డాక్టర్
>> Thursday, July 19, 2007
ఔరా! డాక్టరేట్ తెచ్చుకోవడం ఇంత తేలిక అని తెలిస్తే, నేను కూడా ఎవరో ఒక ఫిరంగిని (అదే పళ్ళుతోమని ఫారినర్ని) (ఆడవాళ్ళనే లేండి) ముద్దు పెట్టేసుకొని, ఫేమస్ అయిపోయి, బిగ్‌బ్రదర్ లో పాలుగొనేవాడిని కదా?
అకటా! ఏంత నష్టం జరిగిపోయినది, అనవసరంగా ప్రతీవారు, తమ మోధో సంప్పత్తిని అనవసరముగా ఖర్చు చేసి, సమయాన్ని, ధనమును వృధా చేసితిరిగా!
అయ్యలూ! ఒక చిన్న ధర్మ సందేహం, మనము డాక్టర్ అని ఎవరినిపిలవాలి?
ఫైవ్‌స్టార్ హోటళ్ళూ (అదే ఆసుపత్రులు, కాల్పులు చేసి, తగాదా పెట్టుకొని, ఎలిబీకోసము, బైలు కోసము వచ్చే పెద్దవాళ్ళను రక్షించే భవనాలు, ఇంకా వెలగలేదా..అదేనండీ మన "కేర్ హాస్పిటల్", అపోలో హాస్పిటల్" లాంటివి అన్నమాట) కట్టే వైద్యులనా?, మేధోసంపత్తితో (రి)సెర్చ్ (వెదికినదే వెదికతం కాబోలు) చేసి కట్టలకట్టలు కాగితాలు సమర్పించినవారినా లేక కులంపేరుచెప్పుకోకుండా బ్రతకలేని(తప్పుతప్పు ఆడలేని, సినిమాలులేని) రియల్ స్టార్ "శ్రీహరినా", ఒళ్ళు దాచుకోకుండా (సిగ్గులేకుండా) కష్టపడే శెట్టిగారినా?
జరంత సోచాయించి చెబుతారు కదూ?
17 అభిప్రాయాలు:
మాస్టారూ మొదట మీ బ్లాగ్ కలరు మార్చండి.
అక్కడేం కనబడి చావడం లేదు
లైటు పసుపు మీద నల్ల అక్షరాలు.., ఇది కనపడటం లేదా?
ఇది విశ్వనాధ్ గారికేనా, అందరికీనా?
తెలిపితే..మారుస్తాను, మంటనక్క (Firefox) లో ఇంకా చూడలేదు...చూసినతరువాత..మార్చాలంటే మారుస్తాను.
మీ
అనిల్ చీమలమఱ్ఱి
కొంచెం ఇబ్బందిగానే ఉందండి చదువుకోడానికి....
అవునా కులం గురించి వుంటాయా శ్రిహరి సినిమాలు? ఇతని సినిమాలు నేను చూడలేదు.నేనింకా పెద్ద హీరోల గురించి చెపుతున్నారనుకునాను.శ్రీహరి చాలా మంచి పనులు చేస్తాడని విన్నాను.కొంత మంది పిల్లలని మెడిసన్ చదివిస్తున్నడని ఇంకా ఇలాంటివి చాలా....చాలా మందికన్నా చాలా బెటరే అనుకుంటాను.నాకు బానే కనిపిస్తుందండి.నిజం చెప్పాలంటే నాకు నచ్చింది.
ఏవిటేవిటి ఈ శిల్పా గారికి డాకటరేటందిన విధంబెట్టిది - కొంచెం వివరంగా చెప్పండి!
అటులనే శ్రీహరి కుల ప్రసక్తి కూడా..
మీ లే అవుటు బానే కనిపిస్తోంది IEలో
నాకు మాత్రం పెద్ద ఇబ్బంది ఎమి లేదు చదవటానికి.
