కొన్ని మంచి పత్రికలు

>> Tuesday, October 31, 2006

కొన్ని మంచి పత్రికలు

మనందరికీ ఈ వల (అంటే internet) లో కధలు, కవితలు చదవడం అలవాటు. మీ అందరికీ కొన్ని మంచి పత్రికలను పరిచయం చెద్దమనుకొంటున్నాను. వీటి గురించి ఎవరికైన తెలుసుంటె...మంచిదే...తెలియని వారికోసం ఈ పరిచయం..
1.)

రచన
సంపాదకుడు: శాయి
వెల: 35 రూ / 10$
ప్రచురణ: హైదరాబాదు
నాణ్యత : బాగుండదు

ఈ పత్రిక ప్రవాసాంధ్రులలో చాల పేరు పొందినది. ఈ పత్రిక ముఖ్యంగా ప్రవాసాంధ్రుల కొరకు నడుపబడుతున్న పత్రిక అని నా అభిప్రాయము.. దీనిలో సాహిత్యానికే పెద్ద పీట. ప్రవాసాంధ్రుల కధలు, కవితలు, సమీక్షలు, విశ్లేషణలు ఎక్కువ...

ఇది మాసపత్రిక - కానీ మాసం మాసం రావడం అనుమానమే..(దీనికి చాలా కారణాలు ఉన్నాయంటారు)

2.

పత్రిక

గౌరవ సంపాదకుడు: శ్రీ రమణ (వీరి గురించి పాఠకులకు ప్రత్యేకంగా చెప్పనవసరము లేదు)
వెల: 5 రూ / 10 రూ (ప్రత్యేక సంచిక)
ప్రచురణ: మౌనిక పబ్లికేషన్స్ - హైదరాబాదు
నాణ్యత : బాగుంది

ఈ పత్రిక కూడా సాహిత్య భరితమైనది. ముఖ్యముగా సంపాదకీయం "xxxx - మానవ సంబంధాలు" అదిరిపోతుంది..దీనిలో నానీలు బాగుంటాయి (అర్ధం అయితె), వ్రాసినవారే మళ్ళా వ్రాస్తారు..కొత్తవారికి అవకాసం ఎక్కువ ఇచ్చినట్లు కనపడదు.

కధలు, కవితలు, కాకరకాయలు ఎక్కువ.

ఇది మాస పత్రికో పక్ష పత్రికో గుర్తు లేదు.

3.

రసమయి
సంపాదకుదు : నండూరి పార్ధసారధి
వెల:35 రూ (30 రూ లకు తగ్గించారని చదివినట్లు గుర్తు)
ప్రచురణ : హైదరాబాదు
నాణ్యత : అదిరిపోతుంది

కధలు కాకరకాయలు లేవు. ఇది మాత్రం ప్రతి ఇంటా ఉండవలసిన పత్రిక, మొన్నటి వరకూ భారత భాగవతాల నుంచి కృష్ణుడి గురించి 'క్రిష్ణ సంచికలు (మొత్తం 25 దాకా) ప్రచురించారు...అదుర్స్, ఇంక భానుమతి గురించి, సంగీతం గురించి, అన్నమయ్య రచించిన ప్రజలకు తెలియని పద్యాల గురించి, ఎందుకులే ఒకటా రెండా ....
తప్పకుండా తెప్పించుకోండే...ఈ మాస పత్రికని

చివరిగా
4.

చినుకు
సంపాదకుడు : నండూరి ****
వెల: 10రూ
ప్రచురణ: విజయవాడ
నాణ్యత : ఫరవాలేదు.

కధలు, మినీ కవితలు, కార్టూన్లు దీనిలో వస్తువులు. అదృష్ట దీపక్, నగ్నముని, ఇంకెందరో ఇందులో కనిపిస్తారు.
కొత్తవారికి అవకాశాలు ఇస్తారు.

పైన చెప్పిన పత్రికలు బయట దొరకవు...చందాదారులు కావటమే మార్గం.
100 కి 100 శాతం ఇవి మంచి పత్రికలు అని మరొక సారి నొక్కి వక్కాణిస్తున్నాను.

Read more...

