సినిమాలు - విలువలు

>> Thursday, June 21, 2007

ఈ టపా ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు...ఈ అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలు అన్నీ నావే...ఎవరైనా బాధపడితే..తప్పు నాదికాదు...

ఏమిటో అందరూ "నేటి సినిమాలొ వికృత పోకడలు" చదివి విలువల గురించి, కళల గురించి మాట్లాడుతున్నారు.

నాలాగ అలోచిస్తే..?

1. మనిషి మార్పును సహజంగా కోరడు...ఎంతసేఫూ పాతది అంటే ఇష్టపడతాదు...హైదరాబాదు నుంచి బెంగళూరు వచ్చినవారు..మా హైదరాబాదులో ఇంత ట్రాఫిక్ ఉందదు, మా హైదరాబాదులో అర్ధరాత్రైనా సిటి బస్సులు దొరుకుతాయి, ఈ బెంగళూరులో (అది ఏ ఊరైనా కావచ్చు) భోజనమే కాదు టిఫిన్ కూడా ఏడ్చినట్ట్లు ఉంటుంది..అదే హైదరాబాదులోనో, విజయవాడలోనో అదుర్స్..ఇలా...మన కాలము వారికి...మల్లీశ్వరి, దేవదాసు, అరాధన..భేషుగ్గా నచ్చుతాయి...ఆ కాలములో వారికి అవి హద్దు మీరినట్ల్లు కూడా కనిపించాయని..మీరు ఎందుకు ఆలోచించరు?

2.పరభాషా నటూలు & గాయకులు .... హిందీ లో పాడగానే "నేషనల్ అవార్డు" వచ్చిందని S.P. గారి భుజాలు తట్టినప్పుడు లేని భావాలు ఈ రోజు ఇతర భాషలవారు తెలుగులో పాడితే వచ్చిందా?..బాలూ గారి హిందీ, ఉత్తర భారతీయుల భాషలాగా ఉంటుందా...వీరే కన్నడము,తమిళములలో పాడొచ్చా?, "రఫీ" గారు తెలుగులో పాడితే..ఆహా..ఓహో అన్నాము..గుర్తులేదా? మరి ఇప్పుడు ఏమైంది?..నటీ నటుల విషయానికి వస్తే..వైజయంతీ మాల, వహీదా రెహమాన్, రేఖ, శ్రీదేవి..వీరంతా అక్కడ పరభాషా నటూలు కారా...మన చిరంజీవీ, నాగార్జునలు ఒకటి రెండు సార్లు హిందీలో ప్రయత్నాలు చేసి, చేతులు కాలి వెనక్కి తిరిగివచ్చారు..అదే వారికి విజయాలు లభించి ఉంటె, రెండు, మూడూ చాన్సులు దొరికి ఉంటే...వీరూ అక్కడ కూడా నటించరా..అప్పుడు వీరినేమనాలి?

3. దుస్తులు...(క్షమించాలి)మీ (చిన్న) పిల్లలకి జీన్శ్ పాంటు, పొట్టి, బొడ్డు కనిపించే డ్రస్సులు వేయటం లేదా..ఇవి ఎక్కడినుంచి వచ్చాయి?..స్కూలు కెళ్ళె పిల్లలు, కాలేజీ వెళ్ళే పిల్లలను చూసారా ఈనాడు?..నిండుగా కప్పుకొని కనిపిస్తున్నారా...కనిపిస్తున్నారు, మేము పెంచుతున్నాము (అని మనల్ని మనం మోసం చేసుకోవద్దు)..ఇదంతా నడుస్తున్న ఫ్యాషన్..అంతే..సినిమాలో కూడా అంతే...(ఈ విషయము మీద ఇంకా ఎక్కువ చెబితే బాగుండదు...)..చదువు, విజ్ఞానం ఎక్కువ ఐతే బట్టలు కూడా కురచ ఐపోతాయి..(ఇది ఒక సైకిల్ లాంటిది...చివరకి మొత్తం విప్పి, తిరిగి మొత్తం కప్పుతారు)

4. ఐనా ఆ వ్యాసములో పేర్కొన్న పుస్తకాలు 60 సం. పైబడినవారు వ్రాసినవి...వారి కాలానికి మన కాలానికి పోచి చూసుకున్నారు...మనము, మన కాలానికి రేపటి తరానికి పోలిక చూసుకొంటె...మమమే బాగా ఉన్నాము అని అనుకొంటామేమో...

