క్షమాభిక్ష

>> Thursday, October 05, 2006

ఇండియన్ పీనల్ కోడ్ (IPC) 302, భారత శిక్షా స్మృతిలో అతి పెద్ద శిక్ష - "ఉరి శిక్ష"

ఉరిశిక్ష ఎవరికి వేస్తారు...కరడు కట్టిన తీవ్రవాదులకు, పాశవికంగా హత్యలు చేసేవారికి.

మరి ఉరిశిక్ష పడిన వ్యక్తులకి మానవతా దృక్పధం తో మన ప్రభుత్వం కొంతకాలంగా క్షమాభిక్షను ప్రసాదించి "యావజ్జీవితం కారాగారం" లోనే ఉండే అవకాశాలను కల్పించింది...ఉదా: నళిని భాగ్యనాధన్, రాజీవ్ గాంధీ ని చంపిన వ్యక్తులో ఒకరు.

అయితే భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నతమైన పార్లమెంటు భవనము పై దాడి కేసులో, మరణ శిక్ష ఖరారైన నిందుతుడు అఫ్జల్ గురు క్షమాభిక్ష కొరకు చాలమంది ప్రముఖులు ప్రయత్నిస్తున్నారిప్పుడు. కరడు కట్టిన తీవ్రవాదిగా ముద్రపడ్డ అఫ్జల్ కు మద్దతుగా శ్రీనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, నిజంగా మనము చేసుకొన్న పాపం, సిగ్గుపడాల్సిన విషయం, తలదించుకోవలసిన సమయం.

మానవ హక్కుల గురించి మాట్లాడే మానవహక్కుల సంఘం (మామూలుగా, వీరి దృష్టి లో మనవులంటే నక్సలైట్లు, తీవ్రవాదులు మాత్రమే..) అఫ్జల్ గురు కి క్షమాభిక్ష ప్రసాదించి, మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మర్చేలా రాష్ట్రపతిని కోరుతూ ఢిల్లీ లో ప్రదర్శనలు మొదలు పెట్టింది...దీనికి మద్దతు గా ప్రముఖ రచయిత్రి అరుందతీ రాయ్ ధర్నా నిర్వహించింది...(అసలు వీళ్ళే ఆ దాడి లో ముఖ్యులు అని నా అభిప్రాయం)


భారతీయుడి ఆత్మగౌరవనికి ప్రతీకైన పార్లమెంటు పై దాడి చేసిన వ్యక్తులకు క్షమాభిక్ష ప్రసాదించమని అడగడం, ప్రసాదించడం ఎంతవరకూ సమంజసం?


ఇది ఎంతమాత్రమూ ఆహ్వానించదగిన పరిణామము కాదు. ఈ కేసులో క్షమాభిక్ష ప్రసాదిస్తే త్వరలోనే రాబోతున్న, గుజరాత్ లోని అక్షరధాం కేసు, ముంబై ప్రేలుడుల కేసు, మొన్న జరిగిన ముంబై రైలు బాంబుల కేసు లలో కూడా ఇదే జరుగుతుంది..దేశమంతటా విద్రోహుల అరాచకాలు హెచ్చుమీరి పోతాయి..

చివరిగా నాది చిన్న అనుమానము:

గద్దర్ను, వరావర రావును పోలీసులు ఎత్తుకెళ్ళినప్పుడూ, మొన్న పుట్టపర్తి గారి విగ్రహం పగలగొట్టినప్పుడు..పెట్టిన పిటీషన్లు అరుంధతీ రాయ్ మీద, మానవ హక్కుల సంఘం మీద ఎందుకు పెట్టారు?

మనకి ఆత్మాభిమానము, ఆత్మగౌరవము లేవా? రాజ్యాగము మీద గౌరవము లేదా?...

పైన చెప్పినవి మీకు లేకపోతే "భారతీయులం" అని చెప్పుకో వద్దు దయచేసి...

ఉంటే, మీరే పిటీషన్ పెట్టండి...అందరి సంతకాలు అడగండి. మీవద్దకు పిటీషన్ వస్తే సంతకం పెట్టండి.

3 అభిప్రాయాలు:

Anonymous October 05, 2006 11:15 pm  

ముందసలు వీళ్ళని దేశద్రోహ నేరం కింద వేసెయ్యాలి. కోర్టు ధిక్కారం కింద ఆబిడగారిని ఒకరోజు జైల్లో వేసారిదివరలో.. ఈసారి వేసేసి అక్కడే ఉంచేస్తే బాగుండు!

Anonymous October 06, 2006 10:08 am  

అరుంధతీ రాయ్ లాంటి ప్రేమ కార్చేసే ఉదారవాదులు చాలా మంది ఉన్నారండి ఇక్కడ. టెర్రరిష్టులకి ఏమంది కాపీలు తాగారా టిఫినీలు చేశారా అని సకలమర్యాదలు ఇవ్వాలని గొడవ చేస్తున్నారు. వీళ్లు మంచోల్లే కానీ కాస్త మైండు బాగా ఓపెన్..అయ్యో అదెక్కడో జారిపోయింది పాపము. ఉదారవాదము ఈమధ్య భారతదేశములో కూడా ఫ్యాషనైపోయింది. (అమెరికా దిగుమతి)

Anonymous October 06, 2006 10:53 pm  

ఆ అఫ్జల్ గాడికి ఉరిశిక్ష తప్పించమని అడగటం ఒక స్టంట్ లెండి. అందులోను అరుంధతి రాయ్ లాంటి స్యూడో దేశోధ్ధారకులకు ఇది మాములే...వీళ్ళు ఇలాంటి మహా కంత్రీ విషయాలలో మాత్రమే తల దూర్చి గొప్ప వాళ్ళయిపోతారు. పాకిస్తాన్ వాళ్ళో, బంగ్లాదేశ్ వాళ్ళొ మన సైనికుల ముక్కులు కోసినా వీరికి కనపడదు, వినపడదు..

కాక పోతే ఉరి అనేది ఒక అమానవీయ చర్య అనేది ఒప్పుకుంటాను. ఏ సమాజానికి మూకుమ్మడిగా ఒకరిని ఉరి తీసే హక్కులేదు. అది ఒక అనాగరిక చర్య...అఫ్జల్ గాడిని జీవితాంతం జైల్ లో ఉంచితే అంతకంటే శిక్ష మరొకటి లేదు.