కాల్చేయండి!

>> Tuesday, June 12, 2007

అదేమిట్రా..వీడికి బద్దకము పోయి..వీరత్వము వచ్చిందా..అని 'హాచర్యపోవొద్దు..'...నేను శాంతి కాముకుడిని...అర్రే..! నొట్లో వేలేసుకున్నరా..నిజమే లేండి..మనకంత సీను,విషయము కుడా లేవు..నేనుకుడా..మీలాగే సగటు భారతీయుడినే..దొంగలు, గూండాలు రాజకీయనాయకులు అవుతుంటే నవ్వుకోవటం మినహా ఏమీ చెయలేని వాడిని, దొంగలు ఊర్లకి ఊర్లు (అదే రింగులు, ఫాబులు అని) అని పంచుకుంటుంతే, ఆ ఊరినించి పారిపోవటం మినహా మీలాగె ఏమీ చేయలేని వాడిని..ఇంకచాలంటారా...సరే..అలాగే చేదాం..అనినా ఈ సొల్లు ఏమిటి అంటారా...అదేనండి...
కాల్చేయండి అనేది టెంగ్ల (టెల్గు) పదము...అంటే..మన భాష (తెలుగు లో) ఫోన్ చేయండి అని.. ఫోన్ అనేది తెలుగు పదం కాకపోయినా తెలుగులో బాగానే స్థిరపడిన పదం.. ఇక విషయానికి వస్తే...
రాజా: ఇప్పుడు ట్టైం - ట్టెన్ తర్టి - మీ కాల్చేసింది సునీత, రాజాలకు..
రాజా: హాయ్! సునీటా - హౌ ఆర్ యు?
సునీత: య! రాజా...కూల్...(ఎండాకాలం లో ఈ కూల్ ఏమిటో)
*****
సునీత: మరి ఆల్రెడీ టెన్ థర్టి అయిందికదా...ఇంక ఈ రోజు కాలర్లు చూద్దామా...(ఇవేమన్నా చొక్కా కాలర్లా చూడడానికి, ఫోన్ చేసేవారిని వింటారమ్మా...చూడరు)
*****
రాజా: ఈ రోజుకి సంవత్సరము నిండిన మిస్టర్. రవి మరియు రాధలకు వివాహ శుభాకాంక్షలు... (ఆహ! ఎమి పద ప్రయోగమురా...!)
(పాట: చిలుకా ఏతోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక...) ***
సునీత: రేపు మీరు కాల్చేయవలసిన నంబరు *******. కాల్చేస్తారు కదూ...
******
విషయం అర్ధమైనదా? ఈ గోల, తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు ప్రముఖులకు ఒకప్పటి దేవాలయమైన "ఆల్ ఇండియా రేడియో - విజయవాడ వారి వివిధ భారతి" వారి FM రేడియో జాకీలది.
ఈ కార్యక్రమము విన్న తరువాత..నేను ఎందుకు బ్రతికి ఉన్నానా అని అనిపించిది....అంటె కాదు...సీతా కల్యాణం లోనో మరేదో తెలియదు కానీ రావణాసురుడు పేగులు పీక్కొని చస్తాడు చూడండి...ఆలా చేయాలని పించింది...ఏమిచేస్తాం...సగటు భారతీయుడినిగా...ఆనీ మూసుకొని బెంగళూరు వచ్చేశా..

ఇవేకాదు...ఇలాంటివి చాలా కార్యక్రమాలు AIR ఒక్కటే కాదు....అన్నీ FM
ఏ రేడియో విన్నా ఏమున్నది గర్వకారణం...తెలుగు భాష సమస్తం టెల్గు కే బానిసత్వం.
AIR వారు ఇప్పటికన్నా నిద్ర లేస్తే బాగుంటుండి...

చెప్పుకుంటే..చాలా ఉన్నాయి....మళ్ళా చెప్పుకుందాము...

అప్పటి దాకా షెల్వ్....సోరి...సెలవు...

16 అభిప్రాయాలు:

Harinath Mallepally June 12, 2007 5:02 AM  

టైటిల్ చూసి మీరు టెర్రరిస్టుల్లొనో ఫాక్షనిస్టుల్లోనో జాయిన్ అయ్యరెమో అనుకున్నా. రెడియో ప్రొగ్రాం గురించా?

సత్యసాయి కొవ్వలి June 12, 2007 6:58 AM  

పటాయించు గురు అని ఒక పిచ్చమ్మాయి అరుస్తుంది హైడ్ బాడు FMలో. మీభాధే నాది ఖూడా.:))

నాగరాజా June 12, 2007 10:44 AM  

ఎవడో కాల్చెయ్యక ముందే హెచ్చరించారు. థాంక్స్. నవ్వించింది టపా!

నవీన్ గార్ల June 12, 2007 11:06 AM  

బాగా నవ్వుకున్నాను

ramani June 12, 2007 1:47 PM  

హెల్లొ అనీల్ చీమలమఱ్ఱి గారు.. బాగున్నరా?? బాగుంది మీ కాల్చెయండి హాస్య ప్రహసనం. నవ్వుకొన్నాము తెలుగు అంటె మీకంత ఇస్టమా??సరదాగా నవ్వించారు...