ఇంక ఈ బ్లాగు కి సంబందించినంత వరకు, శ్రీ హరి కులం వాడుతున్నాడు అని నేను అనుకూను. పెద్ద హీరొలతొ పొల్చితే, చాలా తక్కువ. అయనకి పరిశ్రమ లొ మంచి వాడు గా పేరు అని వినికిడి
డాక్టరేటు విషయంలో మీరు కొత్తగా హాశ్చర్యపోవలసినదేముందిలెండి. గత రెండు దశాబ్దాలుగా కొన్ని విశ్వవిద్యాలయాలు రెండు మూడు లక్షలపైన (వాటి వాటి స్థాయినిబట్టి) విరాళాలిస్తే చాలు ఎవరికైనా ఈ డాక్టరేటు ప్రసాదిస్తూనే ఉన్నాయి. డబ్బులిచ్చి సన్మానాలు చేయించుకోడం మనవాళ్ళకి కొత్తేమీకాదుగా!
Sriram
sreekaaram.wordpress.com
అసలు ఈ వార్త వినగానే చిర్రెత్తుకొచ్చింది. ఆ బిగ్ బాస్ షో లో శిల్పను అవమానించినందుకు ఇంత గౌరవమా ఆ యూనివర్సిటీ వాళ్ళకు అస్సలు బుద్ధి లేదు.లేక శిల్పానే డబ్బులిచ్చి అవార్డు తీసుకుంటుందా.అసలు డాక్టరు అనే పదానికి విలువ లేకుండా పోయింది .. అడ్డమైన వాళ్లందరికి ఇచ్చేస్తున్నారు. కష్టపడి పరిశోధన చేసిన వాళ్ళు తెచ్చుకునే డాక్టరేటుకి విలువ చచ్చిపోయింది. చీ...........
కులంపేరుచెప్పుకోకుండా బ్రతకలేని(తప్పుతప్పు ఆడలేని, సినిమాలులేని) రియల్ స్టార్ "శ్రీహరినా" --------
ఎక్కడ విన్నారు/చదివారు దీని గురించి? మిగిలిన వాళ్ళు కామెంట్లలో కోరిన విధంగా వివరాలు ఇస్తే బాగుంటుంది.
సినిమాల్లో కులం ప్రస్తావన లేకుండా బండి లాగిస్తున్న 'హీరో'లెవరన్నా ఉన్నారా మీకు తెలిసి?
అన్నా
బైలు కాదన్నా బెయిలు. బైలు అంటే బైట అని . కొంతమంది ప్రకృతి పిలుపుకి వెళ్ళాటాన్ని కూడా బైలుకి పోవటం అంటారు.
లైట్ పసుపేమిటండీ ఇది మానిటర్ పై ఎలా కనిపిస్తుందో మీకు పంపిస్తా మీ మెయిల్ ఐ డీ ఇస్తారా. నేనెక్కడ ఓపెన్ చేసినా అలానే కనిపిస్తుంది.
శ్రీహరి, ఎంత మంచోడో నాకు తెలియదు కానీ, ఆయన సినిమాల్లో (చాలా వాటిల్లో) మాత్రం చాలావరకు కుల ప్రస్తావన ఉంది, తన కులం పేరు చెప్పుకొని, మీసాలు దువ్వే సీన్లు, తొడలు కొట్టే సీన్లు చాలానే ఉన్నాయి...(ఆనీ పేర్లు గుర్తు లేవు, ఉదా :- గణపతి). ఇంకొన్ని సినిమాల్లో ఇంటిపేరు చెప్పుకొంటాడు ( ఉదా :- ముద్రగడ .. ఇంకా ఏమిటో)...ఇక మీరే తేల్చుకోడి..
బెయిలు అనేదానికి, కొంచెం టైపింగ్ పొరపాటు జరిగింది..బైలు అంటె అర్ధం తెలుసండి..నేను పుట్టింది పల్లేటూరే...అక్కడవాడే భాష నాకు తెలుసు...మీ విమర్శ కు ధన్యవాదములు..ఇంక తప్పులు లేకుండా చూసుకొంటాను.
నా బ్లాగు, IE లో కంటే firefox" లో ఇంకా బాగా కనిపిస్తోందే...