6. మాసు & క్లాసు....మంచి సినిమా రాలేదని భాదపడేవారు 100 కి 20 మంది ఉంటారు అని అనుకొంటే..మిగతా 80 మంది ఆ సినిమాని ఎంజాయ్ చేసేవారే...మన్లాంటి ఒకటు ఒక సినిమాను 2 సార్లు 100 పెట్టి చూస్తే...అదే 80% మంది 10 సార్లు 10 పెట్టి చూస్తాడు..మరి నిర్మాతకు ఏది లాభం?

7. కళా పోషణ....నేను బెంగళూలో ఉంటాను...నాకు కళలంటె ఇష్టం..నా కూతురికో, కొడుక్కో సంగీతం, నాట్యం నేర్పించాలని అనుకొంటే..అదీ పద్దతిగా..దానికొరకు ఏ విజయవాడో, కూచపూడో పంపాలి...ఇదే వారు ఇక్కడాఉంటె...కన్నడము, హిందీ, తెలుగు, ఇంగ్లీషు బాషలతో తెచ్నాలజీ, ఫాస్ట్నెస్సు అలవడుతాయి...మరి నాకు పిల్లల భవిష్యత్తు ముఖ్యమా, లేక కళా పోషన ముఖ్యమా?..పెద్ద పెద్ద కళాకారులంతా కూడా కళలను అమ్ముకున్నవారే...ఎవ్వరూ, ఏ ప్రదశన ఉచితముగా ఇచ్చిందీ లేదు...

8..కానీ ముఖ్యముగా మన డైరెక్టరు చేయవలసిన పని కధ మీద కాంసంట్రేషన్ చూపడం, స్క్రిప్టుకి బైండు కావడం...మనవారికి కధలు లేవు అనే జాడ్జ్యం పట్టుకొంది...ఎన్ని నవలలు లేవు, ఎన్ని కధలు లేవు తెలుగులో?..వాటిని చదివిన పాపాన పోలేదు...ఎవరికి వారు మేమే గొప్ప అనే భావనలో ఉన్నారు....

9. స్క్రిప్టు...సెట్టు మీదకు వెళ్ళి మార్చేది కాదు స్క్రిప్టంటె అని తెలుసుకోవాలి...మొన్న కృష్ణవంశీ, శ్రీఆంజనేయం అనే సినిమాకి..తీసింది నచ్చక, చాలా రీలు తగలేసారని పరిశ్రమ కోడై కూస్తుంది..మన అలోచనలు నిముషానికి ఒకసారి మారుతూ ఉంటాయి...ఒకనిముషములో తీసింది మరునిముషములో నచ్చదు., అందువలన ఇలా వేస్టు అవుతుంది..అదే స్క్రిప్ట్ నే అనుసరిస్తే..ఈ అనవసరపు ఖర్చు తగ్గుతుందిగా...

ఇక చాలు ఉంటా...తరువాత కలుస్తా...

11 అభిప్రాయాలు:

cbrao June 21, 2007 10:02 AM  

సెభాష్! బాగా చెప్పావ్.

