అవును..చేరాను...మోపెడ్ కొంటానా?

>> Tuesday, November 21, 2006

పట్టణంలో ఉద్యోగం చేస్తున్న ఒక తమ్ముడు...'మహాదర్శి చిట్‌ఫండ్' లో చేరాడు..ఈ మధ్య తను చాలా బాధపడిపోతున్నాడు. చేరిననాడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఆవగింజంతైన లేదు..తన అక్క తగు సలహా ఇస్తుందని ఆమెకు ఫోన్ చేసాడు...ఆ సంభాషణే ఇది...

తమ్ముడు: అక్కా బాగున్నావా?

అక్క : ఆ.. బాగున్నాను...అదేంటీ? అలా డల్‌గా మాట్లాడుతున్నావు?

తమ్ముడు: అవునే...ఇంతకీ నేను మోపెడ్ కొంటానా లేదా ...నువ్వన్నా చెప్పవే..

అక్క: అదేంటిరా...నిక్షేపంలా కొంటావు...అదేదో దర్శిలో చెరావుకదా..డబ్బుకూడా కడుతున్నావు...

తమ్ముడు: అదేనే...కానీ ఈమధ్య పేపర్లు, టీవీ లు చూసి పిచెక్కుతుందే...నీకుతెలుసుగా...మా బాస్ కూడా ఈ దర్శిలో చేరి సొంతంగా కారు కూడా కొన్నాడే... మొన్నొకసారి కనపడి కారెక్కమంటే...నాకు చిర్రెత్తు కొచ్చి శపధం కూడా చేసేశాను.

అక్క: ఏమనిరా...?

తమ్ముడు: నేను మహాదర్శి లో చేరతాను...మోపెడ్ కొంటాను అని..

అక్క: మరి ఇంకేమిరా....ఆ చిట్ ఫండ్ లో చేరావు...డబ్బు దాచి పెడుతున్నావు...మరి ఇప్పుడు..ఆ అనుమనము ఎందుకు వచ్చింది?

తమ్ముడు: డౌట్ రాదా మరి...పేపర్లలో ఒకాయనేమో నిబద్ధత అంటాడు, నిజయతీ అంటాడు....నిప్పులాంటిది మా నిజయతీ అంటాడు.. మరోపక్కేమో ఇంకోపెద్దాయన వాజ్యమటాడు..లెక్కలు చెప్పమంటాడు.

అక్క: అవున్రా! మీ బావగారు కూడా రోజూ పేపర్లు తిరగేస్తూ, టీవీ చూస్తూ తెగ కామెంట్లు, గంటలకొద్దీ పీకేస్తున్నారు..మీడియా మొత్తం రెడుగా చీలిపోయిందటగా..?

తమ్ముడు: అవునే.., ఒక పేపర్ తిరగేస్తే..రాముడు సత్యసంధుడిలా కనిపిస్తున్నాడు..ఆయన మాట రామబాణం అని పిస్తోంది..మరొక పేపర్ చూస్తే ఆయన మాటకు భరోసా లేదేమో అనిపిస్తోంది...

అక్క: అవున్రా...అంతా రాజకీయమంటున్నారు...

తమ్ముడు: నమ్మకం మావైపు ఉండి...తేడా పాడాలు లేని ఘన చరిత్ర మాది..అసంబద్ధ, అహేతుక ఆరోపణలు చేయడం మంచిది కాదు..అని సదరు కంపెనీ అధిపతి అంటున్నారే, రాజకీయం చేస్తున్నారు..,దురుద్దేశంతో దొంగ దెబ్బ కొట్టాలని చూస్తున్నారు..అని ఆయన అంటుంటే...నేను అడిగింది మామూలు ప్రశ్నలే..చెబితే పోలా, ఎందుకీ అనుచిత భాషాప్రయోగాలు అని మరొకాయన వాదన...

అక్క: అవునూ., ఇద్దరూ చెరొక బహిరంగ లేఖలు వ్రాసారు కదరా...ఆరెండూ చక్కగా పక్కనపక్కన పెట్టి చదువుకోరా..ఏమన్నా అర్ధం అవుతుంది...

తమ్ముడు: అలా చేసిన నా సమస్య పరిష్కారం కావడం లేదే..!

అక్క: పోనీ, ఒక పని చేస్తే పోలా?...

తమ్ముడు: ఏమిటది.?

అక్క: నువ్వు కూడా ఓక బహిరంగ లేఖ రాసి పడేయ్. పత్రికల వాళ్ళూ, టీవీ చానెళ్ళ వాళ్ళూ బోలెడంత ప్రచారం ఇచ్చేస్తారు.

తమ్ముడు: ఏమని రాయనే..

