళు దాచుకోకుండా (సిగ్గులేకుండా) కష్టపడే శెట్టిగారినా?

జరంత సోచాయించి చెబుతారు కదూ?

Read more...

ఓటు

>> Wednesday, July 18, 2007

రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వినియోగించకపోవడం నేరము...అలాంటప్పుడు, ప్రజాప్రతినిధులు, రాస్ట్రపతి ఎన్నికకు దూరంగా (తటస్థముగా) ఉండటము ఎంతవరకు సమంజసము...?

మీకు ప్రస్తుతము నిలబడిన అభ్యర్ధులు నచ్చకపోతే, మీవారిని (డమ్మీ)నిలబెట్టండి, వారికే ఓటువేయండి...

పెద్దలూ దయచేసి మీ ఓటును వినియోగించుకోండి.

స్నేహితులూ మీరూ మీ ఓటును ఉపయోగించి, మీ అభిప్రాయము తెలుపండి...

Read more...

ఫిలాసఫీ

>> Monday, July 16, 2007

తల్లి గర్భములో పాపడు కొశ్చను మార్కు ఆకారములో ఉంటాడు..అందుకేనేమో భూమిమీద పడ్డదే మొదలు వాడికి అంతా అయోమయము, అగమ్యగోచరము, జీవితం నిండా ప్రశ్నలు..


రచన : శ్రీ రమణ, రంగుల రాట్నం , నవోదయ పబ్లిషర్సు
స్వేచ్చానువాదం : అనీల్ చీమలమఱ్ఱి
(రచయితకు, పబ్లిషర్సు కు క్షమాపణలతో)

Read more...

సినిమాలు - విలువలు

>> Thursday, June 21, 2007

ఈ టపా ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు...ఈ అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలు అన్నీ నావే...ఎవరైనా బాధపడితే..తప్పు నాదికాదు...

ఏమిటో అందరూ "నేటి సినిమాలొ వికృత పోకడలు" చదివి విలువల గురించి, కళల గురించి మాట్లాడుతున్నారు.

నాలాగ అలోచిస్తే..?

1. మనిషి మార్పును సహజంగా కోరడు...ఎంతసేఫూ పాతది అంటే ఇష్టపడతాదు...హైదరాబాదు నుంచి బెంగళూరు వచ్చినవారు..మా హైదరాబాదులో ఇంత ట్రాఫిక్ ఉందదు, మా హైదరాబాదులో అర్ధరాత్రైనా సిటి బస్సులు దొరుకుతాయి, ఈ బెంగళూరులో (అది ఏ ఊరైనా కావచ్చు) భోజనమే కాదు టిఫిన్ కూడా ఏడ్చినట్ట్లు ఉంటుంది..అదే హైదరాబాదులోనో, విజయవాడలోనో అదుర్స్..ఇలా...మన కాలము వారికి...మల్లీశ్వరి, దేవదాసు, అరాధన..భేషుగ్గా నచ్చుతాయి...ఆ కాలములో వారికి అవి హద్దు మీరినట్ల్లు కూడా కనిపించాయని..మీరు ఎందుకు ఆలోచించరు?

2.పరభాషా నటూలు & గాయకులు .... హిందీ లో పాడగానే "నేషనల్ అవార్డు" వచ్చిందని S.P. గారి భుజాలు తట్టినప్పుడు లేని భావాలు ఈ రోజు ఇతర భాషలవారు తెలుగులో పాడితే వచ్చిందా?..బాలూ గారి హిందీ, ఉత్తర భారతీయుల భాషలాగా ఉంటుందా...వీరే కన్నడము,తమిళములలో పాడొచ్చా?, "రఫీ" గారు తెలుగులో పాడితే..ఆహా..ఓహో అన్నాము..గుర్తులేదా? మరి ఇప్పుడు ఏమైంది?..నటీ నటుల విషయానికి వస్తే..వైజయంతీ మాల, వహీదా రెహమాన్, రేఖ, శ్రీదేవి..వీరంతా అక్కడ పరభాషా నటూలు కారా...మన చిరంజీవీ, నాగార్జునలు ఒకటి రెండు సార్లు హిందీలో ప్రయత్నాలు చేసి, చేతులు కాలి వెనక్కి తిరిగివచ్చారు..అదే వారికి విజయాలు లభించి ఉంటె, రెండు, మూడూ చాన్సులు దొరికి ఉంటే...వీరూ అక్కడ కూడా నటించరా..అప్పుడు వీరినేమనాలి?