Phani June 21, 2007 11:07 AM  

మీరు ఇచ్చిన లింకులో చెప్పబడినవి కొంతవరకూ నిజాలే అయినప్పటికీ పాత సినిమాలే గొప్ప, అదుర్స్, కత్తి అనే విషయాన్ని మాత్రం నేను అంగీకరించను. పాత సినిమాలలో మాత్రం బూతుపాటలు లేవంటారా? ఒక్కసారి మ్ మ్ మ్ ముద్దంటే చేదా ..., లే లే లే నా రాజా .... పాటలని గుర్తుతెచ్చుకోండి. తెలుగు సినిమా దుస్థితి మీద ఇంతగా బాధపడుతున్న ఈ (పాత)సినీనటులకు గుర్తులేదా తాము ఎన్ని చవకబారు సినిమాలలో నటించామో?

ప్రవీణ్ గార్లపాటి June 21, 2007 1:29 PM  

నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను.
సినిమా నాకు సంబంధించినంత వరకు ఓ వినోద సాధనం అంతే. కాలం తో పాటు అన్నీ మారినట్టు ఇది కూడా మారుతూ వచ్చింది. అవును అది మంచి కోసమే అని నేననట్లేదు.

lalitha June 21, 2007 9:32 PM  

మీ టపాని / ఇక్కడి వ్యాఖ్యలని అర్థంచేసుకునే ప్రయత్నంలో కొన్ని ప్రశ్నలు:

పాత సినిమాలలో ఎంత శాతం అసభ్యత, హింస ఉంది? ఇప్పటి సినిమాలలో ఎంత ఉంది?

వినోదం అంటే ఏమిటి?

ప్రజలను ఆకర్షించే so called formula తో తీసే సినిమాలలో ఎన్ని విజయ వంతం (వ్యాపార దృష్ట్యా) అవుతున్నాయి?

మార్పు సహజమే. మార్పు అభ్యంతరకరం అయితే మాట్లాడ కూడదా?

కళా పోషణ అంటే ప్రతి ఒక్కరూ కూచిపూడికి వెళ్ళి కూచిపూడి నృత్యం నేర్చుకోవడమా?

ఈ మాసు అంటే ఏమిటి? వారిని ఎవరు define చేశారు? వారి అభిరుచులని ఎవరు సేకరించారు? హిట్టయిన సినిమాలో ఉన్న level of అసభ్యత మరియు హింసయా వారి అభిరుచి కొల మానాలు?

చిన్న పిల్లలు candies ఇష్ట పడతారు. దానికి మోతాదు నిర్ణయించక్కర లేదా? ఎక్కువ తింటే పళ్ళు పాడయి పోవా?

ఈ ప్రశ్నలు నా ఆలోచనలకు పదును పెట్టుకోవడానికి, నాణేనికి రెండో వైపు చూడడానికి చేసే ప్రయత్నం అని అర్థం చేసుకోగలరు.

lalitha June 22, 2007 12:00 AM  

ఇంకొన్ని ప్రశ్నలు / observations:

హిందీలోకి పరభాషా నటులు వెళ్ళినా సొంత గొంతుతొటే మాట్లాడారు. exceptions ఉన్నా చాలా తక్కువ.

fashion ని నడిపించే వారి శాతం ఎంత? fashion అంటే ఏమిటి? నిజంగా మీ పిల్లలు ఒక పరిధి దాటి so called fashion follow అయితే మీకు అభ్యంతరం ఉండదా?

ఆ వ్యాసంలో ఉదహరించిన నేటి పాటల వంటివి అభ్యంతర కరంకాదా? అలాంటివే ఈ మధ్య మరీ ఎక్కువ ఉండటం లేదా?

అనిల్ చీమలమఱ్ఱి June 22, 2007 12:03 AM  

లలిత గారూ మీ ప్రశ్నలకు నా టపాలోనే జవాబులు దొరుకుతాయి...ఐనా కొంచెం విడమర్చి చెబుతాను...