నా వరకూ బానే కనిపిస్తోంది...
విశ్వనాధ్ గారూ నా ఉత్తరాల డబ్బా చిరునామా: అనిల్.చీమలమఱ్ఱి@ఇన్‌బాక్స్.కాం (anil.chimalamarri@inbox.com)
శ్రీహరి కుల ప్రస్తావన అంటే అదా(కామెంటు వివరణ)!కొండను తవ్వి ఎలకను పట్టుకోడమంటే ఇదే!!
సినిమాల్లో ఇంటి పేర్లు చెప్పడం, కుల ప్రస్తావనలుండడం ఒక్క శ్రీహరి సినిమాల్లోనే కాదు...చాలా సినిమాల్లో తరచూ కనిపించేదే కదా(ఉదా: బొమ్మరిల్లు, ఇంద్ర, నరసింహ నాయుడు ... ఇంకా చాలా ఉన్నై)!
శ్రీహరి తన సినిమా డైలాగులు తనే రాసుకుంటూ, తన సీనులను తనే డైరెక్ట్ చేసుకుంటూ నటిస్తున్నాడన్నమాట! ఇది చాలా సరికొత్త సమాచారం
సినిమా రచయిత రాసిన డైలాగులు చెబుతూ, దర్శకుడు చెప్పినట్లు నటులు నటిస్తారనుకున్నా.
అథిధి గారూ.../ అందరూ..
నేను "డాక్టరేట్ల" గురించి మాట్లాడుతున్నాను, కుల ప్రస్తావన, ఇంటిపేర్లు చెప్పడం తెలుగు సినిమాల్లోనే ఉన్నాయి, కానీ అందరికీ "డాక్టరేట్లు" రాలేదు కదా...అందుకే శ్రీహరి పేరు చెప్పవలసి వచ్చింది..ఈయన చేసిన మంచి పనులు నాకు తెలియవు..ఇప్పుడే పైన అందరూ చెబుతుంటే వింటున్నాను/చదువుతున్నాను..ఆయన నిజగా ఆపనులు చేసి, "డాక్టర్" అయ్యుంటే నేను నా మాటలని వెనక్కి తీసుకుంటాను...
ఇదేకాక, అనగనఘ ఒకరోజు., అంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఎలక్షన్ ప్రచార సమ్యములోనో మరి ఎప్పుడో, డాక్టర్ శ్రీహరి గారు, డాక్టర్ మోహన్‌బాబు గారితో కలసి, ఒక ఆఫీసర్ని కొట్టాడు అనే వార్త దిన పత్రికలో చదివినట్టు గుర్తు..(ఎవరికైనా వివరం తెలిస్తే వివరించండి).
ఈకాలంలో నిర్మాత, డైరెక్టరు అనే వాళ్ళు ఉండడం లేదు..హీరోగారే అన్నీ విషయాలలో వేళ్ళు పెడుతున్నారని సినీజనముల భోగట్టా..
కులం పేరు సినిమాల్లో చెప్పుకునే(మీరు చెప్పినట్టు డైరెక్టర్లను, రచయితలను పట్టించుకోకుండా)వాళ్ళలో శ్రీహరి కొక్కడికే డాక్టరేట్ వొచ్చిందన్నది అపోహ మాత్రమే! ఆసక్తి ఉండి కాస్త పరిశోధన చేస్తే...సినిమాల్లో వాళ్ళకు చాలా మందికే డాక్టరేట్లు ఉన్నాయని తెలుసుకోవచ్చు(లిస్టు కావాలా?)...వాళ్ళలో చాలా మంది "కులం ప్రస్తావన" పనులు చేసుంటారు. ఇంకో అపోహ రచయితను, డైరెక్టరును పక్కనపెట్టి హీరోలే "అన్నింటి"లోనూ వేలు పెడుతున్నారని! ఇప్పుడున్న హీరోలలో చాలా మందికి (స్టార్లకు కొన్ని విషయాల్లో మినహాయింపు ఉండొచ్చు...మళ్ళీ శ్రీహరి రియల్ "స్టార్" కదా అని మొదలెట్ట వొద్దు) అంత "సీను" లేదు.