3. దుస్తులు...(క్షమించాలి)మీ (చిన్న) పిల్లలకి జీన్శ్ పాంటు, పొట్టి, బొడ్డు కనిపించే డ్రస్సులు వేయటం లేదా..ఇవి ఎక్కడినుంచి వచ్చాయి?..స్కూలు కెళ్ళె పిల్లలు, కాలేజీ వెళ్ళే పిల్లలను చూసారా ఈనాడు?..నిండుగా కప్పుకొని కనిపిస్తున్నారా...కనిపిస్తున్నారు, మేము పెంచుతున్నాము (అని మనల్ని మనం మోసం చేసుకోవద్దు)..ఇదంతా నడుస్తున్న ఫ్యాషన్..అంతే..సినిమాలో కూడా అంతే...(ఈ విషయము మీద ఇంకా ఎక్కువ చెబితే బాగుండదు...)..చదువు, విజ్ఞానం ఎక్కువ ఐతే బట్టలు కూడా కురచ ఐపోతాయి..(ఇది ఒక సైకిల్ లాంటిది...చివరకి మొత్తం విప్పి, తిరిగి మొత్తం కప్పుతారు)

4. ఐనా ఆ వ్యాసములో పేర్కొన్న పుస్తకాలు 60 సం. పైబడినవారు వ్రాసినవి...వారి కాలానికి మన కాలానికి పోచి చూసుకున్నారు...మనము, మన కాలానికి రేపటి తరానికి పోలిక చూసుకొంటె...మమమే బాగా ఉన్నాము అని అనుకొంటామేమో...

6. మాసు & క్లాసు....మంచి సినిమా రాలేదని భాదపడేవారు 100 కి 20 మంది ఉంటారు అని అనుకొంటే..మిగతా 80 మంది ఆ సినిమాని ఎంజాయ్ చేసేవారే...మన్లాంటి ఒకటు ఒక సినిమాను 2 సార్లు 100 పెట్టి చూస్తే...అదే 80% మంది 10 సార్లు 10 పెట్టి చూస్తాడు..మరి నిర్మాతకు ఏది లాభం?

7. కళా పోషణ....నేను బెంగళూలో ఉంటాను...నాకు కళలంటె ఇష్టం..నా కూతురికో, కొడుక్కో సంగీతం, నాట్యం నేర్పించాలని అనుకొంటే..అదీ పద్దతిగా..దానికొరకు ఏ విజయవాడో, కూచపూడో పంపాలి...ఇదే వారు ఇక్కడాఉంటె...కన్నడము, హిందీ, తెలుగు, ఇంగ్లీషు బాషలతో తెచ్నాలజీ, ఫాస్ట్నెస్సు అలవడుతాయి...మరి నాకు పిల్లల భవిష్యత్తు ముఖ్యమా, లేక కళా పోషన ముఖ్యమా?..పెద్ద పెద్ద కళాకారులంతా కూడా కళలను అమ్ముకున్నవారే...ఎవ్వరూ, ఏ ప్రదశన ఉచితముగా ఇచ్చిందీ లేదు...

8..కానీ ముఖ్యముగా మన డైరెక్టరు చేయవలసిన పని కధ మీద కాంసంట్రేషన్ చూపడం, స్క్రిప్టుకి బైండు కావడం...మనవారికి కధలు లేవు అనే జాడ్జ్యం పట్టుకొంది...ఎన్ని నవలలు లేవు, ఎన్ని కధలు లేవు తెలుగులో?..వాటిని చదివిన పాపాన పోలేదు...ఎవరికి వారు మేమే గొప్ప అనే భావనలో ఉన్నారు....

9. స్క్రిప్టు...సెట్టు మీదకు వెళ్ళి మార్చేది కాదు స్క్రిప్టంటె అని తెలుసుకోవాలి...మొన్న కృష్ణవంశీ, శ్రీఆంజనేయం అనే సినిమాకి..తీసింది నచ్చక, చాలా రీలు తగలేసారని పరిశ్రమ కోడై కూస్తుంది..మన అలోచనలు నిముషానికి ఒకసారి మారుతూ ఉంటాయి...ఒకనిముషములో తీసింది మరునిముషములో నచ్చదు., అందువలన ఇలా వేస్టు అవుతుంది..అదే స్క్రిప్ట్ నే అనుసరిస్తే..ఈ అనవసరపు ఖర్చు తగ్గుతుందిగా...

