ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
>> Wednesday, November 01, 2006
హమ్మయ్యా!
అందరూ ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు..
తెలుగు దేశం (ఆంధ్ర) లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బడులు అన్నిటికీ శెలవ ఇవ్వడముతో ఒకటే సందడిగా ఉండి ఉంటుంది..కదా..
జోతి గారు ఆంగ్లములో శుభాకాంక్షలు చెప్పేటప్పటికి, నవీన్ గారికి భాషాభిమానము, రాష్ట్రాభిమానము పొంగుకొచ్చాయి..
జాబిలిముని గారు, జ్యోతిగారికి కొండంత అండగా నిలచారు...
ఇదేనేమో తాడేపల్లి గారు చెప్పిన అనుభంధం...సమైక్య ఆంధ్ర.బాగుంది..
నేను 2 సం క్రింద 'రచ్చబండ్' లో ఒక ప్రశ్న అడిగాను., నాకు జవాబు రాలేదు...ఇప్పటికీ జావాబు దొరకలేదు (సరీగా వెతకలేదేమో)...మీకు ఎవరికైన తెలిస్తే చెబుతారా?
మన రాష్ట్రానికి జెండా ఉందా? ఉంటే దాని రంగు, రూపము తెలుపండి..
2 అభిప్రాయాలు:
అమెరికన్ రాష్ట్రాలలాగా మన భారతీయ రాష్ట్రాలకి సొంత జెండాలు లేవు.జెండాలు రాష్ట్రాలకి నిషిద్ధం(ట).రాష్ట్ర ముద్రలూ చిహ్నాలూ అయితే ఉన్నాయి.మన రాష్ట్ర ముద్ర - మూడు సింహాల బొమ్మ చుట్టూ జమిలి వృత్తాలు. వృత్తాల మధ్య ఖాళీ స్థలంలో పైన Government of Andhra Pradesh అని కింద "సత్యమేవ జయతే" అనే సూక్తి.
ఇహపోతే మన చిహ్నం - ఆకులు కప్పిన కలశం మీద బోర్లించిన కొబ్బరికాయ. ఆ ఆకులు పద్మపు రేకుల్లాగా కలశం చుట్టూ వేళ్ళాడుతూ ఉంటాయి.
కర్ణాటక రాష్ట్రానికి ఝండా ఉన్నది కదా
Post a Comment