సవతి

>> Wednesday, October 18, 2006

దేశానికి భారతమాత ఒక్కరే ఉంటారు, తెలుగుతల్లి అంటే ప్రత్యేక దేశం కోసం ప్రయత్నాలు చేస్తున్న కిందకే వస్తుంది - వి. ప్రకాశ్. (TRS ముఖ్య కార్యదర్శి)

అబ్బో అబ్బో ఏమి తెలివో.. ఇంతటి తెలివి వంతులను నాజీవితం లో ఎపుడూ చూడలేదు.

తెలుగుతల్లి విగ్రహం పెట్టడం అహంకారానికి నిదర్శనం.

అబ్బో ఏమి చెప్పారండి, మరి తెలంగాణా తల్లి, తెలంగాణా భవనం.. ఇవేమిటి?

తెలంగాణాతల్లి అంటె తెలంగాణా భూమి పుత్రులుగా మేము ఆవిధంగా అంటున్నాము...

నీ తెలివి తెల్లారా...తెలుగు భూమి, తమిళ భూమి, తెలంగాణ భూమి అంటు వేరే ఉందవని, భాషను బట్టి ప్రాంతాలు ఏర్పడ్డాయనీ నీ కు ఎప్పుడు తెలుస్తుంది?


తెలంగాణ - ఆంధ్ర ప్రాంతాల ప్రజల జాతి ఒకటికాదు, ఒకే జాతి అంటే భాషతో పాటు సంస్కృతి, ఆచారవ్యవహారాలు, సాంఘీక జీవనవిధానం ఒకే విధంగా ఉండాలి.

నీ బొం...తెలంగాణాము అంటే తెలుగులో గానము..ఒక అద్భుతమైన పాట. తెలుగు అంటె నెల్లూరు, తిరుపతి, కడప, విజయవాడలలో మాట్లాడేది మాత్రమే కాదు...చెన్నపట్టణపు సరిహద్దుల మొదలు కన్నడిగుల చెవులను తాకుతూ, విజయనగరపు రాజధాని "హంపీ" లోని రాతి కట్టడాల ను తాకుతూ, గోల్కొండ లో గోలచేస్తూ, భద్రద్రి లోని రాములవారి పాదాలు తాకుతూ, ప్రకాశం బారేజీ మీద నిలుచొని క్రిష్ణమ్మ తో పరాచకాలాడుతూ, నన్ను తాకగలవా అని విశాఖపట్టణం లో సముద్రుదితో ఆడుకొంటూ, జగ్గన్నాధుని చేవులకు చెరేదే ఈ గానం. అదే తెలంగాణం.

నువ్వు మాట్లాదేది తెలుగు, రాసేది తెలుగు, తిట్టేదీ తెలుగు, నీ తెలుగు లో ఉండేది కేవలము యాస అని, దీని మూలాధారం తెలుగని తెలుసుకో.

పత్రికలవాళ్ళతో, మీడియా వారితో మాట్లాడుతున్నప్పుడు కొంచెము ఆచితూచి మాట్లాడడము చెయ్యి, నీ రాజకీయ భవిష్యత్తుకు అది చాలా అవసరము.

Read more...

విజయోత్సవాలు!

>> Friday, October 13, 2006


కొద్ది కాలం క్రిందట దోమల రాజ్యం లో "మహానాడు" జరిగింది.

కుర్ర దోమలు, ముసలి(పెద్ద)దోమలపై విరుచుకుపడ్డాయి -"ఇంతకాలం TRS కాంగ్రెస్సు తో కలసి ఉన్నట్లుగా, మీరు ఆ మనుష్యులతో కలసి ఉన్నారే, ఎప్పుడైనా ఆ మనుష్యులు మిమ్మల్ను పట్టించుకున్నారా?, ఎప్పుడూ చంద్రశేఖర రావుని చూసినట్లు (పురుగుని చూసినట్లు) చూసేవారుకాదా?, మిమ్మలని వాళ్ళ మీడియ ఎప్పుడైన మొదటి పేజీ లో కవర్ చేసిందా?- అని.

