నమ్మలేని నిజం

>> Tuesday, August 29, 2006

1)
చిత్తూరు జిల్లాలో తెలుగు మాధ్యమంలో చదివితే " ఉపాధ్యాయ శిక్షణలో ప్రవేశానికి కేవలం 1శాతం అవకాశం ఉంది.

తమిళ మాధ్యమంలో చదివితే 16 నుంచి 17 శాతం, ఉర్దూ మాధ్యమంలో చదివితే 30 శాతం అవకాశాలు ఉన్నాయి.

ఉర్దూను పక్కన పెట్టినా తెలుగు, తమిళ భాషలు రెండూ తెలిసిన సామాన్యుడు తన బిడ్డలను ఏ మాధ్యమంలో చదివిస్తాడో ఆలోచించండి!


2)
తమిళ సాహిత్యం లో మాదిగల గురించిన ప్రస్తావనే లేదు. ఆందుకే తమిళ ఉద్యమకారులు మాదిగల్ని కూడా 'వందేరిగళ్" (వలస వచ్చిన వారు) అంటుంటారు. ఏందుకో తెలియదుగానీ చరిత్రలో చిత్తూరు ప్రాంతంలో బలమైన తమిళ ఉద్యమమేదో జరిగింది. లేకపోతె ఇందరు తమిళూలు, ఇన్ని తమిళ జాతులు ఇక్కడ నిలబడి పోవడం జరుగదు. తమిళ ఉద్యమం బలంగా జరిగిందని సందేహపడడానికి ఇంకొక ముఖ్య ఉదాహరణ:

దళిత కులాల్లో 'మాదిగలూ ఉన్నారు కదా! తమిళనాడంతా కుడా వీరి తల్లిబాస తెలుగే. చిట్టచివరి కొస 'కన్యాకుమారీలో కుడా సుమారు వెయ్యిండ్లు మాదిగలవారు ఇప్పటికీ తెలుగులోనే మాట్లాడుకొంటున్నారు.

మరిన్ని వివరాలకు:

స.వెం.రమేశ్
తెలుగువాణి
7, రాజాజీ వీధి,
భారతీ నగర్ ఎక్సెటెన్షన్,
కాట్పాడి - 632 006
వెల్లూర్ జిల్లా, తమిళనాడు
ఫో:09443323517

ప్రచురణ : నడుస్తున్న చరిత్ర (జులై '06)

Read more...

వినాయక చవితి శుభాకాంక్షలు

>> Sunday, August 27, 2006



ఈ సంవత్సరమన్నా తనను చెరువుల్లో నిమర్జనం చేసి నీటిని కలుషితం చేయవద్దంటున్న
పర్యావరణ గణపతి.

Read more...

తుప్పు పట్టిన 'కారు'

>> Saturday, August 26, 2006

తుప్పు పట్టిన కారా? - అదేమిటి?

గుర్తు రావటములేదా?....కారండి---కారు----CAR .. మన చంద్రశేఖర రావు గారి గుర్తు., గులాబీ రంగు పై కారు....గుర్తొచిందా...?....హమ్మయ్యా...

దానికేమైందని అడుగుతున్నారా....దానికేమి కాలేదు...ఆల్రెడీ తుప్పుపట్టిన కారునుని బయటకు లాగీ...."ప్రత్యేక తెలంగాణా" ని మళ్ళీ మొదటికి తెచ్చారు.

కొంత కాలం క్రిందట "రక్తాన్ని ధారపోసైనా, తలలు బద్దలు కొట్టైనా ప్రత్యేక తెలంగాణాను తెస్తాము" అన్న చంద్రశేఖరుడు......

కొన్ని నెలల క్రింద " సోనియా కాళ్ళు పట్టుకొనైనా తెలంగాణా రాస్ట్రాన్ని సాధిస్తాము" అన్న శేఖరుడు

కొన్ని రోజులక్రితము మేడంగారిపై అలిగి, కోపంతెచ్చుకొని, రాజీనామా సమర్పించుకొని, నిరాహార దీక్ష చేపట్టి, అమవాస్య చంద్రునిలా చిక్కి,శల్యమై, లోకసభ మీద గౌరవంతో, నిరాహార దీక్షను విరమించి "శాంతి కపోతము" అయ్యారు.

