సినిమాలు - విలువలు

>> Thursday, June 21, 2007

ఈ టపా ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు...ఈ అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలు అన్నీ నావే...ఎవరైనా బాధపడితే..తప్పు నాదికాదు...

ఏమిటో అందరూ "నేటి సినిమాలొ వికృత పోకడలు" చదివి విలువల గురించి, కళల గురించి మాట్లాడుతున్నారు.

నాలాగ అలోచిస్తే..?

1. మనిషి మార్పును సహజంగా కోరడు...ఎంతసేఫూ పాతది అంటే ఇష్టపడతాదు...హైదరాబాదు నుంచి బెంగళూరు వచ్చినవారు..మా హైదరాబాదులో ఇంత ట్రాఫిక్ ఉందదు, మా హైదరాబాదులో అర్ధరాత్రైనా సిటి బస్సులు దొరుకుతాయి, ఈ బెంగళూరులో (అది ఏ ఊరైనా కావచ్చు) భోజనమే కాదు టిఫిన్ కూడా ఏడ్చినట్ట్లు ఉంటుంది..అదే హైదరాబాదులోనో, విజయవాడలోనో అదుర్స్..ఇలా...మన కాలము వారికి...మల్లీశ్వరి, దేవదాసు, అరాధన..భేషుగ్గా నచ్చుతాయి...ఆ కాలములో వారికి అవి హద్దు మీరినట్ల్లు కూడా కనిపించాయని..మీరు ఎందుకు ఆలోచించరు?

2.పరభాషా నటూలు & గాయకులు .... హిందీ లో పాడగానే "నేషనల్ అవార్డు" వచ్చిందని S.P. గారి భుజాలు తట్టినప్పుడు లేని భావాలు ఈ రోజు ఇతర భాషలవారు తెలుగులో పాడితే వచ్చిందా?..బాలూ గారి హిందీ, ఉత్తర భారతీయుల భాషలాగా ఉంటుందా...వీరే కన్నడము,తమిళములలో పాడొచ్చా?, "రఫీ" గారు తెలుగులో పాడితే..ఆహా..ఓహో అన్నాము..గుర్తులేదా? మరి ఇప్పుడు ఏమైంది?..నటీ నటుల విషయానికి వస్తే..వైజయంతీ మాల, వహీదా రెహమాన్, రేఖ, శ్రీదేవి..వీరంతా అక్కడ పరభాషా నటూలు కారా...మన చిరంజీవీ, నాగార్జునలు ఒకటి రెండు సార్లు హిందీలో ప్రయత్నాలు చేసి, చేతులు కాలి వెనక్కి తిరిగివచ్చారు..అదే వారికి విజయాలు లభించి ఉంటె, రెండు, మూడూ చాన్సులు దొరికి ఉంటే...వీరూ అక్కడ కూడా నటించరా..అప్పుడు వీరినేమనాలి?

3. దుస్తులు...(క్షమించాలి)మీ (చిన్న) పిల్లలకి జీన్శ్ పాంటు, పొట్టి, బొడ్డు కనిపించే డ్రస్సులు వేయటం లేదా..ఇవి ఎక్కడినుంచి వచ్చాయి?..స్కూలు కెళ్ళె పిల్లలు, కాలేజీ వెళ్ళే పిల్లలను చూసారా ఈనాడు?..నిండుగా కప్పుకొని కనిపిస్తున్నారా...కనిపిస్తున్నారు, మేము పెంచుతున్నాము (అని మనల్ని మనం మోసం చేసుకోవద్దు)..ఇదంతా నడుస్తున్న ఫ్యాషన్..అంతే..సినిమాలో కూడా అంతే...(ఈ విషయము మీద ఇంకా ఎక్కువ చెబితే బాగుండదు...)..చదువు, విజ్ఞానం ఎక్కువ ఐతే బట్టలు కూడా కురచ ఐపోతాయి..(ఇది ఒక సైకిల్ లాంటిది...చివరకి మొత్తం విప్పి, తిరిగి మొత్తం కప్పుతారు)

4. ఐనా ఆ వ్యాసములో పేర్కొన్న పుస్తకాలు 60 సం. పైబడినవారు వ్రాసినవి...వారి కాలానికి మన కాలానికి పోచి చూసుకున్నారు...మనము, మన కాలానికి రేపటి తరానికి పోలిక చూసుకొంటె...మమమే బాగా ఉన్నాము అని అనుకొంటామేమో...