ఒక ప్రశ్న - శ్రీహరి సినిమాల్లో కుల ప్రస్తావనలు లేక పోతే డాక్టరేట్ ఇస్తే ఓకే యేనా?
బ్లాగులో అభిప్రాయాన్ని వెనక్కి తీసుకున్నా, తీసుకోకుండా ఉంచేసినా, డాక్టర్ శ్రీహరికి వచ్చేదీ/పోయేదీ ఏమీ లేదు!
ఇంతకీ శ్రీహరి కులం ఏమిటి?
సినిమా లోకంలో కులం చెప్పుకోనిది ఎవరు? కమ్మ వారు, కాపు వారు, రెడ్డి వారు , ఫలానా వారు ఫలానా వారు.
సినిమా ఇండస్ట్రీలో కొద్దిగా డబ్బులు రాగానే అందరూ డాక్టరేటు కొనుక్కుంటున్నట్టున్నారు, కొంతమంది పరాయి దేశపు యూనివర్సిటీలనుండి కూడా తెచ్చుకున్నారు. మే బీ ఇట్ ఈజ్ గివింగ్ ఎ ఫాల్స్ ప్రిస్టీజ్ లైక్ ఆల్ అదర్ తింగ్స్ ఇన్ ద వర్ల్డ్
ఏ మాట కామాటే చెప్పుకోవాలి, శ్రీ హరి బాగా కష్టపడి పైకి వచ్చినాడు. తనకు చేతనైనంతలో మంచివాడనే పేరు తెచ్చుకున్నాడు.
ఇంటి పేరు సినిమాలలో చెప్పుకోవడంలో నాకు ఏమీ తప్పు కనిపించడంలేదు "ఘట్టమనేని ఘట్టమనేని" అని ఓ వంద సార్లు కృష్ణా గారు పల్నాటి యుద్ధం ఆధారంగా తీసిన ఏదో సినిమాలో చెప్పుకున్నాడు, బాగానే ఉన్నది మరీ ఎబ్బెట్టుగా లేదు. ఏదో ఒక పేరు చెప్పుకోవాలి కదా, సూర్యదేవర అని వెంకీ సూర్యవంశం సినిమాలో చెప్పుకోలేదు (అఫ్ కోర్స్ అది వెంకీ ఇంటి పేరు కాదు, కానీ ఒకే కులపు ఇంటి పేరు కదా! )
ఇంతకీ మన ఇష్యూ ఏమిటి?
డక్టరేట్లు ఇలా సెలబ్రిటీలకు ఇవ్వ వచ్చునా లేదా?
ఇవ్వకూడదు! కానీ మనము ఇప్పుడు ఆపలేము కదా! కనుక ఈ గౌరవ డాక్టరేట్లను ఆపలేము కాబట్టి మన అసలు డాక్టరేట్లకు (అనగా పీ యెచ్ డీ డాక్టరేట్లను వేరే పేరుతో పిలుచుకుందాము శుభ్రంగా బతికి పోతాము)
హాయ్ అనిల్, మీకు వున్న తెలుగు భాషాభిమానానికి జోహార్లు. ఇంటెర్నెట్ లో ఇంత స్వచ్ఛంగా తెలుగును చూస్తుంటే ఆనందంగా వుంది. మీ లాంటి తెలుగు భాషాబిమానులకు ఒక చిన్న ఐడియా ను నేను ప్రారంభించాను. అదే http://www.atuitu.com మిమ్మల్ని ఇక్కడకు ఆహ్వానిస్తున్నాను.
Atuitu is exclusively for Telugu People to help them stay connected and express their voice with some unique tools. I look forward to your contribution on atuitu through active participation and your valuable feedback.
Dont forget to view this post on Caste System by one of my friends on atuitu: http://www.atuitu.com/openions/show1/17
Cheers
Cass
Post a Comment