"తెలంగాణా పై అనవసరపు రగడ చేయ్యొద్దని, పల్లె పల్లె కూ వెళ్ళి 'కాంగ్రెస్సు వారు, మేడం గారు' చేసిన మోసంగురించి, అన్యాయము గురించి ప్రజలకు వివరిద్దాము, దీనితో ప్రజలు నిజం తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారని, కావాలసిన్నని సీట్లు వస్తే, ప్రభుత్వమే దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇస్తుంది" అని చంద్రశేఖర రావు సెలవిచ్చారు...

ఇదిగో ఇలా చెప్పే పోయిన ఎలక్షన్లలో "కారుతో" ఓట్లు గుద్దించుకొందామని అనుకొంటె, పాపం అదేకారు గుద్ది, ఓడిపోయి, చావుతప్పి కన్ను లొట్టబోయిందని, తన గురించి, ప్రత్యేక తెలంగానా గురించి ప్రజలు ఏమనుకొంటున్నరో అని ఇంకా అర్ధం కావడములేదు...పాపం.!

ఖర్మకాలి కాంగ్రెస్సు తో జత కట్టి, ఎన్నికల్లొ ఓడిపోయి, పదవి రాక కొన్నాళ్ళు, రక్తము, తలలు, కాళ్ళు, చేతులు, నరకడం అని కొన్నాళ్ళు అనడము,పదవి వచ్చిన తరువాత దాన్ని వదులుకోలేక కొన్నాళ్ళు, వదిలిన తరువాత, తప్పనిసరై నిరాహార దీక్షకు పూనుకోవడం, ఒకటున్నర రోజులోనే విరమించుకోవడం, మళ్ళీ ఎన్నికలు అనడం చూస్తోంటె, నాకు చంద్రశేఖర రావు గారు ఇక్కడ ఉండవలసిన వారు కాదేమో అని అనిపిస్తోంది.

మరి ఎక్కడ అంటారా - ఎమో - ఏ వాపునైతే చూసి, బలుపు అనునుకొన్నాడొ, ఏ నగరాన్ని చూసి, తన రాజధానిని చేద్దము అనుకొన్నాడో, - అదే నగరపు నడి బొడ్డులో ఉన్న - హాస్పిటల్ - అదేందో మీకు ప్రతేకముగా చెప్పక్కరలేదు అనుకొంటా... అక్కడ ఉంటే మంచిదేమో ..!

Read more...

పాఠశాలలో మాదకద్రవ్యాలు ....

నిన్నటి "STAR NEWS" లొ పగిలిపోతున్న వార్త (క్షమించండి దీనినే Breaking News అంటారు)

ప్రాంతము: దేశ రాజధాని "డిల్లీ" నగరము...(మన పక్క సందు కూడా కావచ్చు)
సమయము: ఉదయము 10.45
వేదిక : ఒక పేరున్న పబ్లిక్ స్కూలు
కళాకారులు : కొందరు విద్యార్ధులు
ఉదయము 10.45., స్కూలు మైదానము లో విద్యార్ధుల జేబులలో 3 పొట్లాలు దొరికినాయి.

ఇంక ఇక్కడినుంచి స్టార్ న్యూస్ విలేఖరులదే కార్యక్రమము మొత్తము.

అసలు మాదక ద్రవ్యాలు అంటె ఏమిటి?,
ఎక్కడ దొరుకుతాయి?
ఎంత ఖరీదు చెస్తాయి?
ఎక్కువ పరిమాణం లొ కావాలంటె ఏమిచెయాలి?

"తెలియని వారికి కూడా అర్ధం అయ్యెట్టు బాగా తెలియచెప్పారు"

స్టార్ న్యూస్ కి ధన్యవాదములు - ఇంత చక్కగా విడమర్చి చెప్పినదానికి.

ఇంక అసలు విషయానికి వస్తే:

ఈ మాదకద్రవ్యాలు విధ్యార్ధులకు సులభముగా స్కూళ్ళ ప్రక్కనే దొరుకుతాయి. మనము మామూలుగా బిస్కెట్టులు, చాక్లెట్టులు కొనుక్కునే కొట్లలోనే దొరుకుతాయి.

