రోడ్డు - మీరు

>> Friday, July 28, 2006

రోడ్డు పై వాహనము నడిపేటప్పుడు

1. ఎటు వైపు నుంచి నడపాలి?
2. ఫోన్ (సెల్ /మొబైల్) మాట్లాడొచ్చా?
3. వాహనము నడిపేటప్పుడు ఇయర్ ఫోన్ (మొబైల్/వాక్ మెన్)ఉపయోగించవచ్చా?

4. వాహనము నడపడానికి కనీస వయస్సు ఎంత?
5. ఎంత వేగముతో వాహనము నడపాలి?, కనీసం పాఠశాలల వద్ద ఎంత వేగము అవసరము?
6. రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ లైట్లు ఏవరికోసం, ఎందుకోసం, ఎవరు పెట్టారు?
7. ఏ రంగు లైటు పడితె, ఏమి చెయ్యాలి?
8. ముందు వాహనాన్ని ఎటువైపునుంచి over take చెయ్యాలి?
9. ఎక్కడ వాహనాన్ని park చెయ్యాలి?
10. వాహనము మీద ఎంత మందిని ఎక్కించుకోవాలి?

ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలుసా? తెలుసనే అనుకొంటాను. ఎందుకంటె మీరు చదువుకొన్నవారు, విఙ్ఙానవంతులు...

అన్నీ తెలిసిన మీరుకూడా వీటిని ఎందుకు అతిక్రమిస్తారు? చదువు ఎక్కువైందా?
(చదవక ముందు కెకరకాయ అనేవాడు ... చదివిన తరువాత ఇంకెదో అన్నాడట).

Read more...

భీతిల్లిన భారతం

>> Wednesday, July 12, 2006

ఛిద్రమైన తల, నుజ్జు నుజ్జైన నడుము,ఎవరిదీ శరీరము?నీదా? నాదా?, కాదు కాదు....ఆ శరీరము ఎవరిదొ కాదు....నా తల్లి భారతి ది.

రోజూ నా తల్లి తల ఎర్ర సింధుర తిలకపు ఎరుపు తొ శొభాయమానముగా కనిపించె ఆ నుదురు ఈనాడు కూడా ఎరుపుగానే కనిపిస్తోంది, కానీ ఈ ఎరుపు కుంకుమ వలన కాదు, రక్తముతో.

ఎంతో అందముగా కనిపించే ఆ నడుము, ఈనాడు నెత్తురొడుతోంది.

ఎందువలన?......తెలియదు.

ఎవరివలన? .......తెలియదు.

మరింకేం..తెలుసు?

అర్జెంటు గా, tiffin చెసి, ఆఫీసుకు వెళ్ళాలి...
సాయంత్రం, పిల్లలని బజారుకు తీసుకు వెళ్ళాలి...
మర్చేపోయాను, ఈరోజు సుధీరు వాళ్ళ ఇంటికి భొజనానికి వస్తాను అని అన్నాను...

మరి, శ్రినగర్, ముంబాయి లలొ జరిగిన విషయాల గురించి ఎమనుకొంటున్నవు?
ఆ యేముంది, ఈ దెశంలొ ఈ రకపు చావులు, విధ్వంసములు మామూలే...

మరి నీవు ఎమీ చెయవా?
...ఛోడొ...యార్!...


మనకంటె, మానవత్వం మూర్తీభవించిన ముంబైవాసులు మేలేమో...అవసరానికి తోటివారిని ఆదుకుంటున్నారు...మరి మనము ఎమిచెయాలి..?

కనీసము...

ఈ విధ్వంసాలని ఖండించాలి...
మరణించిన వారి ఆత్మశాంతి కోసము 2 నిముషాలు మౌనము పాటించాలి...

మరి చేద్దామా?

Read more...

నీతోనె

>> Tuesday, July 11, 2006

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ "ISRO" మొన్న సాయంత్రము ప్రయోగించిన GSLV F-02 అంతరిక్ష నౌక విఫలం అయినదని అందరికీ తెలుసు, ఆ విషయము మీద, మన జర్నలిస్టులు, T.V న్యూస్ రీడర్లు తెగ బాధ పడిపోతున్నారు, నిన్నటి నుంచి ప్రతీ 5 నిం.లకు ఒకసారి అవే క్లిపింగులు... వార్తా పత్రికలలో హెడ్డింగులు.