6. మాసు & క్లాసు....మంచి సినిమా రాలేదని భాదపడేవారు 100 కి 20 మంది ఉంటారు అని అనుకొంటే..మిగతా 80 మంది ఆ సినిమాని ఎంజాయ్ చేసేవారే...మన్లాంటి ఒకటు ఒక సినిమాను 2 సార్లు 100 పెట్టి చూస్తే...అదే 80% మంది 10 సార్లు 10 పెట్టి చూస్తాడు..మరి నిర్మాతకు ఏది లాభం?

7. కళా పోషణ....నేను బెంగళూలో ఉంటాను...నాకు కళలంటె ఇష్టం..నా కూతురికో, కొడుక్కో సంగీతం, నాట్యం నేర్పించాలని అనుకొంటే..అదీ పద్దతిగా..దానికొరకు ఏ విజయవాడో, కూచపూడో పంపాలి...ఇదే వారు ఇక్కడాఉంటె...కన్నడము, హిందీ, తెలుగు, ఇంగ్లీషు బాషలతో తెచ్నాలజీ, ఫాస్ట్నెస్సు అలవడుతాయి...మరి నాకు పిల్లల భవిష్యత్తు ముఖ్యమా, లేక కళా పోషన ముఖ్యమా?..పెద్ద పెద్ద కళాకారులంతా కూడా కళలను అమ్ముకున్నవారే...ఎవ్వరూ, ఏ ప్రదశన ఉచితముగా ఇచ్చిందీ లేదు...

8..కానీ ముఖ్యముగా మన డైరెక్టరు చేయవలసిన పని కధ మీద కాంసంట్రేషన్ చూపడం, స్క్రిప్టుకి బైండు కావడం...మనవారికి కధలు లేవు అనే జాడ్జ్యం పట్టుకొంది...ఎన్ని నవలలు లేవు, ఎన్ని కధలు లేవు తెలుగులో?..వాటిని చదివిన పాపాన పోలేదు...ఎవరికి వారు మేమే గొప్ప అనే భావనలో ఉన్నారు....

9. స్క్రిప్టు...సెట్టు మీదకు వెళ్ళి మార్చేది కాదు స్క్రిప్టంటె అని తెలుసుకోవాలి...మొన్న కృష్ణవంశీ, శ్రీఆంజనేయం అనే సినిమాకి..తీసింది నచ్చక, చాలా రీలు తగలేసారని పరిశ్రమ కోడై కూస్తుంది..మన అలోచనలు నిముషానికి ఒకసారి మారుతూ ఉంటాయి...ఒకనిముషములో తీసింది మరునిముషములో నచ్చదు., అందువలన ఇలా వేస్టు అవుతుంది..అదే స్క్రిప్ట్ నే అనుసరిస్తే..ఈ అనవసరపు ఖర్చు తగ్గుతుందిగా...

ఇక చాలు ఉంటా...తరువాత కలుస్తా...

Read more...

స్వీట్ మ్యాజిక్

>> Wednesday, June 13, 2007

'స్వీట్ మ్యాజిక్'...ఇదొక పేరుపొందిన స్వీట్ షాపు...విజయవాడ లో బందరు రోడ్డు మీద, కాంధారి హోటల్ కి దగ్గరగా ఉంటుంది..

