పిల్లి మెడలో ఎవరు గంట కడతారు?

>> Saturday, September 30, 2006

ఈ వ్యాసం ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు...ముఖ్యంగా విహారి గారి ఉత్తరాలు చదివి నా అభిప్రాయం చెబుతున్నాను అంతే.


పిల్లి మెడలో ఎవరు గంట కడతారు?

ఏవరో ఎందుకు కట్టాలి?., మీరు, నేను చాలమా?

ఈ సాలెగూడులో ఎన్నో అద్దెగృహాలు, సొంతిల్లు, వ్రాత పత్రులు (నేను బ్లాగులను ఇలా పిలుస్తాను..మామూలుగా) ఉన్నాయి, దానికి తోడు ఎన్నో సంఘాలు ( ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే గుంపులు) ఉన్నాయి., ఎవరికి వారు దేశం తగలబడి పోతుందని, తెలుగు మృతభాష అవుతుందని గొతుచించుకు చెబుతారు., సంతోషం...నిజానికి వాళ్ళు అరవడం వరకే పరిమితం.

కొందరు కనీసం తెలుగు అభివృద్ధి కొరకు కొన్ని క్రొత్త ప్రయోగాలు చేసి ఈ గణితేంద్రము (కంప్యూటర్ కు వచ్చిన తిప్పలు) లో కొన్ని మార్పులు చేసినారు...వారికి నా ధన్యవాదములు.

ఇది ఇంతవరకే., మిగిలిన కాలములో వారు వారికి నచ్చిన/వీలైన భాషనే ఉపయోగిస్తారు.. దీనిని కాదనే అధికారం మనకు లేదు.

ఈ మధ్య కాలములో వచ్చిన చలన చిత్రములు (సినిమలు) రంగ్ దె బసంతి, లగే రహో మున్నాభాయి లను దాదాపు అందరూ చూసిఉంటారు, అందరికీ నచ్చి వుంటాయి., ఎందుకంటే అందరం విధ్యావంతులం కదా...కానీ ఇందులో చెప్పిన ఒక్క విషయం మనము మర్చి పోయాము...అదేఅంటే

"మార్పు అనేది ఎక్కడినుంచో రాదు...మనదగ్గర్నుండే మొదలవుతుంది".

వాళ్ళు తెలుగులో వ్రాసారా, ఇంకోకరకంగా వ్రాసారా వద్దు....మీరు మొదలు పెట్టండి. ప్రతీ దానికీ తెలుగులోనే జవాబు వ్రాయండి., (వీలైతే మీ కార్యాలయ విషయాలలో కూడా..మమూలుగా ఐతే ఇది కుదరదు..) నేను ఇప్పుడు ఇదే అనుచరిస్తున్నాను...

ఈ మార్గములో మీతో పాటు నడిచే నాలాంటి బాటసారులు చాలామందే ఉండి ఉంటారులేండి...

Read more...

మంచి నాయకులు కావాలేం?

>> Thursday, September 28, 2006

అది కరీంనగర్ నియోజకవర్గంలో ఒక గ్రామం. రచ్చబండ దగ్గర ఓ విద్యార్ధి నాయకుడు ఉపన్యాసం దంచేస్తున్నాడు -

'ఇప్పుడీ ఉపయెన్నిక యెవరికోసం? ఈ ముసలాయన "ఛాలెంజ్" చేసాడట..ఇంకోఆయన రెచ్చగొట్టాడట. ఇప్పుడున్నాయన "ఇజ్జత్ కా సవాల్ " అనుకొని రాజీనామా చేసాడట., సరే!., ఇవతల రాజీనామా చేసినాయన ఎలక్షన్లొ నిలబడతాడో లేదో చెప్పటం లేదు, ఇవతల "ఛాలెంజ్" చేసిన ముసలాయనా కండిడేట్ కాదు. సైన్యాన్ని ఇబ్బంది పెట్టకుండా ద్వందయుద్ధం చేద్దామన్న పెద్దాయన మాట గాలికి ఎగిరిపోయింది. ఇక ఎవరి గురించి ఎన్నిక పెట్టినట్లు? ఎవడబ్బ సొమ్ము ఖర్చు పెడుతున్నట్లు?