ఇక చాలు ఉంటా...తరువాత కలుస్తా...

Read more...

స్వీట్ మ్యాజిక్

>> Wednesday, June 13, 2007

'స్వీట్ మ్యాజిక్'...ఇదొక పేరుపొందిన స్వీట్ షాపు...విజయవాడ లో బందరు రోడ్డు మీద, కాంధారి హోటల్ కి దగ్గరగా ఉంటుంది..

దీనిలో స్వీట్లే కాదండోయ్..కేకులు, రొట్టెలు (అదే రోటి, నాన్‌లు)కూడా దొరుకుతాయి..ఇవి మా ఇంటిదగ్గరకూడా దొరుకుతాయి..ఇందులో వింతేముంది?..అంటారా...ఉందండి...

ఆ స్వీట్ మ్యాజిక్ లోపల ఒక వాతావరణ సమతులనా యంత్ర గది (అదే ఏసి రూం) ఉంది...అ గదిలోకి వెళ్ళి ప్రశాంతముగా కూర్చొని..కళ్ళు చీకటికి అలవాటు పడిన తరువాత (అంటే డిమ్ము లైట్లు ఉంటాయి)నెమ్మదిగా తలను మీ ఎడుమ వైపుకు తిప్పండి... అక్కడ 'నర్తనశాల' లోని కీచకుడు కనిపిస్తాడు...మీరు కరెక్టే...మన స్వర్గీయ రంగారావు గారే కనిపిస్తారు...

తరువాత వెనకకి తిరగండి...లేదా తల తిప్పండి..అక్కడ మన తోడి కోడళ్ళు...అదేనండీ "సూర్యకాంతం గారు, సావిత్రి గారు మరియు అందరికి పెద్దదైన కన్నాంబ గారు' కనబడతారు..

సరే ఇంక కుడి వైపుకి చూస్తారా..సరే అక్కడ బెంగాలీ బాబు దేవదాసు, అతని ప్రియురాలు పార్వతీ ప్రేమించుకుంటూ దర్శనమిస్తారు.

అలానే ఇంకొంచెం పక్కకి చూస్తే...సీతా కల్యాణం లో సుందాకారుడైన లంకేశ్వరుడు రావణాసురుడు (ఏవరో మీకు నేను చెప్పాలా?, తెలియని వాడు తెలుగు వాడు కానే కాదు కదా) మృదు మందహాసముతో నిల్చొని ఉంటాడు...ఆ పక్కనే సకల కళా సరస్వతి భానుమతి, చచ్చిన చావు చావకుండా చచ్చి, తన మేధస్సుతో రాయల సామ్రాజ్యాన్ని కాపాడిన మహామంత్రి తిమ్మరుసుగారు...గుమ్మడి...కనపడతారు...

ఇంత విషయము ఉన్న దానిని గురించి బ్లాగించి మీకు తెలుపుదామని నా ప్రయత్నం...ఇవన్నీ సినిమ పోస్టర్లు కాదు (పాత ఆంగ్ల సినిమా పోస్టర్లు మనకు హైదరాబాదు లోని ప్రసాద్స్ లో కనిపిస్తాయి). నలుపు తెలుపులలో ఉన్న భంగిమల చాయా ఛిత్రాలు...

మాంఛి ఎండలో వెళ్ళిన నాకు, శరీరానికి చల్లదనమే కాకుండా, వీనులవిందైన పాత హిందీ పాటలతో చెవులను, ఈ ఫొటోలతో కళ్ళనూ...మొత్తంగా నా మనస్సును చల్ల బరిచినది....ఈ....స్వీట్ మ్యాజిక్...

ఎప్పుడైనా విజయవాడ వెళ్తే...స్వీట్ మ్యాజిక్ వెళ్ళ్డానికి ప్రయత్నించండి..

ఇది నిజంగా స్వీట్ మ్యాజిక్కా కాదా...మీ అభిప్రాయాలను తెలుపుతారు కదూ...

Read more...

కాల్చేయండి!