ఇక సులభముగా దొరకు రకాలు :

నల్లమందు-అతి తక్కువ రేటు
గాంజాయి - తక్కువ రేటు
మరిజునా - మధ్యరకం (దీనినే cannabis అని కూడా అంటారు)
హెరాయిన్ - ఇది యువకులకు సంభందించినది (రేటు కొంచెం ఎక్కువ - ముఖ్యముగా soft ware/ call center/party animals వాడుతుంటారు)

ఇదేకదా అసలైన గ్లోబలైజేషన్.


తప్పెవరిది...

మాదకద్రవ్యాలను అమ్మే వారిదా?
వారిని పట్టుకోలేని నిఘా వ్యవస్తదా?
బడి ఆవరణ లోకి వాటిని రప్పించిన స్కూలుదా?
పిల్లలదా?
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పిల్లలని క్రెచ్ (డబ్బులకు తల్లి కొరత తీర్చె, పిల్లలను సమ్రక్షిస్తున్నామనే కొన్ని సంస్థలు) కి అలవాటు చేసే, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రయపడుతూ, పిల్లలకి ఏవి ఇష్టమో తెలుసుకోకుండా, మన ఇష్టాలను వారి మీద బలవంతంగా రుద్దే తల్లితండ్రులదా?

చివరిగా:

అమ్మయ్యా !!

భారత దేశాన్ని అమెరికాగా మార్చాలన్న మన ప్రయత్నం 90% సఫలీకృతమైనది.

చూడండి., అమెరికా లాగే మన స్కూళ్ళ లోనూ విరివిగా, విచలవిడిగా మత్తు దొరుకుతుంది, అదీకాక దేశం ఎత్తుకి ఎదగదానికి పిల్లలేగా ముఖ్యం....వారికే ఈ ఎరువు వేస్తే దేశం ఎంత అభివృద్ది చెందుతుందో...

Read more...

కడలి గుడికి కదలి పోయె గంగా!!

>> Tuesday, August 22, 2006

నిద్దురోతున్న కాశీ విశ్వేశ్వరుని షెహనాయి నాదంతొ మేలుగొలుపు గొంతు శాశ్వతముగా మూగబోయింది....

91 సం||ల భారత రత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈరోజు సూర్యోదయములొ అస్తమించి సంగీత సామ్రాజ్యాన్ని చీకటి లొకి నెట్టారు.


A man of tenderness, A man who believes in remaining private and who believes that musicians are supposed to be heard and not seen.

The legendary shehani maestro, attached to Varanasi’s Vishwanath Temple.

It was Khan Sahib who poured his heart out into Raga Kafi from Red Fort on the eve of India’s first Republic Day ceremony.

Where others see conflict and contradiction between his music and his religion, Bismillah Khan sees only a divine unity. Music, sur, namaaz is the same thing.

His namaaz is the seven shuddh and five komal surs. Even as a devout Shia, Khan Sahib is also a staunch devotee of Saraswati, the Hindu goddess of music.

Ustad Bismillah Khan is the third classical musician after Pt Ravi Shankar and Late Smt M S Subbulakshmi to be awarded Bharath Rathna, the highest civilian honour in India.

The gentle genius of Bismillah Khan is perhaps single handedly responsible for making Shehnai a famous classical instrument. Traditionally used to play music during marriages, Shehnai is the counterpart of south indian nadaswaram. It is also used to play music in temples.

Bismillah Khan is now one of the most respected musicians and well sought after. Yet his lifestyle has not changed. It retains the old world charm of a Benaras life ... his chief mode of transport is still the cycle-rikshaw !

అంత గొప్ప వ్యక్తికి,అశ్రునయనాలతొ వీడ్కోలు చెప్పడము తప్ప ఇంకేమి ఇవ్వగలను.

ఎవరో చెప్పినట్లు (శ్రీ వేటూరి గారే అనుకొంటాను)....


నరుడి బ్రతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన


గుండెలో రంపాలు కోత పెడతాఉంటె
పాత పాటను మళ్ళీ పాడుకొందామంటూ


ఆది విష్ణు పాదమంటి, ఆకసాన ముగ్గుపెట్టి, జంగమైయ్య
జంట కట్టీ, కాశి లోన కాలుపెట్టి, కడలి గుడికి కదలి పోయె గంగా!!


