భీతిల్లిన భారతం

>> Wednesday, July 12, 2006

ఛిద్రమైన తల, నుజ్జు నుజ్జైన నడుము,ఎవరిదీ శరీరము?నీదా? నాదా?, కాదు కాదు....ఆ శరీరము ఎవరిదొ కాదు....నా తల్లి భారతి ది.

రోజూ నా తల్లి తల ఎర్ర సింధుర తిలకపు ఎరుపు తొ శొభాయమానముగా కనిపించె ఆ నుదురు ఈనాడు కూడా ఎరుపుగానే కనిపిస్తోంది, కానీ ఈ ఎరుపు కుంకుమ వలన కాదు, రక్తముతో.

ఎంతో అందముగా కనిపించే ఆ నడుము, ఈనాడు నెత్తురొడుతోంది.

ఎందువలన?......తెలియదు.

ఎవరివలన? .......తెలియదు.

మరింకేం..తెలుసు?

అర్జెంటు గా, tiffin చెసి, ఆఫీసుకు వెళ్ళాలి...
సాయంత్రం, పిల్లలని బజారుకు తీసుకు వెళ్ళాలి...
మర్చేపోయాను, ఈరోజు సుధీరు వాళ్ళ ఇంటికి భొజనానికి వస్తాను అని అన్నాను...

మరి, శ్రినగర్, ముంబాయి లలొ జరిగిన విషయాల గురించి ఎమనుకొంటున్నవు?
ఆ యేముంది, ఈ దెశంలొ ఈ రకపు చావులు, విధ్వంసములు మామూలే...

మరి నీవు ఎమీ చెయవా?
...ఛోడొ...యార్!...


మనకంటె, మానవత్వం మూర్తీభవించిన ముంబైవాసులు మేలేమో...అవసరానికి తోటివారిని ఆదుకుంటున్నారు...మరి మనము ఎమిచెయాలి..?

కనీసము...

ఈ విధ్వంసాలని ఖండించాలి...
మరణించిన వారి ఆత్మశాంతి కోసము 2 నిముషాలు మౌనము పాటించాలి...

మరి చేద్దామా?

3 అభిప్రాయాలు:

Anonymous July 12, 2006 10:50 am  

every one thinks that when will the India / world changes but no one will put there effert to change the world, if some one dare to come also people will tell him to quit, government will kill that fellow says he is encounter then what is the use of doing some thing and saying some thing better every one keep quit & see what happens
ther is no other option

spandana July 14, 2006 7:49 pm  

నా స్పందనకై నా బ్లాగు http://charasala.wordpress.com చూడండి.
ఎన్ని బాంబుదాడులైనా మన మొద్దు నిద్దరని ఏమీ చేయలేవు. బ్రతికినన్నాళ్ళు బతికి చావడం తప్ప మనకంటూ సంకల్పాలేమీ ఉండవు, స్వసంకల్పాలు తప్ప! ఎవడు ఎటు పోతేనేం మనం బాగుంటే చాలు. ఈ నీతిమాలిని స్వార్థం రాజ్యమేలబట్టికదా చెంఘిజ్ ఖాన్‌లకూ, మొఘల్స్‌కు, బ్రిటిష్ వాళ్ళకూ ఎలుకున్నన్నాళ్ళూ ఏలుకోనిచ్చాం, దోచుకున్నన్నాళ్ళు దోచుకోనిచ్చాం ఆడవాళ్ళ శీలాల్ని, సంపదల్ని! మనదెంత బానిసబుద్దంటే గాంధి అంతటివాడు కూడా తన క్విట్ఇండియా ఉద్యమం వరకూ బ్రిటిష్ వాళ్ళ అధిపత్యాన్ని వద్దనలేదు, వాళ్ళ అన్యాయాన్ని మాత్రమే ఎదిరించాడు. వాళ్ళకు విధేయంగా ఉండి యుద్దంలో వాళ్ళకు సహయపడటం ద్వారా వాళ్ళ మెప్పును పొందాలను కున్నాడు (అసలు సిసలైన దాసీ బుద్ది! ).
ఏ చరిత్ర చుసినా కాదు, మన చరిత్ర చూస్తే ఏమున్నది గర్వ కారణం, మొఘలాయీల నుండి, మంగోలుల దాకా, అలెక్జాండర్ నుండి బ్రిటిష్ వాడి దాకా పీదితులం, బానిసలం.
ఇప్పుడు ఈ తీవ్రవాదమూకల దాడులు అంతే పార్లమెంటైనా సరే, ప్రార్థనాస్థలమైనా సరే, ఎర్రకోటైనా సరే, ఇండియాగేటైనా సరే ఎక్కడదాడి చేసినా గాయాన్ని తుడిచేసుకుంటాం, కన్నీళ్ళు మింగేసు కుంటాం, ఇది మన కర్మ అని సరి పెట్టుకుంటాం. ఇడే మన సహనబలమని విర్రవీగుతాం! చేతకాని దద్దమ్మతనానికి గుండెధైర్యమని ముసుగేసుకొని నయవంచన చేసుకుంటాం!
-- ప్రసాద్

త్రివిక్రమ్ Trivikram August 26, 2006 4:15 pm  

"కాశ్మీర్లో ఊచకోత" అనే వార్తను లోపలిపేజీల్లో అతిచిన్నవార్తగా చూసి 'మామూలే కదా?' అని చప్పరించేసే స్థాయికి ఎదిగింది మన నిర్లిప్తత. "భారతదేశంలో బాంబుపేలుళ్ళు" అనే వార్తకు అందరూ అలాగే ప్రతిస్పందించే స్థాయికి ఎదుగుతుంది మన సహనశీలత.