ఓటు
>> Wednesday, July 18, 2007
రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వినియోగించకపోవడం నేరము...అలాంటప్పుడు, ప్రజాప్రతినిధులు, రాస్ట్రపతి ఎన్నికకు దూరంగా (తటస్థముగా) ఉండటము ఎంతవరకు సమంజసము...?
మీకు ప్రస్తుతము నిలబడిన అభ్యర్ధులు నచ్చకపోతే, మీవారిని (డమ్మీ)నిలబెట్టండి, వారికే ఓటువేయండి...
పెద్దలూ దయచేసి మీ ఓటును వినియోగించుకోండి.
స్నేహితులూ మీరూ మీ ఓటును ఉపయోగించి, మీ అభిప్రాయము తెలుపండి...
5 అభిప్రాయాలు:
మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడ్డ వాళ్ళు నచ్చక పోతే, మీకు నచ్చిన వాళ్ళను ఎమ్మేల్యేగా నిలబెట్టి మీ ఓటు వేస్తారా? ఇదీ అంతే! గెలిచే అవకాశం మృగ్యమని తెలిసీ ఎవరు నిల్చుని కాళ్ళ తీపడం తెచ్చుకుంటారు.[పోటికి నిలబడమంటే, ఒక్కసారి కలాం గారేమన్నారో గుర్తుతెచ్చుకోండి?!]
ప్రజాప్రతినిధులే ఇలా చేస్తే అనుకోవడమూ అర్థం లేనిదే! భాద్యతలనేవి -ప్రజలకైనా, ప్రజా ప్రతినిధులకైనా ఒక్కలాంటివే!
అనిలూ ఓటుకు దూరంగా వుండటం నేరం కాదు. అబ్యర్థుల్లో ఎవరూ ఇష్టం లేకపోతే ఇంకొకరిని నిలబెట్టుకుంటూ పోవడం సరైన పరిష్కారం కాదు. ఎవరూ నచ్చలేదు అన్న ఓటుకూడా వుండాలి. ఎవ్వరూ నచ్చలేదుకు ఎక్కువ ఓట్లు వస్తే అప్పుడు ఎన్నిక రద్దుచేసి మళ్ళీ నిర్వహించాలి.
--ప్రసాద్
http://blog.charasala.com
"ఎవ్వరూ నచ్చలేదు" అనే ఓటు వేసే సదుపాయంకూడా మన రాజ్యాంగం కల్పించిందట. మరింత సమాచారం కోసం ఇది చూడండి.
MLA ఎన్నికలలో ఇద్దరు అభ్యర్ధులు వెధవలు అయితే ఒక వ్యక్తిగా మీరు ఏమి చేస్తారు?
ఒక సారి మంటనక్కలో మీ బ్లాగుని తెరవండి.
"best viewed in ie" అనే ఒక ట్యాగు తగిలించేయాలి మీరు మీ బ్లాగుకు. ieలో ఈ టెంప్లేటు బాగా కనిపిస్తుంది మరి!
Post a Comment