"ఈ ప్రయోగానికి 256 కోట్లు వ్రుధా అయ్యాయి" - ఆంధ్రజ్యోతి (ఇది హెడ్డింగు కాదు సుమా!)

ఇది చాలా భాధాకరమైన వాఖ్య, కోట్ల మంది భారతీయులు పడని బాధంతా వీరే పడుతున్నరు....."FAILURE IS THE STEPPING STONE FOR SUCESS" అని ఎప్పుడు తెలుసుకొంటారో...

అందుకే ISRO కి చిన్న ఉత్తరం:

ప్రియమైన ISRO శస్త్రవేత్తల్లారా, మేధావుల్లారా, ముఖ్యముగా భారతీయులారా,

పదండి..ముందుకు ..పదండి..త్రొసుకు...పోదాం పోదాం పైపైకి....
ఇవన్ని చాలా చిన్న విషయాలు..ఏనుగులు వెళుతూ ఉంటె కుక్కలు మొరుగుతాయి, మీరు సాధించిన విజయాలముందు, ఈ విమర్షలు చిన్నబోతాయి....!
మీ విజయము,అపజయము లొ లో మేము కుడా పాలు పంచుకొంటాము., మేతొ మెమున్నాము...
చిన్న చిన్న అపజయాలకి చిన్నబోకుండా, క్రుంగకుండా, భాధ పడకుండా...సాగిపోండి.....

ALL THE BEST

మీ సోదర భారతీయుడు
అనిల్ చిమలమఱ్ఱి

Read more...

శ్రీ జే.పి. గారికి చిన్న సలహా

>> Friday, July 07, 2006

నిన్న 3 పాయింట్లు (నేరచరితులు,చట్టసభల గౌరవం,మరియు వ్యవసాయం & పరిశ్రమల గురించి)చెప్పుకున్నాము...ఇలా చెప్పుకొంటూ పోతె ఇంకా చాలా చెప్పాలి....అందువలన ఈ విషయాన్ని ఇక్కడే వదిలేస్తాను....వదిలే ముందు చిన్న విషయం చెబుతాను...
ఒక మనిషి నేరస్తుడు లేక మహాత్ముడు, విద్యావేత్త లేక దగుల్బాజీ, రాజకీయనాయకుడు లేక నక్సలైటు అయ్యాడంటె దానికీ కొన్ని కారణాలు ఉంటాయి. ఆందులో కొన్ని ఇక్కడ చెబుతున్నాను.
1. తల్లిదండ్రుల పెంపకం..: ప్రతీ తల్లి-తండ్రి తన కొదుకు/కూతురు ఇంజనీరో/కలెక్టరో/లేక ఇంకేదొ కావాలని అనుకొంటారె తప్ప ఒక మంచి మనిషి, ఇతరులకు సహయపడె మనిషి కావాలని అనుకోరు.....దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెదతారు.. రండి ఒక పదిమంది విద్యావేత్తలు వారి పిల్లలని ప్రభుత్వ పాఠశాలలొ చేర్పించి ఉపాధ్యాయుల మీద ఒత్తిడి పెట్టండి....పిల్లలు, ప్రభుత్వం ఉన్నత స్థితి లోకి ఎందుకు రావో చూద్దాము.
2. టీచర్ల, ఉపాధ్యాయుల భోధన..: ప్రస్తుతము ఎక్కడ చూసినా పోటీ తత్వమే...LKG లొ చేరాలన్నా ఇంటర్వ్యూలే..పరీక్షలే... స్కూలుకు మంచి పేరు/ఆదాయము రావాలంటె మంచి ర్యాంకులు రావాలి.....ర్యాంకులకి మంచి పద్దతి ప్రష్నలు బట్టీ పట్టించడమే, లేక రొజూ పరీక్షలే (అదేనండీ mock tests)...ఈ చదువును చూసి మా తాతగారు " Education is the botheration for the nation, so cultivation is the best occupation" అని...నిజమే కదా...
ఐనా "Co-operation is better than Competition" అని ఎప్పుడు తెలుసుకుంటారో?
3. తన చుట్టూ ఉన్న సమాజం..: అవినీతి ఎక్కడ మొదలైంది? మన నట్టింట్లొ...అంటె ఉరుకొంటారా?....కానీ ఇది నిజమైన నిజం,అదెలా అంటారా...పిల్లవాడు బడికి పోనని మారాం చేస్తుంటే, అమ్మ, నాన్న "నువ్వు ఇప్పుదు బడికి వెడితే సాయంత్రం పార్కుకి తీసుకెళతా" అని అనడం తొ మొదలు.....అదె పిల్లవాడు పెరిగి పెద్దవాడై ఆఫీసులొ నాకేంటి అని అడుగుతాడు. ఇది చాలదా ఉదాహరణకి?
4. కాలం..: నేను ఎక్కడో చదివా..."మనిషి మార్పుకు కారణం తో పనిలేదు...కాలమే ఆ పని చేస్తుంది" అని..బడిలో చదువుకొనేటప్పుడు ఉన్న సాటి మనిషి మీద ఉన్న ప్రేమ, అభిమానాలు కాలేజీ కి వచ్చిన తరువాత కనపడవు....ఎందుకు?
చివరిగా చెప్పోచ్చేదెమిటంటే...శ్రీ జే.పి.నారాయణ గారు క్రొత్త పార్టీ పెట్టి చేతులు కాల్చుకొనేకంటె, ప్రజలను చైతన్యవంతులని చేసి చరిత్ర లో నిలబడి పోవటం మేలని నా ఉద్దేశ్యం.
ఇక ఈ విషయాన్ని ఇక్కడే వదిలేస్తున్నాను....