1. మీ పిల్లలు ఏవరినా ఇంటర్, డిగ్రీలు చదివే వాళ్ళు, ఉంటే అడగంది..ఈనాటి సినిమా ఎలావుందని...చాలా బాగుందని...జవాబు వస్తుంది...(రాకపోతే..పోకిరి అనే ఒక సినిమా రికార్డులు సాధించదు...అతడు అనే సినిమా అవార్డులు తెచ్చుకోదు...)..30 సంవత్సరాలు నిండినవారికి..దాదాపూ ఈనాటి సినిమాలు నచ్చవు...కానీ ఈ జనరేషన్ వారికి ఇవే నచ్చుతున్నాయి..ఐనా పాతకాలంలో చూపించిన హింస, అసభ్యత ఇప్పుడు మనము మాట్లాడకుడదు..(ఎందుకంటె మనము ఎక్కువ చూశాము., మనమూ ఆకాలములో ఉండి ఉంటే..అదే మనకు అసభ్యత గా అనిపించి ఉండొచ్చు).

2. వినోదం అంటే., జరుగుతున్న కాలంతో మనమూ నడచి, వారికి నచ్చేట్టుగా వినోదింప చేయటమే...కాలాణుగుణంగా వినోదం పంచకపోతే అది ఆ వినోదం పంచేవాడి తప్పు..ఉదాహరణకు..స్వరాభిషేకం..ఈ సినిమా ఎందుకు ఆడలేక పోయింది?.

3. so called formula అంటె...మనము మన పిల్లలకి రసాయన సాస్త్రం (కెమిస్ట్రీ), లెక్కలు(మ్యాథ్స్) ఫార్ములాలు ఎందుకు నేర్పుతున్నాము...అది ఆ రశాయనిక చర్య, లెక్కల ఫలితములకోసమే కదా...ఇదీ అంతె... మీరు అడగొచ్చు..ఈ ఫార్ములాలకి అధారము ఉందా..అని., మీరు నేర్పించే సైన్సు ఫార్ములాలను మీరు ఎప్పుడైనా పరీక్షించారా..కేవలము టెక్స్ట్ బుక్కులలో ఉన్నదానినే అనుసరించారు. కానీ, అదే నిర్మాతలు చేసి విజయాలు పొందారు..అదుకే మిగతావారు అనుసరిస్తున్నారు..ఇంకా వివరంగా చెప్పాలంటే...మనకు వంటల పుస్తకాలు ఉన్నాయి...ఒకే రకం కూరను 4 విడివిడిగా చేస్తే ఒకే రుచి వస్తుందా...? రాదు, ఎందుకంటే దానిని అనుసరించే పద్దతి మీద అధారపడుతుంది..అలానే ఆ ఫార్ములాను స్రీగా అనుసరిస్తే విజయాలు దొరుకుతాయేమో..

radhika June 22, 2007 12:06 AM  

మంచి చెడు అన్నవి ఆ కాలంలోను వున్నాయి,ఈ కాలంలోనూ వున్నాయి.మీరు లింక్ ఇచ్చిన వ్యాసం లో ఆయన అప్పటి మంచిని ఇప్పటి చెడు ను మాత్రం చూపిస్తూ ఏకపక్షం గా రాసుకొచ్చారనిపిస్తుంది.ఇప్పటి కాలం లో రక్తపాతాలు,హింస ఎక్కువయింది అనడం లో సందేహం లేదు.అప్పట్లో సినిమాని సినిమాలా గా తీసేవారు.ఇప్పుడు చాలా సినిమాలను జీవితానికి దగ్గరగా తీస్తున్నారు.ఇప్పుడు కూడా తలుపు చాటు నుంచుని సమాధానాలు చెపుతాను అంటే ఎలాగా? అంత దాకా ఎందుకు?ఒకప్పుడు ఆడ మగ స్నెహాలు తప్పు అనేవారు.ఇప్పుడు ఆ స్నేహాన్ని తప్పు అనము కదా మనం. ఇప్పుడు ఆడా మగా స్నేహాన్ని దాటి కలిసుంటే ఏమిటి తప్పు అంటున్నారు.ఇంకొన్నేళ్ళు పోతే ఇదికూడా ఒప్పు అనిపిస్తుంది.మార్పు వస్తూనే వుంటుంది.పాతలో వుండిపోయేవాళ్ళకి ఈ మార్పు కష్టం గా వుంటుంది.సినిమా అయినా అంతే.