ప్రవీణ్ గార్లపాటి June 12, 2007 8:44 PM  

బాగా కాల్చారు.

radhika June 13, 2007 12:49 AM  

ఏ టీవీ చానల్ చూసినా,ఏ ఎఫ్.ఎం విన్నా ఏముంది లెండి గర్వకారణం.మీ టపా మాత్రం బాగా నవ్వించింది.

రానారె June 13, 2007 8:13 AM  

ఈ టపా చాలా హాటు గురూ! అలాంటి రేడియో జాకీలను నిజంగా కాల్చేయాలనిపిస్తుంది. వాళ్లచేతిలో మాతృభాష పడే చిత్రహింస మన కడుపు కాల్చుతుంది. మీక్కూడా కాలి రాసినట్లున్నారు. విజయవాడకేంద్రం అలా తయారైతే మిగతావి ఊహించుకోవచ్చు. కడపక్కూడా ఒక ఎఫ్.ఎమ్ వస్తోందంటకదా!?

విహారి June 13, 2007 9:47 AM  

మొన్న నా బుర్రకాయలోకి ఏదో పరకాయ ప్రవేశం చేస్తే.voicevibes.net వెళ్ళి radio mirchi రదిఒ మీద పడ్డా. దెబ్బకి దెయ్యం కుదిరింది. ఏదో మదన తాపంతో కూడిన విషయాలు మాట్లాడుకుంటున్నారు. నేను కామ తాపంతో పరితపించిపోతున్నా అని వాడంటే.... మొత్తం బ్లాగులో పెడదామనుకున్నా. నా బ్లాగు శృంగారం అని పేరు పెడతారని మానేశా. ఇది ఎంతో మేలు. సంతోషించండి.

Lambodar June 13, 2007 2:33 PM  

బాగా నవ్వించింది.
రావణాసురుడి పేగుల సీన్‌ - భూకైలాస్ అనుకుంటా..

పటాయించు లాగే నేను విన్న ఇంకొన్ని పదప్రయోగాలు:
చలాయించు -- (కారు)డ్రైవ్ చెయ్యి.
దబాయించు -- (బటన్‌)నొక్కు.
పదాయించు -- నడిపించు.

Lambodar June 13, 2007 2:34 PM  

తెలుగు భాషకి కాల్చెయ్యకుండానే, దాన్ని కాల్చేస్తున్న ఈ జాకీలని నిజంగానే కాల్చెయ్యాలి.

swathi June 13, 2007 3:54 PM  

కడుపు రగిలి హృదయం మండిపోయే బాధని కూడా నవ్వుతూ స్వీకరించి మాకూ కొంత నవ్వు పంచారు.
హస్కీ గొంతులు, పుస్కీ (అర్ధం అడగొద్దు) మాటలు.పిచ్చి గోలలు.
పోయిన సంవత్సరం అనుకుంటా ఉగాది రోజున సదరు రేడియో లో కాల్చిన వాళ్ళకి ఒక గొప్ప ప్రశ్న: పంచ పాండవులు ఎంత మంది అని.
ఈ కాల్చిన శ్రోతలు చాల మంది gave up.
ఒక మహానుభావుడు "ఇహి,ఇహి..నాలుగా ఆరా?" అంటే ఈ జాకి "intellegent guess బగ దగ్గరగా వచ్చిన సమాధనం మీదే. ఉగాది gift కొట్టేశావ్ గురూ" అని ఒక తొక్కయెస్ట్ compliment.

అన్నట్టు ఈ పటాయించటాలు, మిర్చిదిగో గూరూ లాటివన్ని వచ్చాక FM commercial గా తెగ క్లిక్ అయిందట.
ఎందుకులెండి . అదంతా ఒక హృదయ విదారక అభివృద్ధి.

ప్రసాద్ June 15, 2007 2:11 AM  

అవును అలా మాట్లాడితేనే అవి తెగ అభివృద్ది అవుతున్నాయట మరి అదే నమూనాలో AIR కూడా నడుస్తూండవచ్చు.

-- ప్రసాద్
http://blog.charasala.com

త్రివిక్రమ్ Trivikram June 17, 2007 9:34 AM  

నేనైతే ఫోను మోగినప్పుడు "కాలొచ్చింది, కడుపొచ్చింది" అని కాకుండా "ఎవరో పిలుస్తున్నారు" అ(నుకు)ంటాను. నేను హైదరాబాదుకొచ్చిన కొత్తల్లో AM లోనే రైతులకు సూచనలు కూడా తెంగ్లీషులో విని, నిజంగా ఆ సూచనలు అవసరమైన రైతుల్లో ఎంతమందికి అవి అర్థమౌతాయా అని ఆశ్చర్యపోయాను. కడప కేంద్రంలో టక్కోలు మాచిరెడ్డి స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు రేడియో కార్యక్రమాల్లో తెంగ్లీషు కాకుండా తెలుగే వాడాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. వాటిని అక్కడ ఇప్పటికీ పాటిస్తున్నారు. "333.3 మీటర్లు అనగా 900 కిలో హెర్ట్జ్ పై..." నాకు నచ్చే అంశాల్లో అదొకటి.

రానారె June 18, 2007 12:06 AM  

తక్కోలు మాచిరెడ్డి అనుకుంటాను, త్రివిక్రమ్! ట - టైపు తప్పు అయుండొచ్చు. కదా!?

Anonymous February 09, 2010 1:03 AM  

sentence scotland orgarts apts gerry split ampoule gaug behaviors sketched dissatisfied
lolikneri havaqatsu