Read more...

నిన్నటిదే ....

>> Thursday, July 06, 2006

లోక్ సత్తా (స్వచ్చంధ సంస్థ) జరిపిన చర్చ లొ అన్నీ నిజాలే...కానీ ఆ ప్రశ్నలలో చాలావాటికి జవాబులు దొరకవు.

1. రాజకీయం కేవలం అవినీతిపరులకి, అక్రమార్జనపరులకి, నేరచరితులకేనా?
నేరచరితులంటె - కోర్టులలొ కేసులున్నవారా, శిక్ష అనుభవిస్తున్నవారా?,
కోర్టులలొ కేసులున్నవారైతే - ఆ కేసులు ఈ జీవితానికి పూర్తి కావు...
శిక్ష అనుభవిస్తున్నవారైతే - మన రాజ్యాంగం ప్రకారం వారు ఎలక్షనులలొ పాల్గొనవచ్చు అని ఉంది కదా...(ఉదా:- చాలామంది ఆవిధం గా గెలిచినట్లు చరిత్ర చెబుతున్నది, అసెంబ్లి రౌడి అనె సినిమాలొ-హీరొగారు జైలునుంచె నామినేషన్ వేసి గెలుస్తాడు).

2. మంట గలసిన చట్టసభల గౌరవం
దేశంలొ సుప్రీం కోర్టు గొప్పదా, పార్లమెంటు గొప్పదా అన్న విషయానికే కరెక్టుగా జవాబులేదు...(ఉదా:- ఈ మధ్యనే జరిగిన, ముడుపుల భాగొతం)
అసలు సంవత్సరానికి ఎన్ని సార్లు అసెంబ్లి జరుగుతుంది?, దానిలొ ఎంత సేపు ప్రశ్నోత్తరాల కార్యక్రమము?, ఎన్నిసార్లు baycott చేస్తున్నారు?,

బడికి వెళ్ళే పిల్లవాడు (పిల్లలంటె మాములుగా బరువు, భాద్యతలు లేనివారని ఇక్కడ అర్ధం) రోజుకు 6 గంటలు, వారానికి 5/6 రోజులు, నెలకి 4 వారాలు వెలుతుండగా ....అన్ని భాద్యతలు కలిగిన రాజకీయనాయకుడు ఎంతసేపు అసెంబ్లిలొ ఉండాలి?

మాములుగానే భాష మనము కోపము లో ఉంటె కుక్క, పంది, దున్నపోతు అని తిట్టుకొంటాము ..... మరి అసెంబ్లి లొ మరీ కోపమువచ్చినప్పుడు.... ఎమి తిట్టాలి?.....స్పెషల్ గా భాష కనిపెడదామా?, అసలు కోపము ఎందుకు రావాలి..., ఏం! మీకు ఆఫీసులొ ఎప్పుడూ కోపం రాదా?....ఇదీ అంతె!