అక్క: వెధవా ..! BA చదువుకున్నావు...అదికూడా నేనే చెప్పాలా?...పైనాన్స్ 'ఫైట్' లో ఇరుపక్షాలు ఎత్తుకు పైయెత్తులు వేసుకొంటున్నాయి. రాజ్కీయ పావులు చక చకా కదులుతున్నాయి. 'చిదంబర' రహస్యాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. ఈ అర్ధిక సమరంలో ఎవరు ఎప్పుడు ఏ వ్యూహం వేస్తారో అంతుపట్టటంలేదు..చివరకు పద్మవ్యూహమో అభిమన్యునిలా 'మదుపుదారుడు' కాకూడదు.

తమ్ముడు: మదుపుదారుడా?...మధ్యలో వాడెవడే..?

అక్క: మీ బావగారు పేపర్ల భాషంతా నా చెవుల్లోకెక్కిస్తూ వుంటే...అలాంటి పదాలే వస్తాయి.నువ్వేమీ కంగారు పడకు...మదపుదారుడంటె..డిపాజిటర్ అని అర్ధమట..

తమ్ముడు: అర్ధం అయిందిలే... అంటే..డిపాజిటర్గా ఒక బహిరంగ లేఖ వ్రాయాలి అంతేకదా.

అక్క: అవును.., ఎవరి ప్రయోజనాలను వాళ్ళు చూసుకొంటూ, మనల్ని నట్టేట ముంచుతారేమో....

తమ్ముడు: (ఆవేశంగా) అలా కానీయను., రాసేస్తాను. మధ్యలో మనమెందుకు మునిగి పోవాలి?, మనమెందుకు ఆందోళన పడాలి?, B.Pలు పెంచుకోవాలి? నేనూ మోపెడ్ కొనుక్కోవాలంటే...గగ్గోలు చేయాల్సిందే...తెగువ చూపాలసిందే..

అక్క: ఒరేయ్! అంతగా అవేశపడకు...రాస్తావ్..కానీ నీ లేఖను...ఏ పేపర్ వాళ్ళు వేస్తారు?...ఇప్పుడున్న మీదియ అంతా చెరో పక్షాన ఉండి క్షణం తీరిక లేకుండా పేజీలకు పేజీలు నిపేస్తున్నారు..టివీల్లో గంటగంటకూ చెవులు ఊదర కొట్టేస్తున్నారు... నీ గురించి ఎవ్వరు పట్టించుకొంటారురా...?

తమ్ముడు: అవును ఎవరు పట్టించుకొంటారు...?...హల్లో.. హల్లో..అక్క మాట్లాడవే ....

(లైన్ కట్ అయింది)

Read more...

యశ్ భారతి
'యశ్ భారతి' ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర యువతకు ఇచ్చే ఒక అవార్డు...ఈ ఏడాది మహమ్మద్ కైఫ్ (క్రికెటర్), అభిషేక్ బచ్చన్‌లకు ప్రదానం చేసారు...

ఈ విషయమై ప్రతిపక్షాలు తమ నిరసన తెలియ చెశాయి...

నిరసనా..?....ఎందుకు?

ఎందుకేమిటి?

అభిషేక్ బచ్చన్ ఉత్తరప్రదేశ్ వాడు కాదన్న వాదన...వారిది...

ఇంకో ముఖ్యమైన విషయము ఏమిటంటే .....

బచ్చన్ వంశంలో ఈ అవార్డు అందుకున్నావారిలో అభిషేక్ నాలుగోవాడు...
1. హరివంశ్ రాయ్ బచ్చన్ (అభిషేక తాతగారు, అమితాబ్ తండ్రిగారు)
2. అమితాబచ్చన్ (అభిషేక్ తండ్రిగారు)
3. జయా బచ్చన్ (అభిషేక్ తల్లి గారు)
4. అభిషేక్ బచ్చన్

(పాపం శ్వేతా బచన్‌న్ని (అభిషేక్ అక్కగారు) ఎందుకు వదిలేసారో?)

మరియొక ముఖ్య విషయం

అభిషేక్ తల్లి గారు..జయా బచ్చన్...ఉత్తరప్రదేష్ పాలక పక్షమైన సమాజవాదీ పార్టీ తరఫున 'మెంబర్ ఆఫ్ పార్లమెంట్' (యం.పి).

అభిషేక్ తండ్రి, అమితాబచ్చన్ ....ఈ రాజకీయ పార్టీ లో మంచి పలుకుబడి ఉన్నవారు.. సంఝ్వాదీ పర్టీ లోని అతి ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి 'అమర్ సింగ్' కి అత్యంత ఆప్తుడు.. అమితాబ్ అప్పుల ఊబిలోంచి బయటకు రావటంలో ఈయన హస్తం ఉందని ఒక సమాచారము...

