ఇంగ్లీసు కామిడి!!!!

>> Monday, December 19, 2011

(సూచీక:.... ఇది కేవలము కల్పితం...ఎవ్వరినీ నొప్పించాలని వ్రాసినది కాదు...)

(మన ఇజీనగరం సత్తిబాబు, అదేనండీ..ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్స్ కమిటీ (APCC) ఛీపు (క్షమిచండి...ఆచ్హు తప్పు..)ఛీఫ్ మరియు మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, విజయనగరానికి చెందిన బొత్సా సత్యనారాయణ, రాజకీయాల్లో ఆరితేరిన ఆటగాడే కానీ, ఆంగ్ల భాష మాట్లడడములో ఆరితేరలేదు...హిందీలొ ఐతే ఇక చెప్పుకోనవసరమే లేదు...




మొన్నీమధ్య కాంగ్రెస్సు వారి అమ్మ అయిన శ్రీమతి. సోనియాగాంధీగారిని కలవడానికి ఢిల్లీ వెళారు, కానీ అది రహస్య సమావేశము కావడముతో,మంతనాల విషయం బయటకి తెలియరాదనే ఆలోచనతో,అనువాదకర్తగా (ట్రాన్స్లేటర్) తన భార్య అయిన ఝాన్సీలక్ష్మి గారిని (వీరు M.P ఆపైన PHD స్కాలర్)తీసుకొని వెళ్ళారు.

కానీ మీకుతెలుసుగా, 2G, 3G, మొబైల్ ఫోన్లు ప్రపంచాన్ని శాసించుచున్న ఈకాలమందు..ఏదీ దాగదు..ఆలాగే నాకు ఈ విషయం ఒక చిన్న MMS ద్వారా అందింది...అందులో ఏమి జరిగిందో..మీరే చదవండి.)

---------------------------------

బొత్సా: గుడ్ మార్నింగ్ మేడం...

అమ్మ : గుడ్ మార్నింగ్ ... హోప్ ఎవ్విరి థింగ్ ఫైన్ ఇన్ AP.

(సత్తిబాబు, భార్య ఝాన్సి వైపు చూశాడు)

ఝాణ్సీ : (భర్తని చూస్తూ) AP లో అంతా బానేఉందా..అని అడగతాంది.

బొత్సా: (చిరునవ్వుతో అమ్మగారిని చూస్తూ) ఎస్సు, ఎస్సు.. ఆల్ గుడ్డు..గుడ్డు..

అమ్మ: We decided to postpone the idea of cabinet seat for Chiranjeevi and what is your take on that?

(సత్తి బాబుకు అర్ధమైనదల్లా "చిరంజీవి", "కాబినెట్ సీట్", మరియు "పోస్ట్‌పోన్" )

బొత్సా: ఎస్సు, మేడం.. ఎస్సు

అమ్మ : what Yes?

(సత్తిబాబు, భార్య ఝాన్సి వైపు చూశాడు)

ఝాన్సీ : చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచన పోస్ట్‌పోన్ చేస్తుందట. నువ్వు ఏటంటావో అడగతాంది.

బొత్సా: (భార్య తో)..నాను ఏటంతాను.. ఏటీఅనను.. ఆమె ఏటంటే అదే గదేటీ!!!

ఝాన్సీ: (అమ్మ (అత్తకాదు(?)) అయిన) Ma’am! He says that you have taken right decision

అమ్మ సోనియా: What are the steps Chiranjeevi is taking to grow in politics?

(మళ్ళా మన బొత్సా తన ఆంగ్లభాషని ఉపయోగించి అర్ధం అర్ధమే చేసుకున్నది, చిరంజీవి, స్టెప్పులు, పాలిటిక్స్..మాత్రమే)

బొత్సా: Yes madam! He is waste in politics. Dance steps good in pictures.

(మేడం కోపము, చిరాకు తో సత్తిబాబు వైపు చూసింది)

(ఝన్సీ "ష్! ష్!" అని భర్తకి సైగలు, ముకేషులు చేసింది)

ఝన్సీ: (భర్త తో) చిరంజీవి రాజకీయాలలో ఎదగడానికి ఏటి సేస్తుండాడు, అని కొచ్చేనింగు సేస్తా వుంది.