"...తెలంగాణా సెంటిమెంటు మీద రెఫరెండం అంటున్నాడు గదయ్యా?.."...అడ్డు తగిలారు ఎవరో.

'...తెలంగాణా మీద రెఫరెండం పెట్టాలంటే., రాష్ట్రం అంతా పెట్టాలి., అనేక విషయాలు తేల్చుకొని ఒక ప్రతిపాదన ముందు పెట్టి మీ అభిప్రాయం చెప్పండి అని అడగాలి. అంతే గానీ ఈఒక్క నియోజక వర్గం లో ఒట్ల బట్టి 294 అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలు ఏమనుకొంటున్నారో తేలిపోతుందా? ఎన్నిక ఫలితం అనేక అంశాలపైన అధరపడి ఉంటుంది. సిట్టింగ్ ఎం.పి ఏమిచేశాడు?.., రాబోయేవాడు ఏమి చేస్తాడు? ఇల అనేక పాయింట్లు వుంటాయి. అందువలన ఇది రెఫరెండమే కాదు.. అసలు నేనడిగేది - ఇప్పుడి ఎలక్షన్లు ఎందుకని?., అందువలన మంచి నాయకులు దొరికేదాకా మనమందరమూ ఎన్నికలను బహిష్కరించాలి - అని పిలుపునిస్తున్నాను. ఇది మనల్ని అడిగి పెట్టిన ఎన్నిక కాదు..'

విద్యార్ధి నాయకుడి ఉపన్యాసం విని అందరూ చప్పట్లు కొట్టారు. 'అంతే..అంతే ఎన్నికల బహిష్కారమే...' అంటూ అరిచారు. కానీ చెట్టునీడన కూర్చొన్న పెద్దాయనలో మాత్రం చలనం లేదు. చుట్ట కాల్చుకొంటూ కూర్చున్నాడు. విద్యార్ధి నాయకుడు ఆయనకేసి తిరిగి 'ఏం పెద్దాయనా! నువ్వేమీ పలక్కుడా వున్నావు? నువ్వెళ్ళి ఓటేస్తావా ఏంది?' అన్నాడు.

ఆయన చుట్ట పడేసి, ఎమర్రా!, అయితే మీరందరూ ఓట్లేయరన్నమాట...అడిగాడు జనం కేసి తిరిగి.

అంతేగదా పెద్దాయనా..! వాళ్ళు మనల్ని అడిగి పెట్టారా ఈ ఎలక్షను? అన్నాడు శ్రోతల్లో ఒకడు.

ఒరే! నేను పెద్ద చదువుకున్నోణ్ని కాను, కానీ తెలియక అదుగుతాను., జవాబు చెబుతావా? అని మొదలెట్టాడు పెద్దాయన.

ఇంకా కావాలంటే.....గ్రేట్ అంధ్రా. కాం (ఇక్కడ) నొక్కండి.

అనిల్ చీమలమఱ్ఱి

Read more...

ఈ పద్య రచయిత ఎవరు?

>> Friday, September 22, 2006
తొండమునేకదంతము దోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగమ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
గొండొక గ్రుజ్జు రూపమును గోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిపా! నీకు మ్రొక్కెదన్

చంటి పిల్లలు సైతం నేర్చుకొని పాడడనికి వీలుగ ఉన్న ఈ పద్య రచయిత ఎవరు?

Read more...

సంకలనం

>> Sunday, September 17, 2006

నేటి చదువు

ఓం నమఃశివాయ పోయి
ఓహ్ - ఆహ్ స్వరాలు వచ్చాయ్,
అ, ఆ ల స్థానంలో ఎ బి లొచ్చాయ్
పెద్దబాల శిక్ష అసలే లేదు
పెద్ద బరువుల బాల 'శిక్ష' వచ్చి
చిన్న చిన్న పసికూనల్ని
అతలాకుతలం చేస్తోంది
ఇష్ఠపడి చదవడం మాట అటుంచి
కష్టపడి చదవటం ఎక్కువైంది
ఊ అంటే ఫారిన్ చందాన
నేటి చదువు - కకావికలుగా
రూపంతరం చెంది
శాపాంతరంగా మారింది

- కోలపల్లి ఈశ్వర్, నెల్లూరుచప్ర (చలపాక ప్రకాష్)

ఉమ్మడి కుటుంబాలు
ఏమైపోయాయబ్బా!
అ'పార్ట్' మెంటు రూపం
దాల్చినట్లున్నాయి కాదూ..