ఓ పెద్ద దోమ నచ్చచెప్పబోయింది..చూడు మనుష్యులన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి., వాళ్ళలో వాళ్ళకే అనేక సమస్యలు.. సాగునీటి కుంభకోణానికి విలువ ఇవ్వాలంటాడు ఒక సబ్ ఎడిటరు..,కాదు తాగునీటి కుభకోణానికి అంటాడు మరొకడు.. పోనీ ఎడిటర్ గారు తెగించి ఎదో ఒకటి పెట్టేద్దామంటె పైన సూపర్ ఎడిటర్ Y.S గారి చివాట్లు తప్పవు. ఏ ఫాంట్ లో వేయాలో, ఎక్కడ వేయాలో ఆయనగారి చేత పాటలు తప్పవు..ఈ సంబరంలో, మన మీద వార్త వ్రాయడమే అబ్బురం., పైగా హెడ్‌లైన్స్ లో కావాలనుకోవడం మరీ విడ్డురం.

ఏం? ప్రాజెక్టుల గురించి, హౌసింగ్ స్కాముల గురించి, కాందీశీకుల భూమి గురించి, తెలుగు బాషా పరపతి గురించి, రింగురోడ్ల గురించి., ఇలా అన్నిటి గురించీ వ్రాస్తున్నారుగా..మన గురించి వ్రాయడానికేమైంది? - అని సణిగిందో యువత.

"అవన్నీ సాధారణ ప్రజలను ఆర్ధికంగా బాధించి, నష్టపెట్టేవి., అందుకని వాటి గురించి పట్టించుకుంటారు."..పెద్దరింకంతో నచ్చ చెప్పబోయిందో ముదుసలి.

"ఓహొ! మనం మాత్రం కోన్‌కిస్కా గాళ్ళమా?, మన వలన హెల్త్ పోతుంది కదా..'హెల్త్ ఈజ్ వెల్త్' కాబట్టి వాళ్ళకి వెల్త్ కూడా పోయినట్లే"...అంది ఇంగ్లీషు మీడియం లో చదువుకోని., బ్రిటీషు లైబ్రరీ లో సభ్యత్వము తీసుకొన్న ఒక BPO దోమ.

ఈ భాగ్యానికే ఇంగ్లీషు కొటేషన్ ఎందుకు..."ఆరోగ్యమే మాహా భాగ్యం" అనొచ్చుగా అందో ప్రభుత్వ గ్రంధాలయములో స్థిర నివాసము ఏర్పరచుకొన్న లావుపాటి దోమ..(తెలుగు పుస్తకాల జోలికి వెళ్ళేవారు లేకపోవడము వలన పుస్తకామీద ఉన్న దుమ్మును కూడా దులపక నిద్రపోతున్నాడు లైబ్రేరియన్, అందువలన బద్దకించి దోమలు కూడా అక్కడనే నివాసము ఏర్పరచుకొని ఎగరడము కూడా మర్చిపోయాయి).

"ఆ మన వలన మనుషులకు పోయె ఆరోగ్యం ఎంతలే.. ఐనా మన రాతను, భారత దేశాన్ని ఎవడూ బాగు చేయలేడు"..అందో విదేశాలకు వెళ్ళోచ్చిన ప్రవాస దోమ.

అయినా ఈ మస్కిటో కాయిల్సు, ఆలౌట్లు వెలిగించి మనమంటే ఖాతరు లేకుండా ఉన్నారు, సన్నాసి ఎదవులు అని అరిచాడు నరేంద్ర ని కుట్టొచిన దోమగాడు.

ఆ రోజులే వేరు, మనకోసం దోమతెరలు కుట్టించేవారు, దాని కోసం రాతాలు, పందిరి మంచాలు తయారు చేయించేవారు..ఇప్పుడేముంది?., చిన్న స్విచ్ వేస్తే చాలు సన్నని పొగ రావటం, దెబ్బకి దోమలు చచ్చినట్లు టీవి లొ యాడ్స్ - అంతా పోయేకాలం అని గొణిగింది, గాంధీ కాలంనాటి దోమ.