దీనిలో స్వీట్లే కాదండోయ్..కేకులు, రొట్టెలు (అదే రోటి, నాన్‌లు)కూడా దొరుకుతాయి..ఇవి మా ఇంటిదగ్గరకూడా దొరుకుతాయి..ఇందులో వింతేముంది?..అంటారా...ఉందండి...

ఆ స్వీట్ మ్యాజిక్ లోపల ఒక వాతావరణ సమతులనా యంత్ర గది (అదే ఏసి రూం) ఉంది...అ గదిలోకి వెళ్ళి ప్రశాంతముగా కూర్చొని..కళ్ళు చీకటికి అలవాటు పడిన తరువాత (అంటే డిమ్ము లైట్లు ఉంటాయి)నెమ్మదిగా తలను మీ ఎడుమ వైపుకు తిప్పండి... అక్కడ 'నర్తనశాల' లోని కీచకుడు కనిపిస్తాడు...మీరు కరెక్టే...మన స్వర్గీయ రంగారావు గారే కనిపిస్తారు...

తరువాత వెనకకి తిరగండి...లేదా తల తిప్పండి..అక్కడ మన తోడి కోడళ్ళు...అదేనండీ "సూర్యకాంతం గారు, సావిత్రి గారు మరియు అందరికి పెద్దదైన కన్నాంబ గారు' కనబడతారు..

సరే ఇంక కుడి వైపుకి చూస్తారా..సరే అక్కడ బెంగాలీ బాబు దేవదాసు, అతని ప్రియురాలు పార్వతీ ప్రేమించుకుంటూ దర్శనమిస్తారు.

అలానే ఇంకొంచెం పక్కకి చూస్తే...సీతా కల్యాణం లో సుందాకారుడైన లంకేశ్వరుడు రావణాసురుడు (ఏవరో మీకు నేను చెప్పాలా?, తెలియని వాడు తెలుగు వాడు కానే కాదు కదా) మృదు మందహాసముతో నిల్చొని ఉంటాడు...ఆ పక్కనే సకల కళా సరస్వతి భానుమతి, చచ్చిన చావు చావకుండా చచ్చి, తన మేధస్సుతో రాయల సామ్రాజ్యాన్ని కాపాడిన మహామంత్రి తిమ్మరుసుగారు...గుమ్మడి...కనపడతారు...

ఇంత విషయము ఉన్న దానిని గురించి బ్లాగించి మీకు తెలుపుదామని నా ప్రయత్నం...ఇవన్నీ సినిమ పోస్టర్లు కాదు (పాత ఆంగ్ల సినిమా పోస్టర్లు మనకు హైదరాబాదు లోని ప్రసాద్స్ లో కనిపిస్తాయి). నలుపు తెలుపులలో ఉన్న భంగిమల చాయా ఛిత్రాలు...

మాంఛి ఎండలో వెళ్ళిన నాకు, శరీరానికి చల్లదనమే కాకుండా, వీనులవిందైన పాత హిందీ పాటలతో చెవులను, ఈ ఫొటోలతో కళ్ళనూ...మొత్తంగా నా మనస్సును చల్ల బరిచినది....ఈ....స్వీట్ మ్యాజిక్...

ఎప్పుడైనా విజయవాడ వెళ్తే...స్వీట్ మ్యాజిక్ వెళ్ళ్డానికి ప్రయత్నించండి..

ఇది నిజంగా స్వీట్ మ్యాజిక్కా కాదా...మీ అభిప్రాయాలను తెలుపుతారు కదూ...

Read more...

కాల్చేయండి!