3. వ్యవసాయ రంగం / చిన్న పరిశ్రమలు

దీనికి కారణం మధ్యవర్తులా, రాజకీయనాయకులా,గ్లోబలైజెషనా, లేక, రైతా....
మాములు పంటలు పోయి, కమర్షియల్ పంటలు వచ్చె ...ఢాం...ఢాం...ఢాం.
మాములు పద్ధతులు పోయి, శాస్త్రీయ పద్ధతులు వచ్చె ...ఢాం...ఢాం...ఢాం.

పురుగుల మందు పోయి, కొకాకొలా వచ్చె ఢాం..ఢాం...ఢాం
మిగతాది రేపు....

Read more...

నూతన రాజకీయ సంస్కృతి ఆవశ్యకత....!

>> Wednesday, July 05, 2006

నూతన రాజకీయ సంస్కృతి ఆవశ్యకత....!

ప్రజారాజ్యం (లోక్ సత్తా అను ఒక స్వచంద సంస్థ / నూతన రాజకీయ పార్టీ వారి సమాచార పత్రం)నిరుటి నెల అనగా జూన్ లొ ఒక చర్చా పత్రం ప్రచురించింది, దాని పేరే " నూతన రాజకీయ సంస్కృతి ఆవశ్యకత".

ఈ చర్చను ఇప్పుడెందుకు తెచ్చారో నాకు మాత్రం అర్ధం కావడంలేదు, "ఇది వారి రాజకీయ ప్రవేశ ప్రయత్నమా....అని అనుకుంటూ ఉండగానే" శ్రీ జె. పి. నారాయణ్ గారు (కన్వీనర్, లోక్ సత్తా) పేపరుకి ఎక్కేసారు... మైకు పట్టుకొని మరీ....త్వరలో మనం శంఖం పురిద్దాము... అంటూ.

"వస్తోన్నాయ్...వస్తోన్నాయ్...జగన్నాధుని రధచక్రాల్" అని ఎవరిని భయపెడుతున్నాడొ అర్థం కావటం లేదు... ఎలక్షనులొ గెలవటం అంటే I.A.S పాసు ఐనంత సులువు కాదు అని తెలియదెమో?
ఈయనకి మంది మార్బలము లేదు, ఉన్నదెమో తొక్కలొ చదువుకున్నావారు, జెండా పట్టుకు తిరగడానికి సిగ్గుపడేవారు.. ఇంకేమి గెలుస్తాడు.... నా మొహం ...!

ఐనా ఎమాటకమాటే చెప్పుకోవాలి, జె.పి. తెలివిని మెచ్చుకోవాలి.....ఎంతైనా I.A.S తెలివి....తన రాజకీయ ప్రవేశం కోసం 3, 4 సం నుంచే పునాది వేసుకొంటూ వచాడు...(నిఝ్ఝం గా, అచ్చంగా ఇది నా అభిప్రాయం....ఒట్టు తను లోక్ సత్తా పెట్టినప్పుడు, కొంచెం పేరులొకి వచ్చినప్పుడు... నా స్నెహితులకి ఇదే చెప్పాను)......

మిగతాది రేపు చదవండి..

Read more...

మా తెలుగు తల్లికి మల్లెపూదండ ...!!!

>> Tuesday, July 04, 2006

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు

కడుపులొ బంగారు కనుచూపులొ కరుణ
చిరునవ్వులొ సిరులు దొరలించు మా తల్లి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు

గల గల గోదారి కదలిపోతుంటేను
బిరబిర క్రిష్నమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలె పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు

అమరావతీ గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులొ తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తీఅందనాలు
నిత్యమై నిఖిలమై నిలచివుండెదాక

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, క్రిష్ణరాయల కీర్తి
మాచెవులు రింగుమని మారుమ్రోగెదాక
నీ ఆటలె ఆడుతాం...నీపాటలె పాడుతాం

జై తెలుగు తల్లి!
జై తెలుగు తల్లి!
జై తెలుగు తల్లి!!!

----శంకరంబాడి సుందరాచార్య


నా ఈ బ్లాగు ని తెలుగు లో వ్రాయాలని అనుకొంటూ ఈ ప్రార్థనా గీతం తొ ప్రారంభించాను..
పోతనామాత్యుడు చెప్పినట్లు (కానీ కొంచెము మార్చి)

"పలికెడిది తెలుగట, పలికించెడిది ఆంధ్ర భారతట"
చూద్దాము.., ఈ ప్రయాణము ఎంతవరకో..

జై తెలుగు తల్లి..!! (దాసరి నారయణ రావు పార్టీ కాదండొయ్)

Read more...