"వారి ఆత్మకు శాంతి కలుగు గాక..!!"
"May His Soul Rest In Peace..!!"

Read more...

అందరూ ఆలోచించండి....

>> Saturday, August 19, 2006

నిన్నటి Times of India - Bangalore Edition లొ ఉన్న Times City అనే పేజిలొ We Got M@il అనే శీర్షక క్రింద వచ్చిన ఒక ఉత్తరాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఇది కేవలం బెంగళూరు కే కాదు., మన రాష్ట్రం లోని అన్ని పట్టణాలకు,మొత్తం దేశానికీ అవసరమే అని నేను భావిస్తున్నాను...


ఇది రాసినది, భారతీయుడు కాదు., ఒక విదేశీయుడు.., ఐనా ప్రక్క దేశమువాడు చెబితేకానీ, మనకు ఎక్కదుగా....

ఇంక ఉత్తరము చదవుదామా:

Don’t replicate America model
— Michael Dakin

As an Englishman who recently moved to your city, I seriously wonder whether any of the ideas expressed to improve the city will add up to creating a Bangalore a pleasurable place to live in. I get the feeling that it is wedded to the American version of a modern city rather than the European model. People always talk about infrastructure in terms of roads and addition of a Metro. How depressing!


In America, everybody drives everywhere. The concept of walking is totally alien. If you take major European city models, the pedestrian is king. Bangalore does not need more and wider roads; more flyovers and underpasses. It needs to look at how it can make the city a pleasure to walk around. For, just walking from my residence to a local shop is a nightmare. The fumes nearly choke you to death. The pavements are nothing more than broken stones and soil. Do Bangaloreans really believe American-style malls are a replacement for open walking spaces with trees and water fountains? They have a place, but there’s much more to a city than shopping malls.



ఐనా మనకి ప్రతీ దానిని ప్రక్క వాళ్ళతొ పోల్చడము చిన్నపటినుంచి వెన్నతో పెట్టిన విద్య.

పక్కింటి శీనుగాడిని చూడు...ఎంత బుద్దిగా, అన్నం తింటున్నాడొ - చిన్నప్పుడు అమ్మ చెప్పిన పోలిక..

ఒరే వెధవా, ఆ రాముగాడిని చూసైనా బుద్ది తెచ్చుకో - ఎంత బాగా మార్కులు తెచ్చుకుంటున్నాదో - స్కూలులో మాస్టారి గారి పోలిక..

నీతోటి వాడైన రవిని చూసి నేర్చుకో, ఎంతో కష్టపడి చదివి, ఎంత మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడో - నిరుద్యోగికి తండ్రి చూపే పోలిక.

ఇలా అడుగడుగునా పోలికలు పెట్టుకొని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్టు ఉంది మన పరిస్థితి.

మనమే, మన individuvality,identity పోగుట్టుకుంటున్నామేమో...
అందరూ ఆలోచించండి....

Read more...

మీరు సింగిలా?

>> Thursday, August 17, 2006

ఏం..! అర్ధం కాలేదా?

అదేనండి, ఈ మధ్య వచ్చిన జాఢ్యం ఉందిగా - అదే అమెరికను ఆంగ్లము ( English - American Style)...దాని గురించి....నా గోల, గోడు....

ప్రతీ కాల్ సెంటరు వాల్లు ఫోన్ చెసి " మీరు సింగిలా" అని అడుగుతారు...., వెంటనే నాకు .....


"నేను" అనే పదము - ఏక వచనమా ? బహువచనమా ?

నా శరీరము - లావుగా (Double Size) ఉందనా?

నేను ఎవరినైనా ఉంచుకొన్నాననా?

అనే ప్రశ్నలు పుట్టుకొస్తాయి...

ఇంతకీ దీని అర్ధం - మీకు పెళ్ళైందా అని...

ఇంతకు ముందే నయం, బ్రిటీషు వారి భాషలో మర్యాద ఉండేది....

"Are you married?" అని కానీ, married, unmarried అనే options కానీ ఉండేవి...

మరి ఇప్పుడో.....మంచి, మర్యాదా మచ్చుకైనా కానరావు...

