నాకు ప్రత్యేక సింహపురి కావాలి!!

>> Thursday, December 28, 2006

ఏమిటో అందరూ...ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక ఆంధ్రా, ప్రత్యేక రాయలసీమ కావాలంటున్నారు...

ప్రత్యేక తెలంగాణా వస్తే... అది ఖమ్మం వరకూ, ప్రత్యేక ఆంధ్రా వస్తే అది గోదావరి జిల్లాలవరకూ, ప్రత్యేక రాయలసీమ వస్తే అది కేవలం తిరుపతి వరకూ మాత్రమే వర్తిస్తాయి...

మరి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుల పరిస్థితి ఏమిటి...?

అందుకే....

నాకు..ప్రత్యేక ఉమ్మడి కృష్ణా (కృష్ణా & గుంటూరు) కావాలి...మా నాన్న గారు ఇక్కడే సెటిల్ అయ్యారు..

మళ్ళీ నాకే...ప్రత్యేక సింహపురి కావాలి....నేను ఇక్కడ 7వ తరగతి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం వరకూ చదివా...మా పెద్దక్కనీ ఇక్కడే ఇచ్చాము..మాకు ఇల్లు కూడా ఉంది..

మళ్ళీ నాకే...ప్రత్యేక రాయలసీమ కూడా కావాలి...ఎందుకంటే...నా డిగ్రీ ఇక్కడే చెశాను.

అందుకే

జై బోలో... ప్రత్యేక సింహపురికి...
జై బోలో... ఉమ్మడి కృష్ణకి...
జై బోలో... ప్రత్యేక రాయలసీమకి...

గమనిక:

దొంగలు ఊర్లు పంచుకుంటున్నారు...మీరూ చేరండి...మీ రాష్ట్రం కోరండి..

4 అభిప్రాయాలు:

spandana December 28, 2006 2:19 AM  

మీ బాధ తీర్చడం కష్టమే!
--ప్రసాద్
http://blog.charasala.com

radhika December 28, 2006 5:49 AM  

naaku maatram samaikyaamdhraa kaavaali.

Ramanadha Reddy December 28, 2006 1:02 PM  

అసలే దొంగలు దొంగలు... కుంటున్నారు కదా, నాకైతే నాకున్న కొద్దిపాటి భూమిని ఎవడూ ప్రత్యేకంగా కావాలని కోరకుంటే సంతోషం.

త్రివిక్రమ్ Trivikram December 28, 2006 2:56 PM  

:D
చాలా బాగా రాశారు. ఇది మీకే!
మళ్ళీ మీకే: బ్లాగావరణంలోకి పున:స్వాగతం!