- చలపాక ప్రకాష్, విజయవాడపీడకల

మనిషికి మనిషే భారమైన వేళ
నైతిక విలువలు దిగజారిన వేళ
విషపు మార్కెట్ సంస్కృతిలో పడి
ప్రేమానురాగాలు లాభనష్టాల
బేరీజులో ఓటమిపాలైన వేళ
రాజ్యం తన విధులను విస్మరించిన వేళ
గుండెలోని ఆర్ధ్రత కన్నీటి రూపంలో
బయటపడుతున్న వేళ
భవిష్యత్తు గురించిన ఆలోచన
నేడు కనే పీడకల

- ముషం చంద్రకళ., కమలాపూర్, కరీంనగర్ జిల్లా

Read more...

శివార్పణం

>> Saturday, September 16, 2006అల్లన దొండ మెత్తి శివునౌదలయేటి జలంబు వుచ్చి సం
పుల్లత బాద పీఠకము పొంతన యున్న సహస్రనేత్రుని పై
జల్లి శివార్చనా కమల సంహతి బ్రోక్షణ చేయునట్లు శో
బిల్లు గజాననుండు మదభీప్సిత సిద్ది కరుండు గావుతన్||


గనేశుడు తన తండ్రి శివునకు అభిషేకం చేశాడు. అంతకు మునుపే, దేవతల రాజైన ఇంద్రుడు శివునికి అభిషేకము చేసి శివుని పాదపీఠం వద్ద వంగి ప్రణామం చేసి పూజిస్తూ ఉన్నాడు.
ఇంద్రునికి ఒళ్ళంతా కళ్ళే, అందుకే అతనికి సహస్ర నేత్రుడని పేరు., తొండము ఎత్తి శివుని అభిషేకములో నిమఘ్నుడైన గణపతి, శివని పాదాల వద్ద ఉన్న తెరుచుకొని ఉన్న ఆ వేయి కళ్ళను (ఇంద్రుని) చూసి పూలనుకొని భ్రమించి పూజలో ఉంచిన అన్ని వస్తువులను ప్రోక్షణ చేసినట్లు గానే, కళ్ళపై నీరు చల్లి 'శివార్పణం' చేసాడు.

ఈ అద్భుతమైన కావ్యం క్రీ.శ 1550-1560 కాలమునాటి శ్రీ 'పెద్దపాటి జగ్గన' కవి రచించిన 'ప్రబంధ రత్నాకరము' అను సంకలన గ్రంధం లోనిది.

Read more...

కాలగర్భం లో ... కోటిలింగాల

>> Thursday, September 14, 2006

2500 సం. క్రితం శాతవాహనుల తొలి రాజధాని, ప్రస్తుతం, గోదావరీ తీరంలొ కరీంనగర్ జిల్లా వెలగటూరు మండలం లో ఉన్న కోటిలింగాల. అది ఇప్పుడు ఓ కుగ్రామము. అది ఒకప్పుడు శతవాహన సామ్రాజ్య రాజధాని.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తలపెట్టిన నీటి ప్రాజెక్టుల పుణ్యమా అని ఆ కుగ్రామము "శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్" కింద ముంపునకు గురౌతుంది.

కరీంనగర్‌కు 65 కి.మీ. దూరంలొ ఉన్న కోటిలింగాల గ్రామంలొ పురావస్తు శాఖ 1979 లొ త్రవ్వకాలు నిర్వహిస్తే మట్టి కోట, బౌద్ధ స్తూపం, శ్రీముఖ శాతవాహనుడు ముద్రించిన నాణేలు లభించినాయి. వీటిని పరిశీలిస్తే ఇక్కడ అశోకుని హయాంనకు పూర్వమే ఇక్కడ బౌధమతం ఉన్నట్లు తెలుస్తోంది.

