పంచ రత్నాలు

>> Sunday, October 12, 2008

ప్రస్తావన - ౧
విశ్వ సృష్టిలోనూ, మానవ జీవితములోనూ, పంచ సంఖ్యకు విశిష్టత కనబడుతుంది..పంచభూతాత్మికమైనది ఈ జగత్తు. పృధ్వి, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశము - వీటిని పంచభూతాలు అంటారు.వీటి సంగమము వలన ఏర్పడ్డదే ఈ లోకం. ప్రాణులన్నీ ఈ ఐదు తత్వాలవల్ల ఉధ్బవించినవే. ప్రాణపానవ్యానోదాన సమాన వాయువులనే ఈ ఐదు పంచప్రాణాలనే పేరుతో దేహాన్ని నడిపిస్తూ ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు ఐదు. ఇంద్రియాది విషయాలు కూడా ఐదే. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ, అనే కర్మేద్రియాలు కుడా ఐదే. ఇక జ్ఞనేంద్రియాలునూ ఐదే. త్వక్, చక్షుః, శ్రోత్ర, జిహ్వ, ఘూణములు అనగా చర్మము, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు, చేతుల వ్రేళ్ళు, కాలివ్రేళ్ళు కూడా ఒకొక్కటీ ఐదే. ఈ ప్రపంచానికి, పంచ సంఖ్యకు అవినాభావ సంబంధం ఉన్నట్లు రూఢీగా తెలుస్తుంది.

మనుష్యుని జన్మకు మూలం అన్నం. "అన్నాద్భవం తిభూతాని" - ఏ ప్రాణులైనా అన్నం నుంది ఉద్భవించినవే. మానవుని జన్మ ప్రాణకోటిలో విశిష్టమైనది. ఆనందం మానవుని గమ్యం. అన్నగత ప్రాణియైన మానవుడు తన ప్రాణాన్ని కుదుటపరచుకొని మనస్సు ఆలోచన్లో ప్రవేశపెట్టి విజ్ఞానాన్ని సంపాదించి ఆనందస్థితిని అందుకొంటాడని ఉపనిషత్తులు ప్రభోదిస్తాయి. ఈ వికాస క్రమాన్నంతటినీ 'పంచకోశ శుద్ధి' అని తాత్వికులు పేర్కొన్నారు.

Read more...