వీడ్కోలు
>> Saturday, April 14, 2007
తెలుగు నాటక రంగంలొ, తెలుగు చలనచిత్ర రంగం లో..రెండిటిలోనూ తన అసమాన ప్రతిభ తొ ప్రేక్షక హృదయాలలో నిలచిపోయిన శ్రీ ధూళిపాళ సీతారామ శాస్త్రి - గుంటూరు జిల్లా, పల్నాడు తాలూకా లోని దాచేపల్లి గ్రామములో సెప్టెంబరు 24, 1921 న జన్మించారు. 1935 లో స్త్రీ పాత్రవేషధారణతో తన యాత్రను మొదలుపెట్టి, 1941 లో గుంటూరు లో స్టార్ ధియేటరును స్థాపించి నాటక ప్రదర్శనలు ఇచ్చారు.
రంగస్థలము పై 'మయసభలో ధుర్యోధనుని' పాత్రను తన అసమాన ప్రతిభతో పోషించి 'అభినయ సామ్రాట్' అని బిరుదు పొంబినారు.
ఇక వెండితెర పై 'భీష్మ' చిత్రముతో ప్రవేశించి, సుయోధన, రావణ, మైరావణ, శకుని వంటి పాత్రలతో విషము కక్కి, తెలుగింటి ఆడబడుచులచే 'ఛీ' అనిపించుకొన్న మహానటుడు.
వారినే 'రావమ్మా మహాలక్ష్మి రావమ్మా' అంటూ..హరిదాసుగా పాత్రలను పోషిస్తూ, ఆ హరిదాసు పాత్రనే తన జీవితముగా మలచుకొని, ఆ హరిలో ఐక్యమైన "నడిప్పిళ్ పులి నడత్తల్ పసువు" (నటనలో పులి, నడతలో ఘోవు) శ్రీ ధూళిపాళ గారికి ఇవే తెలుగు బ్లాగర్ల తరఫున అశ్రు నీరాజనాలు, నివాళిలు.
పురస్కారాలు :
తెలుగు వెలుగు - ఉగాది పురస్కారం - తెలుగు విశ్వవిద్యాలయం
నాటక కళా ప్రపూర్ణ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాటక అకాడమి
ఆత్మ గౌరవ పురస్కారం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
2007 ప్రతిభా పురస్కారం - ఆజో. విభో ఫౌండేషన్.
ఇవికాక ఎన్నో, మరెన్నో బిరుదులు, ప్రశంశలు, సన్మానాలు, అందుకున్న అభినయ ఋషి శ్రీ ధూళిపాళ.
1 అభిప్రాయాలు:
స్వర్గీయ ధూళిపాళ 15-16 సంవత్సరాల క్రితం సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అప్పటినుండి గుంటూరులోనే భిక్షాటన చేస్తూండేవారు. ఆ ఊళ్ళో మారుతీనగర్ అనే కాలనీతో పాటు అక్కడి మారుతీ ఆలయాన్ని కూడా తన కష్టార్జితంతోనే నిర్మించారు. ఆరోగ్యం బావున్నంతవరకు ఆ ఆలయంలోనే కాలక్షేపం చేశారు. నిజంగా ఆయన ఋషితుల్యుడే.
Post a Comment