"ఠాఠ్! నేనొప్పుకోను" అని అరిచిందో యువ దోమ. " ఇలా ఐతే మన పరువేమి గాను? మనల్ని ఉత్తి అల్పప్రాణులనుకోరూ?"

"అల్పప్రాణివి కాకపోతె పెద్ద..పులివా? లేక బలా సాహెబ్వి అని అనుకుంటున్నావా? మనల్ని చీమా, దోమా అని తీసిపారేస్తారు. ప్రాస కుదిరిందనే కాదు, ఆకారంలో ఇంచుమించు ఒకటే అనికాదు, చీమకాటుకి ఎంత విలువో దోమకాటుకి అంతే విలువ అని తాత్పర్యం!" బోధపరిచంది అధ్యక్ష స్థానములో ఉన్న ముసలిదోమ.

"కామ్రేడ్స్! చీమకాటుకి, దోమకాటుకీ ఉన్న తేడా చాటిచెబుదాం, ఎప్పటికైనా దోమలంటె మనుష్యులు భయపడేట్లు చేద్దాం, పోరాడితే పోయేదేమీలేదు ఈ అల్పప్రాణులనే పేరు తప్ప.." అని ముక్తకంఠం తో అరిచాయి విరసం, సరసం, నీరసం ( ఇవి కమ్యూనిస్టు గుంపులు) సభ్యులైన యువ దోమలు.

దీనితో హెడ్‌లైన్స్‌కెక్కుతారని భ్రమ పడుతున్నారా?., ప్రశ్నిచిందో పండు దోమ.

"బద్‌నాం భీతొ నాం హై" అన్నారు మీలాంటి పెద్దలే! ఈనాటి పేపర్లో హెడ్‌లైన్స్ ఏమిటి? యాక్సిడెంట్లు, అవినీతి చర్యలు - ఇవేగా! రాష్ట్రపతి ప్రసంగమైనా క్రింద వేయడమే! ఇక నోబుల్ ప్రైజ్ న్యూసైతే ఎక్కడో లోపలి పేజీలలో వేస్తున్నారు! మనము హెడ్‌లైన్స్ కెక్కాలంటే ఎదో వెధవ పని చేయాలంతే! నేటి నుండి మా సమరం ప్రారంభం!" అన్నాడు మంచి ఊపు మీద ఉన్న ఒక కుర్రదోమ, అంతే అంతలో మంచి కత్తిని, ఒక రంగు రంగుల తలపాగానీ బహూకరించి 'జై' అన్నాయి మిగిలిన కుర్రదోమలు.

ఇక అప్పటినుండి దోమలసేన ఘటోత్కచుడి సేనలా ద్విగుణం, బహుళం ఇంది. శాంతి చర్చల తరువాత మావోయిస్టుల్లా అనేకమంది కొత్తవాళ్ళను రిక్రూట్ చేసుకొన్నాయి. ముక్కుతో రాకెట్‌లాంచర్లా నేరుగా ఎలా ఎటాక్ చేయాలో నేపాల్ వాళ్ళ సహాయంతో వాళ్ళకు బాగా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. మునిసిపాలిటి వారికి లంచాలించి మురుగ్గుంటలు యిబ్బడిముబ్బడిగా పెరిగేట్లు చూసారు.

ఇక చూస్కొండి, ఎక్కడ చూసినా దోమలే! బోల్డు బోల్డు జ్వరాలు, మోకాళ్ళ నొప్పులు, హై టెంపరేచర్లు. ఈసారి జరిగిన సమావేశంలో కుర్రదోమలు బోర విరుచుకున్నాయి - "చూశారా, మా ప్రతాపం. అందరూ మమ్మల్ని తలుచుకొనేవారె!" అని.

పెద్ద దోమలు పగలబడి నవ్వాయి - ఏడిసినట్లు ఉంది. కష్టమంతా మనది, పేరు ఇం'కోళ్ళ్'ది. ఆ కీళ్ళనొప్పుల వ్యాధికి చికెన్‌గున్యా అని పేరు పెట్టారు. చికెన్ వల్లనే వస్తోందనుకొని కోళ్ళు తినడం మానేశారు. మన ప్రజ్ఞేం తెలిసింది? మనుష్యులకు కోళ్ళంటే భయం పట్టుకొంది కానీ మనమంటే కాదు అని ఎద్దేవా చేశాయి.

