కొన్ని మంచి పత్రికలు
>> Tuesday, October 31, 2006
కొన్ని మంచి పత్రికలు
మనందరికీ ఈ వల (అంటే internet) లో కధలు, కవితలు చదవడం అలవాటు. మీ అందరికీ కొన్ని మంచి పత్రికలను పరిచయం చెద్దమనుకొంటున్నాను. వీటి గురించి ఎవరికైన తెలుసుంటె...మంచిదే...తెలియని వారికోసం ఈ పరిచయం..
1.)
రచన
సంపాదకుడు: శాయి
వెల: 35 రూ / 10$
ప్రచురణ: హైదరాబాదు
నాణ్యత : బాగుండదు
ఈ పత్రిక ప్రవాసాంధ్రులలో చాల పేరు పొందినది. ఈ పత్రిక ముఖ్యంగా ప్రవాసాంధ్రుల కొరకు నడుపబడుతున్న పత్రిక అని నా అభిప్రాయము.. దీనిలో సాహిత్యానికే పెద్ద పీట. ప్రవాసాంధ్రుల కధలు, కవితలు, సమీక్షలు, విశ్లేషణలు ఎక్కువ...
ఇది మాసపత్రిక - కానీ మాసం మాసం రావడం అనుమానమే..(దీనికి చాలా కారణాలు ఉన్నాయంటారు)
2.
పత్రిక
గౌరవ సంపాదకుడు: శ్రీ రమణ (వీరి గురించి పాఠకులకు ప్రత్యేకంగా చెప్పనవసరము లేదు)
వెల: 5 రూ / 10 రూ (ప్రత్యేక సంచిక)
ప్రచురణ: మౌనిక పబ్లికేషన్స్ - హైదరాబాదు
నాణ్యత : బాగుంది
ఈ పత్రిక కూడా సాహిత్య భరితమైనది. ముఖ్యముగా సంపాదకీయం "xxxx - మానవ సంబంధాలు" అదిరిపోతుంది..దీనిలో నానీలు బాగుంటాయి (అర్ధం అయితె), వ్రాసినవారే మళ్ళా వ్రాస్తారు..కొత్తవారికి అవకాసం ఎక్కువ ఇచ్చినట్లు కనపడదు.
కధలు, కవితలు, కాకరకాయలు ఎక్కువ.
ఇది మాస పత్రికో పక్ష పత్రికో గుర్తు లేదు.
3.
రసమయి
సంపాదకుదు : నండూరి పార్ధసారధి
వెల:35 రూ (30 రూ లకు తగ్గించారని చదివినట్లు గుర్తు)
ప్రచురణ : హైదరాబాదు
నాణ్యత : అదిరిపోతుంది
కధలు కాకరకాయలు లేవు. ఇది మాత్రం ప్రతి ఇంటా ఉండవలసిన పత్రిక, మొన్నటి వరకూ భారత భాగవతాల నుంచి కృష్ణుడి గురించి 'క్రిష్ణ సంచికలు (మొత్తం 25 దాకా) ప్రచురించారు...అదుర్స్, ఇంక భానుమతి గురించి, సంగీతం గురించి, అన్నమయ్య రచించిన ప్రజలకు తెలియని పద్యాల గురించి, ఎందుకులే ఒకటా రెండా ....
తప్పకుండా తెప్పించుకోండే...ఈ మాస పత్రికని
చివరిగా
4.
చినుకు
సంపాదకుడు : నండూరి ****
వెల: 10రూ
ప్రచురణ: విజయవాడ
నాణ్యత : ఫరవాలేదు.
కధలు, మినీ కవితలు, కార్టూన్లు దీనిలో వస్తువులు. అదృష్ట దీపక్, నగ్నముని, ఇంకెందరో ఇందులో కనిపిస్తారు.
కొత్తవారికి అవకాశాలు ఇస్తారు.
పైన చెప్పిన పత్రికలు బయట దొరకవు...చందాదారులు కావటమే మార్గం.
100 కి 100 శాతం ఇవి మంచి పత్రికలు అని మరొక సారి నొక్కి వక్కాణిస్తున్నాను.
6 అభిప్రాయాలు:
mari elaa teppuinchukOvaalO kUDaa meere cheppanDi saaar...
అనిల్ గారూ! చాలా మంచిటపాలు రాస్తున్నారు. ఇలాగే రాస్తూ ఉండండి. :)
మీరు రచన వెల 35/- అన్నారు. దాని వెల 20/- మాత్రమే. ఇది "మాసం మాసం రావడం అనుమానమే.." అన్నారు. కానీ ఇది గతం. ఇప్పుడు క్రమం తప్పకుండా వస్తోంది.
చినుకు గురించి నాకు తెలియదు. తెలిపినందుకు కృతజ్ఞతలు.
అన్నట్లు ఇంకో మాట: మీ బ్లాగులో కిందటిరోజు వరకూ రాసిన టపాలన్నిటినీ ఎప్పటికప్పుడు దాచేస్తూ ఉంటారెందుకని?
రసమయి ఇండియా లో
రసమయి
ఎ-21, జర్నలిస్ట్ కాలని
జూబిలీ హిల్స్
హైదరాబాదు - 500 033
ఫోను: (040) 23548352
Email: nampaasaa@nanduri.com
U.S.A లో
ఫోను: (1) 732 274 2883
Email: madhu@nanduri.com
రచన
1-9-286/3
విద్యానగర్
హైదరాబాదు - 500 044
మిగతా వాటి చిరునమాల గురించి రేపు చెబుతాను.
త్రివిక్రము గారికి
ధన్యవాదములు, నా ఉత్తరాలు చదివినందుకు... దీపావళికి ఇంటికి వెళ్ళినందున వ్రాయలేకపోయాను..నేను లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తాను (బాలయ్య డైలాగ్...హ్హ హ్హ హ్హ...)
ఇక రచన గురించి:
నేను రచన చదివి చాలా రోజులైంది, నిన్న ఇంటికి వెళితే కనిపించింది, ఈ ఆరు నెలలలో నేను చదవని వనీ చదివేసాను..
అది క్రమం తప్పకుండా వస్తున్నందుకు సంతోషముగా ఉంది..
ఇక నా ప్రచురణల విషయానికి వస్తే,
నాకు simple గా ఉంటే ఇష్టం, ఐన రోజూ వేడి అన్నం ఉండగా చద్ది ఎందుకు? (చద్దనం లో పెరుగు వేసుకొని తింటే....ఆహా ఎమి రుచి..అనరా మైమరచి, చద్ది కూడా బాగుంటుంది)
మామూలుగానే జనాలు అభిప్రాయాలు వ్రాయరు...మనము వ్రాసేది ఒక్కటి ఐనా వాళ్ళకు నచ్చితే, వాళ్ళే మన పాత వ్యాసాలు చదువుతారు...
చినుకు:
ఈ పత్రిక విజయవాడ నుంచి ప్రచురిస్తున్నారు...పెద్ద పేరుమోసిన పత్రిక కాదు..కానీ, మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో చదివాను..కధలు బాగున్నాయి., క్రేన్ (వక్కపొడి) వారి సహాయముతో జరిగిన కధల పోటీలలోని ప్రధమ, ద్వితియ బహుమతి పొందిన కధలను ప్రచురించారు...బాగున్నాయి.
అనిల్ చీమలమఱ్ఱి
పుస్తక ప్రియులందరికి మంచి సమాచారం...
తెలియచేసినందుకు ధన్యవాదాలు.
మిగతా పత్రికల చిరునామాలు తెలియజేస్తారా...?
Post a Comment