శాతవాహనుల తొలి రాజధాని నీటి ప్రాజెక్టుల వలన కాలగర్భం లోనూ నీటి గర్భం లోనూ కలసి పోతున్నది....

(ఈ విషయమును తెలియచెసినది శ్రీ పి.ఆర్.మాల్యాల గారు, గ్రేట్ఆంధ్రా.కాం అను వెబ్ సైట్ లో)

Read more...

గోవిందా...గోవిందా !!!

>> Monday, September 11, 2006

సోదరులారా!...

కోపం వద్దు....పుట్టపర్తి వారు అదృష్టవంతులు....

ఎలాగంటారా...

ఎఱ్ఱటి ఎండలో, లేక, ఝోరు వర్షం లొ, నీడలేక నిలబడి, మట్టి కోట్టుకు పోకుండా కాపాడారు....సంతోషించండి..

మామూలుగా ఐతే, కాకుల రేట్టలకు ఆలవాలము..మన సరస్వతీ పుత్రుల విగ్రహం....

అవునా కాదా?

భారతీయ చింతన: అంత ప్రేమ, భక్తి, గౌరవం ఉంటే ఇంట్లో పెట్టుకొని పూజించు... వాడు విగ్రహం తీసేసాడని గోలెందుకు...అయినా తెలుగు తల్లి విగ్రహం పగిలినప్పుడు రాని కోపం ఇప్పుడెందుకు?

Read more...

రాజభోగం

>> Wednesday, September 06, 2006

kosarAju

ఖాతాదారులను నట్టేట ముంచిన కృషీ బ్యాంకు అధినేత "కొసరాజు గారికి జరుగుతున్న రాజభోగాలు" చూస్తుంటే....ఇతనే మోసం చెశాడా అనిపిస్తుంది..

అర్ధాంతరంగా బ్యాంకును మూసేసి, విదేశాలకు పారిపోయి, విలాసాలు అనుభవించినదే కాకుండా ప్రస్తుతము..చుట్టూ సెక్యూరిటితో, విందులతో, ఆ పరీక్షలు, ఈ పరీక్షలు అని విహార యాత్రలు చేస్తున్నాడు.

అయినా దొంగలకి, నేరస్తులకి, రౌడీలకు ఈ రాజభోగమేమిటో?

వాడు నేను మోసం చేశాను అంటుంటే, లై డిటెక్టర్ పరీక్షలని, ఇంకో పరీక్షలని ఇంకా మన డబ్బు ఎందుకు దొబ్బెట్టాలి? ఖాతాదారులనుంచి దొబ్బింది సరిపోలేదా?

"వాడిని మధ్యకు వదలండి, నిజాలు రాబడతాము", అనే ఖాతాదారులకన్నా లై డిటెక్టర్లు గొప్పవా, నిజాన్ని వెలికి తీయడంలో?

ఇకనైనా ఈ టెస్టులు అనటం మానేసి, " చెబుతావా? ఛస్తావా!" అనడం మచిదేమో...ఆలోచించండి పోలీసు బాబాయిలు...

"కొస"మెరుపు : బ్యాంకులనుంచి ఋణాలు తీసుకొనే ఒక పెద్దమనిషి, ఆ డబ్బుతో, విదేశీయానం చేస్తూ, ఫొటోలు తీసుకోంటూ, రోడ్డు ఎక్కాడు (అదేనండి ప్రకటనలకై బోర్డులు, హోర్డింగులు ఎక్కాడు). ఇంతకీ అతను డబ్బు మొత్తం చెల్లించాడా లేదా, దేశంలో ఉన్నాడా లేదా అనేవి తెలియలేదు.

అతని పేరా....ఆ ఒక్కటీ అడక్కు..!

(ప్రపంచం మొత్తానికీ అతని పేరు తెలుసు...మీకు తెలియకపోతే చెప్పండి....అప్పుడు నేను చెబుతాను.)

Read more...