>> Tuesday, June 12, 2007

అదేమిట్రా..వీడికి బద్దకము పోయి..వీరత్వము వచ్చిందా..అని 'హాచర్యపోవొద్దు..'...నేను శాంతి కాముకుడిని...అర్రే..! నొట్లో వేలేసుకున్నరా..నిజమే లేండి..మనకంత సీను,విషయము కుడా లేవు..నేనుకుడా..మీలాగే సగటు భారతీయుడినే..దొంగలు, గూండాలు రాజకీయనాయకులు అవుతుంటే నవ్వుకోవటం మినహా ఏమీ చెయలేని వాడిని, దొంగలు ఊర్లకి ఊర్లు (అదే రింగులు, ఫాబులు అని) అని పంచుకుంటుంతే, ఆ ఊరినించి పారిపోవటం మినహా మీలాగె ఏమీ చేయలేని వాడిని..ఇంకచాలంటారా...సరే..అలాగే చేదాం..అనినా ఈ సొల్లు ఏమిటి అంటారా...అదేనండి...
కాల్చేయండి అనేది టెంగ్ల (టెల్గు) పదము...అంటే..మన భాష (తెలుగు లో) ఫోన్ చేయండి అని.. ఫోన్ అనేది తెలుగు పదం కాకపోయినా తెలుగులో బాగానే స్థిరపడిన పదం.. ఇక విషయానికి వస్తే...
రాజా: ఇప్పుడు ట్టైం - ట్టెన్ తర్టి - మీ కాల్చేసింది సునీత, రాజాలకు..
రాజా: హాయ్! సునీటా - హౌ ఆర్ యు?
సునీత: య! రాజా...కూల్...(ఎండాకాలం లో ఈ కూల్ ఏమిటో)
*****
సునీత: మరి ఆల్రెడీ టెన్ థర్టి అయిందికదా...ఇంక ఈ రోజు కాలర్లు చూద్దామా...(ఇవేమన్నా చొక్కా కాలర్లా చూడడానికి, ఫోన్ చేసేవారిని వింటారమ్మా...చూడరు)
*****
రాజా: ఈ రోజుకి సంవత్సరము నిండిన మిస్టర్. రవి మరియు రాధలకు వివాహ శుభాకాంక్షలు... (ఆహ! ఎమి పద ప్రయోగమురా...!)
(పాట: చిలుకా ఏతోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక...) ***
సునీత: రేపు మీరు కాల్చేయవలసిన నంబరు *******. కాల్చేస్తారు కదూ...
******
విషయం అర్ధమైనదా? ఈ గోల, తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు ప్రముఖులకు ఒకప్పటి దేవాలయమైన "ఆల్ ఇండియా రేడియో - విజయవాడ వారి వివిధ భారతి" వారి FM రేడియో జాకీలది.
ఈ కార్యక్రమము విన్న తరువాత..నేను ఎందుకు బ్రతికి ఉన్నానా అని అనిపించిది....అంటె కాదు...సీతా కల్యాణం లోనో మరేదో తెలియదు కానీ రావణాసురుడు పేగులు పీక్కొని చస్తాడు చూడండి...ఆలా చేయాలని పించింది...ఏమిచేస్తాం...సగటు భారతీయుడినిగా...ఆనీ మూసుకొని బెంగళూరు వచ్చేశా..

ఇవేకాదు...ఇలాంటివి చాలా కార్యక్రమాలు AIR ఒక్కటే కాదు....అన్నీ FM
ఏ రేడియో విన్నా ఏమున్నది గర్వకారణం...తెలుగు భాష సమస్తం టెల్గు కే బానిసత్వం.
AIR వారు ఇప్పటికన్నా నిద్ర లేస్తే బాగుంటుండి...

చెప్పుకుంటే..చాలా ఉన్నాయి....మళ్ళా చెప్పుకుందాము...

అప్పటి దాకా షెల్వ్....సోరి...సెలవు...

Read more...

త్వరలో

>> Monday, June 11, 2007

త్వరలో...."త్యాగరాజ కీర్తనల గురించి తెలుసుకుందాము". (బద్దకము వదిలి వ్రాస్తానని మనవి చేసుకుంటునాను..)


మీ
అనీల్ చీమలమఱ్ఱి

Read more...

ముద్దు పెట్టుకోవటము వలన "AIDS" వ్యాప్తి చెందదు

>> Saturday, April 28, 2007


ముద్దు పెట్టుకోవటము వలన "AIDS" వ్యాప్తి చెందదు


అందుకు ఉదాహరణ

దీనిపై ఎందుకు రచ్చ..?

Read more...