ఏ భాష లొనైనా మంచి, మర్యాదా, గౌరవం, ఉన్నప్పుడే అందముగా ఉంటుంది....


ఇంకో రకముగా చెప్పాలంటె,

ఎంత అందగత్తైనా, భాషలో గౌరవము, మంచితనము, మర్యాద ఉంటేనే అందగత్తె అనిపించుకొంటుంది....

Read more...

ఫ్రీడం 59

>> Tuesday, August 15, 2006



59 వ భారత స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు.



ప్రతీ సంవత్సరం ఆగస్టు 15వ తేదినాడు, జెండా ఎగురవేయడము, పాత ఙాపకాలు తలచుకోవడము...ఇదేనా స్వాతంత్ర్యదినోత్సవము?

వీటిసంగతీ కొంచెము చెబుతారా?

1) గట్టి భద్రత మధ్య ప్రధాని మువ్వన్నెల జెండాను ఆవిష్కరించడము....ఇదేనా స్వాతంత్ర్యం..?(ఇది మనకు ఏవిధమైన స్వాతంత్ర్యము?).

2) పేపర్లలొ "ప్రశాంతముగా స్వాతంత్ర్యదిన సంబరాలు" అని చదవడము - ఇదేనా స్వాతంత్ర్యం..?

3) అన్నీ రాస్ట్రాలలోనూ రైతుల ఆత్మహత్యలు - ఇదేనా స్వాతంత్ర్యం..?

4) అర్ధరాత్రి తిరిగే (ఉద్యోగాలనుండి ఇంటికి వెల్లె)ఆడవారి పై జరిగె అమానుష చర్యలు ...ఇదేనా స్వాతంత్ర్యం..?

5) క్లబ్బుల్లో, పబ్బుల్లో....మబ్బుల్లో తేలుతున్న యువత - ఇదేనా స్వాతంత్ర్యం..?

6) అభ్యంతరకరమైన నాట్యాలు చెసిందని గొంతెత్తి అరిచిన మహిళా సంఘాలు, T.V.Channels, ఐశ్వర్యా రాయ్, ప్రీతీ జింతా, కరిష్మా మెదలు నిన్న వచ్చిన పార్వతీ మిల్టన్ వరకూ వేసుకొనే కురచ దుస్తులు అభ్యంతరముగా అనిపించలేదా - ఇదేనా స్వాతంత్ర్యం..?

7) ఎందుకు చంపుతున్నామో, ఎందుకు ఛస్తున్నామో అర్ధం కాని పరిస్థితిలొ ఉన్న పోలీసు, నక్సలైటు, హొం డిపార్టుమెంటు - ఇదేనా స్వాతంత్ర్యం..?

8) కులం పేరుతో తిట్టారని, మీ ఊరి అంతుచుస్తాను అన్న MLA - ఇదేనా స్వాతంత్ర్యం..?

9) ఎంత గొప్ప వ్యక్తిని హత్య చేసినా, క్షమాభిక్ష పెట్టె సుప్రీం కోర్టు

ఇలా చెప్పుకొంటూ పోతె...59 ఏళ్ళు సరిపోవు....

అందుకే

అర్ధ శతాబ్దపు అగ్నానాన్ని స్వతంత్రమందామా? స్వర్నోత్సవాలు చేద్దామా?
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా? దానికి సలాము చేద్దామా?
శాంతికపోతపు కొత్తుక త్రెంచి తెచ్చిన బహుమానం
ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మ ఓ పవిత్ర భారతమా

కులాల కోసం గుంపులు కడుతూ
మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువను చూపి తగువుకి లేస్తారే
జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకు తనం లొ
ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరే?, తెలిసి భుజం కలిపి రారే?
అలాంటి జనాల తరఫున ఎవరొ ఎందుకు పోరాడాలి?
పోరి ఏమిటి సాధించాలి?

ఎవ్వరికోసం ఎవరు ఎవరితొ సాగించే సమరం
ఈ చిచ్చుర సిందూరం జవాబు చెప్పె భాద్యత మరచిన
జనాల భారతమా ఓ అనాధ భారతమా

తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే
వదులుకొని తనలో భీతిని, తన అవినీతిని
తన ప్రతినిధులుగ ఎన్నుకొని
ప్రజాస్వామ్యమని తలచె జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదొ తనకె వుందని శాసిస్తుందట అధికారం
క్రిష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితి మంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాధ భారతమా?