lalitha June 22, 2007 2:31 AM  

అనిల్ గారు,

నా ఆలోచనలు బహుశః కొన్ని పాత తరంలో ఆగిపోయాయేమో అనిపిస్తోంది మీ వివరణ చదివితే. అది తప్పా అనేది ఇంకో ప్రశ్న. నా అనుమానాలు చాలా తీరలేదు. నేనడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరకలేదు. ఇంకొన్ని ప్రశ్నలు తొలుస్తున్నాయి.

రసాయన శాస్త్రం formula కీ, వంట recipe కి తేడా ఉంది. ఒకటి science, ఇంకొకటి art. సినిమాలు వంటతో పోలిస్తే మీ వివరణ సరిగానే ఉంది. అయితే అందులోనే నేనడిగిన ప్రశ్న ఇంకా జవాబు దొరకకుండా మిగిలి ఉంది. పిల్లలకు candy ఇష్టమనో లేకపోతే చిరు తిళ్ళు ఇష్టమనో భోజనం మానేసి అదొక్కటే విందు చేస్తామా మూడు పూటలా?

ఇప్పుడే Oprah show లో ఒక వివాదాస్పద rap పాట గురించి మాట్లాడుతున్నారు. మనం desensitise అయిపోయామా, కొన్ని విషయాలకి అని చర్చ. beat బాగుంది కదా పాటలో మాటలెలా ఉంటేనేం అనుకోవాలా అని. ఇలా ... పూర్తిగా చూడలేదు, చూసేందుకు తీరిక ఇప్పుడు లేదు. నేను చెప్ప దల్చుకున్నదేమంటే ఈ సమస్య , సంఘర్షణ ప్రతి చోటా ఉన్నది. మన context తెలుగు కాబట్టి తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నాము. మనం చెయ్య గలిగేదేమైనా ఉంటే కూడా ఈ context లోనే కాబట్టి.

నా ప్రశ్నలన్నిటికీ ఇక్కడే ఈ టపాలోనే జవాబులు ఆశించడం లేదు. ఈ ప్రశ్నలు చదివే వారితో బాటు నన్ను కూడా ఆలోచింప చెయ్యడమే నా ఉద్దేశం. వ్యాసం ఒక కోణంలోంచీ, మీరు ఇంకో కోణం లోంచీ చూస్తున్నారు. రెండిటినీ study చేద్దామనే ప్రస్తుతం నా ప్రయత్నం. అర్థం చేసుకోగలరు.

మరి కొన్ని ఆలోచనలు మరో రోజు, బహుశః నా బ్లాగులో.

netizen June 22, 2007 5:12 PM  

సినిమాలలొ వలువలు - విలువలు గురించి ఒక తరానికి చెందినవారికి మరొక తరంలోనివి సహజంగానె నచ్హవు.

స్తన్యం ఇస్తున్న స్త్రీలో బూతుని చూడగలినవారు కూడా వుంటారు.
కాబట్టి చూసెవాడి దృష్టిలొ ఉంది దోషం.
వారు కావలంటెనే ఆనాడు జ్యొతిలక్ష్మి'లేపమంటావా' అని గంతులేసింది.
వాణిశ్రీ ఆరేసుకోబొయి పారేసుకున్నదానిని ఏ ఎన్ ఆర్ గారు అందుకున్నారు.

ఈనాడు బొడ్డు చుట్టె సినిమా కదులుతున్నది. నేటి తరానికి అది కావాలి. అది ఇస్తున్నారు. వారు చూస్తున్నారు.