వీడ్కోలు

>> Saturday, April 14, 2007


తెలుగు నాటక రంగంలొ, తెలుగు చలనచిత్ర రంగం లో..రెండిటిలోనూ తన అసమాన ప్రతిభ తొ ప్రేక్షక హృదయాలలో నిలచిపోయిన శ్రీ ధూళిపాళ సీతారామ శాస్త్రి - గుంటూరు జిల్లా, పల్నాడు తాలూకా లోని దాచేపల్లి గ్రామములో సెప్టెంబరు 24, 1921 న జన్మించారు. 1935 లో స్త్రీ పాత్రవేషధారణతో తన యాత్రను మొదలుపెట్టి, 1941 లో గుంటూరు లో స్టార్ ధియేటరును స్థాపించి నాటక ప్రదర్శనలు ఇచ్చారు.

రంగస్థలము పై 'మయసభలో ధుర్యోధనుని' పాత్రను తన అసమాన ప్రతిభతో పోషించి 'అభినయ సామ్రాట్' అని బిరుదు పొంబినారు.

ఇక వెండితెర పై 'భీష్మ' చిత్రముతో ప్రవేశించి, సుయోధన, రావణ, మైరావణ, శకుని వంటి పాత్రలతో విషము కక్కి, తెలుగింటి ఆడబడుచులచే 'ఛీ' అనిపించుకొన్న మహానటుడు.


వారినే 'రావమ్మా మహాలక్ష్మి రావమ్మా' అంటూ..హరిదాసుగా పాత్రలను పోషిస్తూ, ఆ హరిదాసు పాత్రనే తన జీవితముగా మలచుకొని, ఆ హరిలో ఐక్యమైన "నడిప్పిళ్ పులి నడత్తల్ పసువు" (నటనలో పులి, నడతలో ఘోవు) శ్రీ ధూళిపాళ గారికి ఇవే తెలుగు బ్లాగర్ల తరఫున అశ్రు నీరాజనాలు, నివాళిలు.

పురస్కారాలు :

తెలుగు వెలుగు - ఉగాది పురస్కారం - తెలుగు విశ్వవిద్యాలయం

నాటక కళా ప్రపూర్ణ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాటక అకాడమి

ఆత్మ గౌరవ పురస్కారం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

2007 ప్రతిభా పురస్కారం - ఆజో. విభో ఫౌండేషన్.

ఇవికాక ఎన్నో, మరెన్నో బిరుదులు, ప్రశంశలు, సన్మానాలు, అందుకున్న అభినయ ఋషి శ్రీ ధూళిపాళ.

Read more...

మాతా నిర్మలా దేవిజీ

>> Wednesday, March 14, 2007



ఈ ఫొటోలలో ఉన్న స్త్రీ తననై తాను మాతా నిర్మలా దేవి అని, దైవాంశ సంభూతురాలని చెప్పుకొంటుంది. పైగా ఈమెకి అపరిమితమైన అనుచరులు, భక్తులు ఉన్నారు. అంతవరకూ ఐతే ఫరవాలేదు, కానీ 'జాతీయ పతాకాన్ని తన పాదాలదగ్గర ఉంచుకొంటుంది.'









ఈ అమ్మని దేనితో కొడతారు...నేనైతేనా...చె...కొడతాను...మరి మీరు...

Read more...

నేనొచేశానోచ్!!!

>> Thursday, March 08, 2007

త్వరలో మీ ముందుకు వస్తా...!

Read more...

లావణ్య & అనిల్

>> Sunday, February 18, 2007


వస్తారు కదూ...

Read more...

వివాహమహోత్సవ ఆహ్వాన పత్రిక

>> Thursday, February 15, 2007




సకుటుంబ సపరివార స్నేహిత సమేతమముగా విచ్చేసి నన్ను & లావణ్యను ఆశీర్వదింప ప్రార్ధన....
వస్తారు కదూ..
బస్సు రూటు:
సిటి బస్టాండ్ నుండి - 3వ నెంబరు ప్లాట్‌ఫారం - నున్న కు వెళ్ళు బస్సులు - పైపుల రోడ్డు బస్‌స్టాప్. శ్యామలా స్టూడియో రోడ్డు.
రైల్వే స్టేషన్ నుండి - నున్న కు వెళ్ళు బస్సులు - పైపుల రోడ్డు బస్‌స్టాప్. శ్యామలా స్టూడియో రోడ్డు.

Read more...

లెజెండా లేక సెలెబ్రిటి నా ?

>> Thursday, February 01, 2007


ఇంతకీ చిరంజీవి లెజెండా లేక సెలెబ్రిటి నా ?

ఎవరికైన తెలిస్తే చెప్పగలరు..


(ఇది ఎన్నికలే అనుకోండి, మీరు లెజెండ్ గా ఎవరిని గెలిపిస్తారు?)





Read more...