>> Tuesday, June 12, 2007

అదేమిట్రా..వీడికి బద్దకము పోయి..వీరత్వము వచ్చిందా..అని 'హాచర్యపోవొద్దు..'...నేను శాంతి కాముకుడిని...అర్రే..! నొట్లో వేలేసుకున్నరా..నిజమే లేండి..మనకంత సీను,విషయము కుడా లేవు..నేనుకుడా..మీలాగే సగటు భారతీయుడినే..దొంగలు, గూండాలు రాజకీయనాయకులు అవుతుంటే నవ్వుకోవటం మినహా ఏమీ చెయలేని వాడిని, దొంగలు ఊర్లకి ఊర్లు (అదే రింగులు, ఫాబులు అని) అని పంచుకుంటుంతే, ఆ ఊరినించి పారిపోవటం మినహా మీలాగె ఏమీ చేయలేని వాడిని..ఇంకచాలంటారా...సరే..అలాగే చేదాం..అనినా ఈ సొల్లు ఏమిటి అంటారా...అదేనండి...
కాల్చేయండి అనేది టెంగ్ల (టెల్గు) పదము...అంటే..మన భాష (తెలుగు లో) ఫోన్ చేయండి అని.. ఫోన్ అనేది తెలుగు పదం కాకపోయినా తెలుగులో బాగానే స్థిరపడిన పదం.. ఇక విషయానికి వస్తే...
రాజా: ఇప్పుడు ట్టైం - ట్టెన్ తర్టి - మీ కాల్చేసింది సునీత, రాజాలకు..
రాజా: హాయ్! సునీటా - హౌ ఆర్ యు?
సునీత: య! రాజా...కూల్...(ఎండాకాలం లో ఈ కూల్ ఏమిటో)
*****
సునీత: మరి ఆల్రెడీ టెన్ థర్టి అయిందికదా...ఇంక ఈ రోజు కాలర్లు చూద్దామా...(ఇవేమన్నా చొక్కా కాలర్లా చూడడానికి, ఫోన్ చేసేవారిని వింటారమ్మా...చూడరు)
*****
రాజా: ఈ రోజుకి సంవత్సరము నిండిన మిస్టర్. రవి మరియు రాధలకు వివాహ శుభాకాంక్షలు... (ఆహ! ఎమి పద ప్రయోగమురా...!)
(పాట: చిలుకా ఏతోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక...) ***
సునీత: రేపు మీరు కాల్చేయవలసిన నంబరు *******. కాల్చేస్తారు కదూ...
******
విషయం అర్ధమైనదా? ఈ గోల, తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు ప్రముఖులకు ఒకప్పటి దేవాలయమైన "ఆల్ ఇండియా రేడియో - విజయవాడ వారి వివిధ భారతి" వారి FM రేడియో జాకీలది.
ఈ కార్యక్రమము విన్న తరువాత..నేను ఎందుకు బ్రతికి ఉన్నానా అని అనిపించిది....అంటె కాదు...సీతా కల్యాణం లోనో మరేదో తెలియదు కానీ రావణాసురుడు పేగులు పీక్కొని చస్తాడు చూడండి...ఆలా చేయాలని పించింది...ఏమిచేస్తాం...సగటు భారతీయుడినిగా...ఆనీ మూసుకొని బెంగళూరు వచ్చేశా..

ఇవేకాదు...ఇలాంటివి చాలా కార్యక్రమాలు AIR ఒక్కటే కాదు....అన్నీ FM
ఏ రేడియో విన్నా ఏమున్నది గర్వకారణం...తెలుగు భాష సమస్తం టెల్గు కే బానిసత్వం.
AIR వారు ఇప్పటికన్నా నిద్ర లేస్తే బాగుంటుండి...

చెప్పుకుంటే..చాలా ఉన్నాయి....మళ్ళా చెప్పుకుందాము...

అప్పటి దాకా షెల్వ్....సోరి...సెలవు...

Read more...

త్వరలో

>> Monday, June 11, 2007

త్వరలో...."త్యాగరాజ కీర్తనల గురించి తెలుసుకుందాము". (బద్దకము వదిలి వ్రాస్తానని మనవి చేసుకుంటునాను..)


మీ
అనీల్ చీమలమఱ్ఱి

Read more...