మరి ఆనాడు, స్త్రీ తలుపు చాటునుండే మాట్లేడేది. మరి నేడొ మగవారితో భుజం,భుజం కలిపి 'కార్యకలాపాలూ' సాగించడంలేదూ. అంతకు క్రితం 'సతి సహగమనం' మరి నేడో అక్రమసంబంధం కాదట, అది 'వివాహెతర సంబంధం'అట.

డేటింగ్ అలవన్సులు మీద ప్రభుత్వం సుంకం విధిస్తున్నదని లబోదిబో.

కాబట్టి, తల్లులారా, నాయనలారా, మార్పు సహజం. పక్కకు జరగండి.

మేము ముందుకువెళ్ళాలి.
'పదండి ముందుకు,
పదండి తోసుకు,
పోదాం పైపైకి....'

sivaparvathi July 13, 2007 1:31 PM  

అనిల్ గారు!
మిమ్మల్ని కించపరచాలని మాత్రం నేను ఈ వ్యాఖ్య రాయడంలేదు.నేను లలిత గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

పాత తరంతో పోల్చి చూసుకుంటే ఈ రోజులలో సినిమా ప్రజలకు బాగా దగ్గరయ్యింది. అందువల్ల మంచి సినిమాలు అందించడం నిర్మాతలు, దర్శకులు మన ప్రభుత్వం తమ తమ బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం వుంది, కాదంటారా?
పాత తరం వాళ్ళు కూడా పర భాషా చిత్రాలలో పాడారు. కాదనటం లేదు. కాని వాళ్ళు అలా పాడేటప్పుడు ఎంతో సాధన చేశారు. భాష లో ఎగుడు దిగుడులు ఔపోసన పట్టారు. ఇప్పుడు నాయికలకు తెలుగు మాట్లాడటమే రావడం లేదు. డైలాగులు చెప్పలేని వాళ్ళు పాటలు ఏమి పాడతారు?
పాత సినిమాలలో కూడ అసభ్యత వుంది. కాని, అశ్లీలత్వం, అసభ్యత ప్రదర్శించడానికి కొంతమంది ప్రత్యేకంగా వున్నారు. మన సావిత్రి లాంటి హీరోయిన్లు అలాంటి పాత్రలు చెయ్యలేదే?
కథానాయిక అంటే అందరికీ ఆదర్శంగా, తన వంతు గౌరవంగా వుండాలి. వాళ్ళే అసభ్యంగా వుంటే, అశ్లీలత ప్రదర్శిస్తే ఎవరిని ఆదర్శంగా తీసుకోవడానికి సినిమాను చూడాలి?
హింస అంటే ఎవరికైనా హాని తలపెట్టడం. అలా చేస్తాడు కాబట్టే రాజనాల విలన్ అయ్యాడు. కాని కథానాయకుడే అందరినీ నరికేస్తూ ఇదే జీవించే విధానం అని నూరిపోస్తుంటే మంచి కథ అని చప్పట్లు చరచాలా?
ప్రజలను మంచి దారిలో అలోచింపచేసేటట్లు సినిమా వుండాలి కాని, హీరో ఏది చేస్తే అది నిజం అనిపించేటట్లు తియ్యకూడదు. ఈ విషయంలో ప్రేక్షకుల తప్పు కూడా వుంది అన్నది సత్యమే.
పాటలు, సాహిత్యం , సంగీతం ఒక భాషకి వరాలు లాంటివి. వాటిని పాడుచేసి ఆ ప్రశాంతత కూడా లేకుండా చెయ్య వద్దు అని మనవి చెయ్యాలి అనిపిస్తుంది. మనసుకి ఆహ్లాదంగా వుండే ఒక్క పాట కూడా రావడం లేదంటే తెలుగు సినిమా ఏ పరిస్థితులలో వుందో అర్ధం చేసుకోవచ్చు.
మిమ్మల్ని బాధపెట్టడం నా ఉద్దేశ్యం కాదు. మరోలా తీసుకోరాదని నా మనవి.

Anonymous March 17, 2008 3:34 PM  

Boss Nuvvu Kodhiga Theda Anukunta...