"పోనీ ఎదో విధంగా ప్రతిపక్షాలు అల్లరి చేయడానికి అవకాశం ఇచ్చాంగా" అని సమర్ధించుకోబోయాయి కుర్రదోమలు.

"అదంతా వాళ్ళ కుట్ర! రోగాలు లేవు, ఏమీలేవు, అదంతా 'మిత్' అని కొట్టిపారేశాడు ఆరోగ్యమత్రి" అంది చిరాగ్గా BPO దోమ.

"మిత్ అనే బదులు దానికి దగ్గరగా ఉన్న మిధ్య అనే పదం వాడవచ్చుగా" అంది తెలుగు సంఘాలవాళ్ళను కుట్టిన దోమ కోపంగా.(ముఖ్యంగా అనిల్ చీమలమఱ్ఱి ని)(ఇదే దోమ, గ్రంధాలయం లోని దోమ అని గ్రహించగలరు).

"మాయంటావూ, మిధ్యంటావూ" అంటూ శ్రీశ్రీ గేయం ఆలపిస్తూ ఓకుర్రదోమ సమావేశం అవుతుండగానే సరాసరి ఆరోగ్యమంత్రి ఇంటిమీదకి దాడికెళ్ళింది.

కానీ ఆయన ఓపట్టన చలించే ఘటం కాదు. 'నేను డాక్టర్ని కాను, మాఇంట్లో జ్వరం ఎందుకొచ్చిందో తెలియదు. కానీ దీనికి కారణం అపరిశుభ్ర పరిసరాలనీ, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అనడం, ప్రతిపక్షాల బాధ్యతా రాహిత్యం మాత్రమే!, ఇది ప్రతిపక్షాల కుట్ర." అని వాదించాడు.

దోమల వలన జనాలు ఛస్తున్నారని వీళ్లనడం, కాదని ప్రభుత్వం వారు వాదించడం, దానాదీనా దోమలకు రావలసినంత ఖ్యాతి రాకపోవడం జరిగింది.

కుర్రదోమలు విడిగా సమావేశమయ్యాయి. కొడితే ఏనుగు కుంభస్ధలాన్నే కొట్టాలన్న నిర్ణయం జరిగింది. వేస్తే గీస్తే చంద్రశేఖరరావులా ఢిల్లీలోనే పాగా వేయాలని నిశ్చయించారు. ఇరవై మది సభులతో ఆత్మాహుతి దళం ఏర్పాటయింది. హై సెక్యూరిటీ ఉన్న ప్రధనమంత్రి ఇంటిపైననే దాడికి వెళ్ళాలని నిశ్చయించాయి పాలిట్‌బ్యూరో. భగత్‌సింగ్ ఏకంగా పార్లమెంటులో బాంబులు వేయడం చేతనే అందరి దృష్టినీ కర్షించాడనీ, అల్లూరి సీతారామరాజు మద్రాసు అసెంబ్లీ మీద బాణాలేయకపోవడం వల్లనే సరైన ఫోటో కుడా లేకుండా చరిత్రలో మరుగున పడ్డాడని దృష్టాంతాలు వల్లేవేయడం జరిగింది.

ఆత్మాహుతి దళం కదిలింది. ప్రధాని మనుమలు రోగాన పడ్డారు. డెంగ్యూ వ్యాధి అనేది ఉందని, దానివలన ప్రజలు మరణించే ప్రమాదం ఉందని ఎట్టకేలకు అధికారికంగ ప్రభుత్వం ఒప్పుకుంది. దోమల గురించి అన్ని పత్రికలూ మెయిన్ బ్యానర్ హెడ్‌లైన్స్ ఇచ్చాయ్.

దోమల రాజ్యం లో ప్రస్తుతం విజయోత్సవాలు జరుగుతున్నాయి.

ఈ కధని శ్రీ మొక్కపాటి గారు, గ్రేట్ఆంద్రా.కాం నందు వ్రాస్తే నేను కొంచెము మార్పులు చేసి, నా పద్దతి లో అందిస్తున్నాను..మొక్కపాటి గారికి జాబు వ్రాయాలంటే ఇక్కడ నొక్కండి.

