తెలుగు పలుకు

>> Wednesday, November 01, 2006

పల్లవి:

తెలుగువాడా తెలుగు మాట తెలియదని అనకు
తేనెలొలుకు తెలుగు పలుకు తనివితీరా పలుకు
తెలుగు మాట చెరుకు ఊట తెలుగుతనము తేట
తెలుగు పలికి తెలుగు వెలుగు చిలుకు ప్రతీపూట

చరణం:

అందమైన అక్షరాలు యాభైఆరు
అన్నిట్లో అందాలు జాలువారు
మీటితే రాగాలు పొంగిపారు
పలికితే భావాలు వేలవేలు
గోదారి గలగలతో క్రిష్ణమ్మ గమకముతో
శృతికలిపి లయపలికే వీనులవిందు మన తెలుగు

చరణం:

నన్నయ తిక్కన వేమనాదులు రంగరించి కలిపిన పాయసమిదియె
చదువులమ్మ చల్లనైన చేతులతోటిఅభయమొసగి పోసిన అమృతమిదియె
మన జాతికి మూలం, మన గుండెల నాదం
తెలుగుభాష కలకాలం నినదించే వేదం

వ్రాసిన వారు శ్రీ సిరాశ్రీ గారు, గ్రేట్ అంధ్రా నందు.
వారికి మీ అభినందనలు తెలియచేయాలంటే ఇక్కడ మీటండి.

0 అభిప్రాయాలు: