నగ్నంగా నాట్యమాడుతున్న యీ ఆలోచనలే - నూతన సంవత్సరానికి స్వాగత గీతాలు
>> Sunday, December 31, 2006
ఆదిలో దాన్నెవరో గిర్రున తిప్పారు. అది కోట్ల సంవత్సరాలుగా గిరగిర తిరుగుతోది. తిరగడంలో గోళంలోపల పదార్ధాం, అణువులు వోత్తిడికి ఢీకొని విడి వేరు వేరు గోళాలుగ తిరుగాడాయి. అట్లా ఒక్కొక్క గోళంలో నుంచి కొన్ని పిల్లగోళాలు వుద్భవించి, పరిభ్రమిస్తూ వున్నాయి.
విడిపోయిన వాటికి అన్యోన్య ఆకర్షణ వుంది..నిర్ణీతమైన దూరంలో, మార్గంలోతిరుగాడుతాయి...గోళాలు పెరిగిపోతున్నాయి. కొన్ని విడిపోయి, నుశైపోతున్నాయి. కొన్ని పెద్దవైపోతున్నాయి. విశ్వం పెరిగిపోతూవుంది. విశ్వంలో ప్రతి పదార్థమూ గిరగిర తిరిగిపోతోంది. దాన్ని ఎవరూ ఆపలేరు. మొదట్లో ఏ శక్తి తీపిందో, ఆ శక్తికి కూడా నిలపడం సాధ్యం కాదు...సృష్టి ఆగదు..పరిభ్రమిస్తూ వుంతుంది. విశ్వంయొక్క వైశాల్యం, గాంభీర్యంతో పోలిస్తే మానవుడు అల్పుడు. కాని దాని వైశాల్యం, గాంభీర్యం ఎట్టివొ, ఎంతటివో తెలుసుకోగల మహత్తర శక్తి, అద్భుత చైతన్యం, వొక్క మానవుడికే వున్నాయి.
విశ్వంముందు మానవుడి అల్పత్వం ఋజువు కావాలంటె, అది మానవుని ఊహవల్లే జరగాలి.
కానీ, ఇది తెలుసుకోవడం వేరు, ప్రత్యక్ష పరిశోధనకి పూనుకొని, ఊహని కార్యంలోకి మార్చడం వేరు...
ఆ కదలిపోయే సృష్టిని, తిరిగే విశ్వాన్ని చూస్తూ...వేడుకలు జరుపుకోవడం ఎంతవరకూ సబబు?
నగ్నంగా నాట్యమాడుతున్న యీ ఆలోచనలే - నూతన సంవత్సరానికి స్వాగత గీతాలు
ఆలోచనా సరళి మారకుంటె, ఎన్ని క్రొత్త సంవత్సరాలు వచ్చినా ఒక్కటే.