బొత్సా: (ఝాన్సీ తొ)..ఓ..గదా!..నాను ఇంకేటో అనేసుకొందాను కదేటి. ఆ ప్లానింగే ఉంటే PRP ని నట్టేట ఒగ్గేసి, కాంగ్రెస్సులోకి ఎందుకు పారొస్తాడు? ప్లానింగు లేదు, బొంగు లేదు. మంత్రి పదవి ఇస్తే ఎల్లి మొగానికి రంగేసుకొని..టెప్పులు ఏత్తాడు.

ఝాన్సీ బొంగు అనే పదాన్ని మినహా మొత్తం అనువాదము చేసి మేడంగారికి చెప్పింది.

మేడం : (చిరునవ్వుతో) I Know..

బొత్సా: (భార్య తో) ఏతంత ..no అంతాంది...నాను సెప్పింది కరెస్టు కాదనా?

ఝాన్సీ: నువ్వుండసె..!

ఇంతలో సోనియా మేడం సెక్రెటరి వచ్చి...5 ని. లో వేరే పని ఉందని చెప్పి వెళ్ళాడు.

సోనియా: (బొత్సా ని చూస్తూ) Being the PCC President it is your responsibility to guard the Chief Minister Kiran Kumar Reddy’s chair by strengthening the party and cadre.

(మరోసారి మన బొత్సా తన ఆంగ్లభాషని ఉపయోగించి అర్ధమే చేసుకున్న అర్ధం, ‘PCC President’, Chief Minister Chair’, ‘Kiran Kumar Reddy’ ‘party and cadre’.)

బొత్సా: Thank you madam. Your blessing. I Chief Minister guddu..not PCC President. My cadre very guddu…

ఝాన్సీ: (బొత్సాను గిచ్చి) ఎహె.! నీ తొక్కలో ఇంగిలీసు తో నీ ఇట్టం వచ్చినట్టు అర్ధం సేసేసుకొని మాతాడొద్దు...గుండేకాయలో ఉన్నది డోకొద్దు (కక్కేయొద్దు).. ఈయమ్మ కొంపలు తగలేయగలదు.. PCC ఛీపు గా CM కురిచీని కాపాదే భాద్యత నీ మేడకు అతికించినాది. చేస్తున్నావా అని కొచ్చిన్.

బొత్సా: ఓ గదా ..ఎరికేనని సెప్పు..

ఝానీ: Madam! He is saying that he is already in that mission.

(సోనియా సెక్రెటరీ చేతి గడియాయారము చూసుకొంటూ సైగలు ఛెస్తున్నాడు)

సోనియా: So, all the best. See you again. Bye.

బొత్స & ఝాన్సీ, అమ్మగారిఫద పద్మములకు నమస్కరించి వెనుతిరిగారు..


-----------------

సేకరణ/ తస్కరణ: http://www.greatandhra.com/


స్వేచానువాదము: నేనే...మీ (బద్దకస్తుడైన) అనిల్ చీమలమఱ్ఱి.

Read more...

గూబ గుయ్‌మనిపించిన ధరలు!!!!!!

>> Thursday, November 24, 2011





ధరలు ఆకాశాన్ని అంటుతుంటే, ప్రజలు నానా కష్టాలు పడుతూ ఉంటే, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటారా?...అని హరివీందర్ సింగు మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ని గూబ గుయ్‌మనిపించాడు.

ఇదే వ్యక్తి మాజీ టెలికాం మంత్రి సుఖరాం పైన కుడా చెయ్యి చేసుకొన్నాడు.

Read more...

స్నెహం అంటే ఇదేరా!

>> Tuesday, November 22, 2011

ఒక రోజు ఇంటికి చాలా ఆలస్యముగా వెళ్ళాను.

నాన్న : ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? ఇప్పుడు టైం ఎంతయ్యిందో తెలుసా?

నేను : ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.

(నాన్న వెంటనే...నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసాడు.)

రాము: అవును అంకుల్, ఇప్పటి దాకా ఇక్కడే ఉన్నాడు.

రెడ్డి: అంకుల్, ఇప్పుడే బయలుదేరాడు.

శ్రీను: ఇక్కడే ఉన్నాడు, చదువుకొంటున్నాడు..పోన్ ఇచ్చేనా?


ఐసే హర్ ఫ్రెండ్ జారూరీ హోతాహై.

(ఇది కేవలము నవ్వు కోవడానికే)

Read more...

జాగ్రత్త....

>> Friday, June 24, 2011

లెటుగా వస్తున్నా, లేటెస్టుగా వస్తున్నా!!! జాగ్రత్త....

Read more...