ఏమిటొ ... నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరైనా అట్టాంటి పదవుల్లో ఉంటే...నేను కూడా..ఒక 'యశ్ భారతో, పద్మశ్రీనో, పద్మబూషణమైన దక్కించుకొనే వాదిని...ఇవికాకపోతె, కనీసం 'బారత రత్న' ఐనా తెచ్చుకొనేవాడినిగా...కొసమెరుపు : ఈ అవార్డుతో వచ్చే నగదు బహుమతిని (5 లక్షలు.) ప్రభుత్వం నిర్వహించే సాంఘీక సంక్షేమమ పధకాల్లో ఉపయోగించమని అభిషేక్ కోరారు...

Read more...

అర్ధం కాని అవార్డుల భాగోతం

>> Sunday, November 12, 2006


ఎట్టకేలకు 2005 సంవత్సరానికిగానూ నంది అవార్డులు ఇచ్చేశారు ....తన్నుకు చావండి...
తన్నుకోవడామేమో కానీ ఈ అవార్డులు ఏ ప్రాతిపదికనిచ్చారో అర్ధం కాక జుట్టు పీక్కొంటున్నాను.. మీకేమైన అర్ధమైతే తెలుపవలసినది...

ఉత్తమ హీరో - మహేష్ బాబు
చిత్రం - ఆతడు

విచిత్రంగా మనుషులని చంపే పాత్రలకే అవార్డులు వస్తాయేమిటో... ఐనా ఈ చిత్రం లో హీరో గారి పాత్ర 'మొహములో ఏ భావనలూ కనపడనిది"...దీనికి మహేష్ బాబు సరీగానే న్యాయం చేసాడు అని అనుకొందాం...ఈ జ్యూరీకి ఈ భావాలు పండించని ఈ పాత్రకి, ఈ మనిషి కి ఎలా అవార్డు ఇవ్వాలనిపించింది...?

ఉత్తమ దర్శకుడు - కృష్ణవంశీ
చిత్రం - చక్రం

ఇది మరో విచిత్రం ... కీ.శే. హృషీకేష్ ముఖర్జీ తీసినటువంటి "బావర్చి" నుండి inspiration పొంది (దీనిని inspiration అంటారా copy అంటారా?) కొంచెం ప్రేమ, కొంచెం చేజింగ్లు పెట్టి తీసిన సినిమా. ఈ జ్యురీ కాపీ సినిమలకు కూడా అవార్డులు ఇస్తే దీనికంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయిగా.

దిక్కు లేని "NTR" అవార్డ్...

మహానటుడు నందమూరి తారక రామారావు అవార్డు ఏ నిముషంలో పెట్టారో..పాపం ఎప్పుడు అవాంతరాలే...దీనిగురించి ఇంకోసారి మాట్లాడుకొందాం.

స్పెషల్ జ్యూరీ అవార్డు - వడ్డే నవీన్
చిత్రం -
ఊపిరి


దీని గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది...మిగతాది మీ ఊహ కే వదిలేస్తున్నాను..

చివరిగా అతి ముఖ్యమైనది - ఎవరికీ అర్ధం కానిది

ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం - పెళ్ళాం పిచ్చోడు

ఈ సినిమా విదుదలైనది 2006 (అవార్డు వచ్చినది 2005 సం.) ఈ సినిమ ఒకటి రెండు హాళ్ళలో మాత్రమే విడుదల అయినది, రెందు మూడు రోజులే ఆడిండి.. మరి ప్రజాదరణ ఎలా పొందింది?


ఓ దేవుడా .. మా మంచి దేవుడా ...
చూడడానికి సినిమానిచ్చావ్
పీక్కోవడానికి జుట్టు ఇచ్చావ్
ఎందుకు ఈ నందీ అవార్డుల జ్యూరీనిచ్చావ్?

Read more...

రోడ్డెక్కిన ఫ్రూడెన్షియల్ భాదితులు

>> Thursday, November 09, 2006ఫ్రూడెన్షియల్ అనే బ్యాంకు ఉందని మీకు గుర్తుందా? ....ఆ...అదే బోర్డు తిప్పేసిన బ్యాంకు...రాజీవ్ రెడ్డి అనే గొప్ప వ్యక్తికి, ఇంకా చాలా మందికి..డిపాజిటర్ల డిపాజిట్లను అప్పనంగా అప్పిచిన ఒక సంస్థ.

పాపం ఈ డిపాజిటర్లంతా, లిక్విడేటర్ వద్ద ఉన్న 140 కోట్లను చెల్లించాలని కోరుతూ రోడ్డెక్కారు ...కొంతసేపు సామూహిక నిరాహారదీక్ష చేసి..ఒక అల్టిమేట్టం ఇచ్చి వెళ్ళారు.

