రామా కనవేమిరా..! శ్రీ రఘురామ కనవేమిరా?

>> Thursday, October 12, 2006

రామా కనవేమిరా..! శ్రీ రఘురామ కనవేమిరా?

ఇదేమిటీ ఈ పాట వ్రాసాడు అని అనుకొంటున్నారా?....కాదండీ చదవండి..మీకే తెలుస్తుంది.

కడప జిల్లా "ఒంటిమిట్ట" లో శ్రీ కోదండరామస్వామివారు కొలువై ఉన్నారు...ఒంటిమిట్టకు ఉన్న విశేషాలు ఏమిటంటే:

ఈ గుడిని చోళులు, విజయనగర రాజులు కట్టించారు.

ఈ గుడిలో, కేవలము సీత, రామ మరియు లక్ష్మణులు మాత్రమే దర్శనమిస్తారు. హనుమానులు గారు లేరు...

ఈ మూడు విగ్రహాలు కలసి ఒకే రాతి పై చెక్కబడ్డాయి.

32 స్తంభాలతో నిర్మించిన "మధ్యరాగమడపం" అతిసుందరమైనది...

దీనిని చూసి ఒక ఫ్రెంచ్ యాత్రికుడు, Tavernier, "one of the grandest pagodas in the whole India". అని అన్నారని ఒక సమాచారము.

ఇవేకాక,

శ్రీ మధ్భాగవతం వ్యాసకర్త "శ్రీ బెమ్మర పోతనామాత్యులు" ఇక్కడివారే..


మాకు తెలుసు ఈ సోది ఆపు అంటారా?...సరె..అసలుది క్రిందుంది చదవండి.

ఆ మండపము మధ్యలో రాతితో చేసిన పుష్పం, దాని మధ్యలో ఒక రాతి మొగ్గ అమర్చారు..ఆ మొగ్గలో వజ్రాలు పెట్టి ఉంటాయని కొందరి అనుమానము / అపోహ /ఊహ .

పురాతన దేవాలయాల్లో విగ్రహాల క్రింద నవధాన్యాలు, వజ్ర వైఢూర్యాలు, నవరత్నాలు ఉంచి ప్రతిష్ట చేస్తారని నమ్మకము.

ఆ రాతిమొగ్గ చోరీ అయ్యిందని సమాచారము., ఈ దొంగతనము జరిగిన రాత్రి, వాచ్‌మెన్ను ఇంటికి పంపి దేవాదాయ శాఖాధికారి, పురావస్తు శాఖాధికారి, మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు గుడిలో మద్యం సేవించినట్లు వినికిడి.

గుడిలో మద్య సేవనం, ఆపై దొంగతనం....రామరామా...

ఓ రామా ఇకనైనా నిద్రలే...ఎమా మొద్దునిద్ర...

2 అభిప్రాయాలు:

spandana October 13, 2006 9:22 pm  

బరితెగించి పోయారు.

--ప్రసాద్
http://charasala.com/blog/

Ramanadha Reddy October 13, 2006 10:45 pm  

హనుమాన్లుగారు లేకపోవడంతో ఈ ఘోరంజరిగిపోయినట్లుంది.

చిన్నప్పుడు ఒకే ఒకసారి ఒంటిమిట్ట రామాలయాన్ని చూశాను. మీరు చెప్పిన ఈ సంగతులన్నీ నాకు కొత్తే. ధన్యవాదాలు.