-----జై భారత్ ------

Read more...

ఓ సారూ ! జరంత భద్రం !!!!

>> Thursday, August 10, 2006

హల్లో! గురూగారూ..

ఈ హెడ్డింగ్ చూసి ఎదో అనుకోవద్దు.!

మన గవర్నమెంటు ఈమధ్య ఒక గొప్ప కార్యక్రమం చేపట్టి, విజయవంతముగా కొనసాగిస్తూ ఉన్నది...అదేమంటారా.., ఈదిగో ఇక్కడ చూడండి & చదవండి "ఆదివారం - ఆంధ్రజ్యోతి".

ఇది చాలా గొప్పవిషయమా కాదా..?

అవును.....చాలా గొప్పవిషయం....

దీనితో తెలుగును మృత భాష కాదు అని వాదించవచ్చు...,
తెలుగు చాలా పురాతనమైన బాష అని నొక్కి వక్కాణించవచ్చు..,
దానితొ కేంద్రం నోరు మూయించవచ్చు...,

తెలుగుకు రావలసిన స్టేటస్ తీసుకురావచ్చు...(దీనివలన శ్రి వేటూరి.సుందరామ్మూర్తి గారి గౌరవాన్ని (రాష్ట్రీయ పురస్కారాలు)కాపాడుకోవచ్చు..,

గ్రాంటులు కూడా పోందవచ్చు...అనుభవించొచ్చు....

(నువ్వా..నేనా అనే ప్రశ్నలు వద్దు...అవి మనకి కాదు....పెద్దమనుషులు ఉన్నారులే.., దానికోసం ....)
(ఏమిటి...ప్రసాదు గారికా... వస్తుంది...వస్తుంది.."గొంతు నొప్పి".)

ఒరే అనీలు... ఏమిట్రా., పైన పెట్టిన హెడ్డింగు కు నువ్వు చెప్పే విషయానికి ఏమి సంబంధం.., ఏమిటీ సోది అంటారా (సోది నాది కాదు....చావా కిరణ్ గారి బ్లాగు పేరు....) ఇది సోది కాదు...బాధ...

బాధా...?ఇంత మంచి యఙ్ఞం జరుగుతుంటేను....?

అది కాదు సారూ... మనకు తెలియదా, మన ప్రభుత్వ కార్యాలయాలలో కాగితాలకు పట్టే అదృష్టం......

ఇప్పుడే...ఫ్యాక్టరీ నుంచి వచ్చిన తెల్ల కాగితము కుడా పది నిముషాలలో తాళపత్రం (అంటె...రంగుమారి Brown గా మారుతుంది) అయిపోతుంది... అలాంటిది., పురాతన తాళాపత్రాలు, కాగితాలు అంటె..... ఏమవుతాయో?

ఎంతో భక్తి తో, ప్రేమతో, గౌరవం తో భద్రపరచుకున్న ఈ సంపదను వారికి ఇవ్వడం అంటెనే... బాధ......అందుకే "ఓ సారూ...జరంత జాగ్రత్త.".

తరువాత ఏమి జరుగుతుందో.....పెరుమాళ్ళకే ఎరుక....

Read more...

తొలి తెలుగు తీర్పు

రాయులు ఏలిన సీమ "రాయల"సీమలొ మొట్టమొదటి సారి గా తెలుగులో తీర్పు........ప్రాంతీయ బాషాభివృద్ధి కి తొలి మెట్టు....


"ప్రాంతీయ బాషాభివృద్ధి కి ప్రాంతీయ బాషాలోనే తీర్పులు", అని చెప్పిన అంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పిలుపునకు స్పందించి రాయలసీమలొ మాతృబాషలొ తీర్పునిచ్చిన శ్రీయుతులు. జి.రవీందర్ గారికి నా అభినందనలు, ధన్యవాదములు.

ఈ విప్లవం అన్ని ప్రాంతాలలో రావాలని కోరుకొంటున్నను....

వివరములకు : అంధ్రజ్యోతి దినపత్రిక - సీమలొ తెలుగు తీర్పు

Read more...