సరే...డబ్బు బ్యాంకులో దాచి ఆదా చేద్దామనుకున్న పిచ్చి వాళ్ళూ, ఆమాయకుల పరిస్థితి ఇలాఉంటే...మరి అప్పుతీసుకున్న వాళ్ళ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. ఋణగ్రస్తులలో ముఖ్యులు అయిన 'అమృతా కాసిల్' (హోటల్, సెక్రేట్రేట్ ముందు ఉంటుంది...దీని పరిస్థితి అగమ్యగోచరం..), రాజీవ్ రెడ్డి (అబ్బో ఈయన గురించి చెప్పడం చాలా కష్టం...ఏ రోడ్డు మీద చూసినా ఈయనే).ఈ రెడ్డిగారు మొన్న బెంగళూరు లో ఒక వ్యాయమశాల (Gym) ప్రారంభించి ప్రముఖులను ఆహ్వానించారు.. రెండు రోజులకొకసారి విదేశీయానం, అక్కడ ఫొటోలు తీయించుకొని ఇక్కద మా క్లబ్బు లో చేరండి అని హోర్డింగులతో ఒకటే పోరు...


దీని వలన నాకు తెలిసిన విషయం :

ఆప్పు చేయ్యండి. తీర్చవలసిన అవసరం లేదు...
అప్పిచినవాడే రోడ్డున పడాతాడు..మనము కులాసాగా విదేశాలు తిరగ వచ్చు.

ఇప్పటికైన ఖాతాదారులు నిరాహారదీక్షలు మనుకొని డబ్బు రాబట్టుకొనే ప్రయత్నము చేయండి...

నా సూచన: ఒక్కసారి లగే రహో మున్నాబాయి లోని ప్రయత్నము చేద్దామా?
కానీ ఇక్కడ బొకేలు పంపించనవసరము లేదు...ప్రతి ఒక్కరూ వారి వారి బ్లాగులలో రాజీవ్ రెడ్డి లాంటి వారు కోరుకోవాలని ఒకే రోజు రాసి పెట్టండి...దాదాపు అవి ఓక 100 దాక చేరుకుంటాయి.. అప్పుడు ఏదో ఒక పేపర్ వాదికి అవి చూపించితే ఇంకా పబ్లిసిటి వస్తుంది...

ఆలోచించండి...

Read more...

తెలుగు పలుకు

>> Wednesday, November 01, 2006

పల్లవి:

తెలుగువాడా తెలుగు మాట తెలియదని అనకు
తేనెలొలుకు తెలుగు పలుకు తనివితీరా పలుకు
తెలుగు మాట చెరుకు ఊట తెలుగుతనము తేట
తెలుగు పలికి తెలుగు వెలుగు చిలుకు ప్రతీపూట

చరణం:

అందమైన అక్షరాలు యాభైఆరు
అన్నిట్లో అందాలు జాలువారు
మీటితే రాగాలు పొంగిపారు
పలికితే భావాలు వేలవేలు
గోదారి గలగలతో క్రిష్ణమ్మ గమకముతో
శృతికలిపి లయపలికే వీనులవిందు మన తెలుగు

చరణం:

నన్నయ తిక్కన వేమనాదులు రంగరించి కలిపిన పాయసమిదియె
చదువులమ్మ చల్లనైన చేతులతోటిఅభయమొసగి పోసిన అమృతమిదియె
మన జాతికి మూలం, మన గుండెల నాదం
తెలుగుభాష కలకాలం నినదించే వేదం

వ్రాసిన వారు శ్రీ సిరాశ్రీ గారు, గ్రేట్ అంధ్రా నందు.
వారికి మీ అభినందనలు తెలియచేయాలంటే ఇక్కడ మీటండి.

Read more...

ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

హమ్మయ్యా!

అందరూ ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు..
తెలుగు దేశం (ఆంధ్ర) లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బడులు అన్నిటికీ శెలవ ఇవ్వడముతో ఒకటే సందడిగా ఉండి ఉంటుంది..కదా..

జోతి గారు ఆంగ్లములో శుభాకాంక్షలు చెప్పేటప్పటికి, నవీన్ గారికి భాషాభిమానము, రాష్ట్రాభిమానము పొంగుకొచ్చాయి..

జాబిలిముని గారు, జ్యోతిగారికి కొండంత అండగా నిలచారు...

ఇదేనేమో తాడేపల్లి గారు చెప్పిన అనుభంధం...సమైక్య ఆంధ్ర.బాగుంది..

నేను 2 సం క్రింద 'రచ్చబండ్' లో ఒక ప్రశ్న అడిగాను., నాకు జవాబు రాలేదు...ఇప్పటికీ జావాబు దొరకలేదు (సరీగా వెతకలేదేమో)...మీకు ఎవరికైన తెలిస్తే చెబుతారా?

మన రాష్ట్రానికి జెండా ఉందా? ఉంటే దాని రంగు, రూపము తెలుపండి..

Read more...