Read more...

రామా కనవేమిరా..! శ్రీ రఘురామ కనవేమిరా?

>> Thursday, October 12, 2006





రామా కనవేమిరా..! శ్రీ రఘురామ కనవేమిరా?

ఇదేమిటీ ఈ పాట వ్రాసాడు అని అనుకొంటున్నారా?....కాదండీ చదవండి..మీకే తెలుస్తుంది.

కడప జిల్లా "ఒంటిమిట్ట" లో శ్రీ కోదండరామస్వామివారు కొలువై ఉన్నారు...ఒంటిమిట్టకు ఉన్న విశేషాలు ఏమిటంటే:

ఈ గుడిని చోళులు, విజయనగర రాజులు కట్టించారు.

ఈ గుడిలో, కేవలము సీత, రామ మరియు లక్ష్మణులు మాత్రమే దర్శనమిస్తారు. హనుమానులు గారు లేరు...

ఈ మూడు విగ్రహాలు కలసి ఒకే రాతి పై చెక్కబడ్డాయి.

32 స్తంభాలతో నిర్మించిన "మధ్యరాగమడపం" అతిసుందరమైనది...

దీనిని చూసి ఒక ఫ్రెంచ్ యాత్రికుడు, Tavernier, "one of the grandest pagodas in the whole India". అని అన్నారని ఒక సమాచారము.

ఇవేకాక,

శ్రీ మధ్భాగవతం వ్యాసకర్త "శ్రీ బెమ్మర పోతనామాత్యులు" ఇక్కడివారే..


మాకు తెలుసు ఈ సోది ఆపు అంటారా?...సరె..అసలుది క్రిందుంది చదవండి.

ఆ మండపము మధ్యలో రాతితో చేసిన పుష్పం, దాని మధ్యలో ఒక రాతి మొగ్గ అమర్చారు..ఆ మొగ్గలో వజ్రాలు పెట్టి ఉంటాయని కొందరి అనుమానము / అపోహ /ఊహ .

పురాతన దేవాలయాల్లో విగ్రహాల క్రింద నవధాన్యాలు, వజ్ర వైఢూర్యాలు, నవరత్నాలు ఉంచి ప్రతిష్ట చేస్తారని నమ్మకము.

ఆ రాతిమొగ్గ చోరీ అయ్యిందని సమాచారము., ఈ దొంగతనము జరిగిన రాత్రి, వాచ్‌మెన్ను ఇంటికి పంపి దేవాదాయ శాఖాధికారి, పురావస్తు శాఖాధికారి, మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు గుడిలో మద్యం సేవించినట్లు వినికిడి.

గుడిలో మద్య సేవనం, ఆపై దొంగతనం....రామరామా...

ఓ రామా ఇకనైనా నిద్రలే...ఎమా మొద్దునిద్ర...

Read more...

Point Of View

>> Monday, October 09, 2006

British Diplomat paid a courtesy visit to Lalloojee.

During a Garden party at the Palace, he thought of entertaining Lalloojee with the following magic of numbers.

He said, "Your excellency,

Look at the value of the alphabet:

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26


Now, look at this Sir, if we calculate together it will be:

H A R D W O R K
8 1 18 4 23 15 18 11 = 98 % Only

K N O W L E D G E
11 14 15 23 12 5 4 7 5 = 96 % Only

L O B B Y I N G
12 15 2 2 25 9 14 7 = 86 % Only

L U C K
12 21 3 11 = 47 % Only

Sir, you should look at the final one, which is most important.

A T T I T U D E
1 20 20 9 20 21 4 5 = 100 %

Sir, do you find it useful?

This magic can work on your people to improve themselves, increase productivity, and make your Kingdom prosperous.

Sir, I can arrange to send our experts to coach your people. We can do it in less than a year"

Lalloojee thought for a while; and said,

"I have better formula. See this......

C O R R U P T I O N
3 15 18 21 16 9 15 14 = 111 %

Do you want me to come and teach your people? I can do it in less than one week."

