నా లోని నేను

>> Thursday, December 28, 2006

పిల్లలకి కదిలే ఆట వస్తువులంటె యిష్టం

ఈ సూత్రాన్ని గుర్తుంచుకొనే నేటి ఆట వస్తువులు తయారవుతున్నాయనుకొంటా..అందుకనే గిరగిర తిరుగుతున్న ఫాన్‌లో చెయ్యిపెట్టి నిలపాలని ప్రయత్నిస్తారు పిల్లలు..


అలా తిరిగే ఫాన్‌లొ వేళ్ళు పెట్టి నిలపాలని పిన్నలకే కాదు పెద్దలకి కుడా అనిపిస్తుంది...నా కట్లా ఎన్నోసార్లు అనిపించేది...దీనికి కారణం ఏమిటో మానసిల శాస్త్రఙ్ఞులు చెప్పాలి.


తెలియనివాటిని శోధించి తెలుసుకోవాలన్న అభిలాష మానవ సహజం! స్విచ్ లో చెయ్యి పెట్టి, విద్యుత్ ద్వారా షాక్‌తింటె ఎట్లా వుంటుందో! అలాగే ఫాన్‌లో చెయ్యి పెట్టి ఆపితే ఏం జరుగుతుందో!


దెబ్బ తగులుతుంది...ఆ దెబ్బలో బాధ వూహించుకొని మనపట్ల మనకి సానుభూతి కలగడం, ఆ సానుభూతి తో ముడిపడే ఆదరణ, శాంతి-యీ రకం చేష్టలకి ప్రేరణ అని తోస్తుంది..నాలుగంతస్తుల మేడమీద నుండి కిందకి చూసినప్పుడు, ఒక్క క్షణం, ఆ గోడమీదనుండి కిందకి దూకాలనిపిస్తుంది. ఊపిరిబిగపెట్టి అంత పని జరిగినట్లు వూహించి గోడనుంచి ఒకడుగు వెనక్కి వెయ్యడం జరుగుతుంది. మనల్ని మనం మనసికంగా బాధించుకోడం కిందకొస్తుంది ఈ తృష్ణ. కానీ చాలమందిలో, నాలో లాగే, యీ తృష్ణ ఊహలోనే వుండిపోతుందేమో..


నాకు చెయ్యాలనిపించికూడా చెయ్యలేకపోయిన పనినికాస్తా, పిల్లలు సాహసంతో చెసెస్తారు..అందుకనే వారిపట్ల ఆరకం ఆకర్షణ, అన్యోన్యం ఏర్పడిందేమో అని స్పురిస్తుంది.'నువ్వు చెయ్యవు కాదూ! చూడు, నేను చెయ్యి పెట్టి ఆపుచేస్తా' అన్నట్లు, ఆ పనిచేసి, చేసినట్లు నవ్వు ద్వారా ప్రకటిస్తారు.

2 అభిప్రాయాలు:

radhika December 28, 2006 7:45 PM  

ఎత్తయిన కొండ మీదకి వెళ్ళిన ,పెద్ద భవనాలు ఎక్కినా దూకాలనిపించడం మానసిక లోపాని సూచింస్తుందట.దానికి కూడా ఏదో పేరు వుంది.ఇప్పుడు గుర్తురావట్లేదండి.నాకెలా తెలుసు అంటే నాకు ఇలాంటి భావాలే కలిగేవి.అప్పుడు మా అంకుల్ చెప్పారు[మానసిక వైద్యులు]

spandana December 28, 2006 8:49 PM  

అనిల్,
కొంచం కదులతున్న వాటికి, ఎత్తైన, లోతైన వాటికి దూరంగా వుండండి బాబూ! జాగ్రత్త!
నాకు తెలిసినంతవరకూ పిల్లలకు పర్యవసానాలు తెలియక చేతులు పెడుతుంటారు.
మా పిల్లాడు ఏడాది కూడా నిండక ముందే ఓ రోజు దోగాడుతూ మెట్లమీద నుండి కింద పడ్డాడు. ఆ తర్వాత ఆ మెట్లవైపు ఎప్పుడు వెళ్ళినా దూరంగా దోగాడుతూ వెళ్ళేవాడు! మా మాస్టర్ బెడ్‌రూం బెడ్ చాలా ఎత్తుగా వుంటుంది. వాడిప్పటివరకూ కిందపడలేదు! మూరెడు దూరం కూర్చొనే చాతులు జాపుతాడు ఎత్తుకోమని!
పర్యవసానం ఒక్కసారి అనుభవమయ్యిందంటే పిల్లలు వెంటనే నేర్చేసుకుంటారు అది మళ్ళీ చేయకూడదని. తెలిసీ మళ్ళీ చేస్తున్నారంటే వైద్యుల దగ్గరకు తీసుకెళ్ళడమే మంచిది.
--ప్రసాద్
http://blog.charasala.com