Read more...

క్షమాభిక్ష

>> Thursday, October 05, 2006

ఇండియన్ పీనల్ కోడ్ (IPC) 302, భారత శిక్షా స్మృతిలో అతి పెద్ద శిక్ష - "ఉరి శిక్ష"

ఉరిశిక్ష ఎవరికి వేస్తారు...కరడు కట్టిన తీవ్రవాదులకు, పాశవికంగా హత్యలు చేసేవారికి.

మరి ఉరిశిక్ష పడిన వ్యక్తులకి మానవతా దృక్పధం తో మన ప్రభుత్వం కొంతకాలంగా క్షమాభిక్షను ప్రసాదించి "యావజ్జీవితం కారాగారం" లోనే ఉండే అవకాశాలను కల్పించింది...ఉదా: నళిని భాగ్యనాధన్, రాజీవ్ గాంధీ ని చంపిన వ్యక్తులో ఒకరు.

అయితే భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నతమైన పార్లమెంటు భవనము పై దాడి కేసులో, మరణ శిక్ష ఖరారైన నిందుతుడు అఫ్జల్ గురు క్షమాభిక్ష కొరకు చాలమంది ప్రముఖులు ప్రయత్నిస్తున్నారిప్పుడు. కరడు కట్టిన తీవ్రవాదిగా ముద్రపడ్డ అఫ్జల్ కు మద్దతుగా శ్రీనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, నిజంగా మనము చేసుకొన్న పాపం, సిగ్గుపడాల్సిన విషయం, తలదించుకోవలసిన సమయం.

మానవ హక్కుల గురించి మాట్లాడే మానవహక్కుల సంఘం (మామూలుగా, వీరి దృష్టి లో మనవులంటే నక్సలైట్లు, తీవ్రవాదులు మాత్రమే..) అఫ్జల్ గురు కి క్షమాభిక్ష ప్రసాదించి, మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మర్చేలా రాష్ట్రపతిని కోరుతూ ఢిల్లీ లో ప్రదర్శనలు మొదలు పెట్టింది...దీనికి మద్దతు గా ప్రముఖ రచయిత్రి అరుందతీ రాయ్ ధర్నా నిర్వహించింది...(అసలు వీళ్ళే ఆ దాడి లో ముఖ్యులు అని నా అభిప్రాయం)


భారతీయుడి ఆత్మగౌరవనికి ప్రతీకైన పార్లమెంటు పై దాడి చేసిన వ్యక్తులకు క్షమాభిక్ష ప్రసాదించమని అడగడం, ప్రసాదించడం ఎంతవరకూ సమంజసం?


ఇది ఎంతమాత్రమూ ఆహ్వానించదగిన పరిణామము కాదు. ఈ కేసులో క్షమాభిక్ష ప్రసాదిస్తే త్వరలోనే రాబోతున్న, గుజరాత్ లోని అక్షరధాం కేసు, ముంబై ప్రేలుడుల కేసు, మొన్న జరిగిన ముంబై రైలు బాంబుల కేసు లలో కూడా ఇదే జరుగుతుంది..దేశమంతటా విద్రోహుల అరాచకాలు హెచ్చుమీరి పోతాయి..

చివరిగా నాది చిన్న అనుమానము:

గద్దర్ను, వరావర రావును పోలీసులు ఎత్తుకెళ్ళినప్పుడూ, మొన్న పుట్టపర్తి గారి విగ్రహం పగలగొట్టినప్పుడు..పెట్టిన పిటీషన్లు అరుంధతీ రాయ్ మీద, మానవ హక్కుల సంఘం మీద ఎందుకు పెట్టారు?

మనకి ఆత్మాభిమానము, ఆత్మగౌరవము లేవా? రాజ్యాగము మీద గౌరవము లేదా?...

పైన చెప్పినవి మీకు లేకపోతే "భారతీయులం" అని చెప్పుకో వద్దు దయచేసి...

ఉంటే, మీరే పిటీషన్ పెట్టండి...అందరి సంతకాలు అడగండి. మీవద్దకు పిటీషన్ వస్తే సంతకం పెట్టండి.

Read more...