పిల్లి మెడలో ఎవరు గంట కడతారు?

>> Saturday, September 30, 2006

ఈ వ్యాసం ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు...ముఖ్యంగా విహారి గారి ఉత్తరాలు చదివి నా అభిప్రాయం చెబుతున్నాను అంతే.


పిల్లి మెడలో ఎవరు గంట కడతారు?

ఏవరో ఎందుకు కట్టాలి?., మీరు, నేను చాలమా?

ఈ సాలెగూడులో ఎన్నో అద్దెగృహాలు, సొంతిల్లు, వ్రాత పత్రులు (నేను బ్లాగులను ఇలా పిలుస్తాను..మామూలుగా) ఉన్నాయి, దానికి తోడు ఎన్నో సంఘాలు ( ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే గుంపులు) ఉన్నాయి., ఎవరికి వారు దేశం తగలబడి పోతుందని, తెలుగు మృతభాష అవుతుందని గొతుచించుకు చెబుతారు., సంతోషం...నిజానికి వాళ్ళు అరవడం వరకే పరిమితం.

కొందరు కనీసం తెలుగు అభివృద్ధి కొరకు కొన్ని క్రొత్త ప్రయోగాలు చేసి ఈ గణితేంద్రము (కంప్యూటర్ కు వచ్చిన తిప్పలు) లో కొన్ని మార్పులు చేసినారు...వారికి నా ధన్యవాదములు.

ఇది ఇంతవరకే., మిగిలిన కాలములో వారు వారికి నచ్చిన/వీలైన భాషనే ఉపయోగిస్తారు.. దీనిని కాదనే అధికారం మనకు లేదు.

ఈ మధ్య కాలములో వచ్చిన చలన చిత్రములు (సినిమలు) రంగ్ దె బసంతి, లగే రహో మున్నాభాయి లను దాదాపు అందరూ చూసిఉంటారు, అందరికీ నచ్చి వుంటాయి., ఎందుకంటే అందరం విధ్యావంతులం కదా...కానీ ఇందులో చెప్పిన ఒక్క విషయం మనము మర్చి పోయాము...అదేఅంటే

"మార్పు అనేది ఎక్కడినుంచో రాదు...మనదగ్గర్నుండే మొదలవుతుంది".

వాళ్ళు తెలుగులో వ్రాసారా, ఇంకోకరకంగా వ్రాసారా వద్దు....మీరు మొదలు పెట్టండి. ప్రతీ దానికీ తెలుగులోనే జవాబు వ్రాయండి., (వీలైతే మీ కార్యాలయ విషయాలలో కూడా..మమూలుగా ఐతే ఇది కుదరదు..) నేను ఇప్పుడు ఇదే అనుచరిస్తున్నాను...

ఈ మార్గములో మీతో పాటు నడిచే నాలాంటి బాటసారులు చాలామందే ఉండి ఉంటారులేండి...

3 అభిప్రాయాలు:

Anonymous October 01, 2006 2:06 am  

మీరు చెప్పింది నిజమే, నేను మీతో ఏకీభవిస్తున్నాను. కాక పోతే, కొన్ని సమయాలలో పదాల పుట్టింటి బాష ఉపయోగిస్తేనే అందం అని నా అభిప్రాయం. ఎందుకంటే బాష భావాల మీద పుడుతుంది, పదాల మీద కాదు. మనకు ఇన్ని రకాల మాండలీకాలు ఉండడానికీ అదే కారణం. కంప్యూటర్ ను అలా అంటేనే అందం, గణిత్రం అంటే, అభినందించటమ్ మాట అటుంచి, తెలుగు బాష మీద విరక్తి పుట్టొచ్చు. ముఖ్యంగా పిల్లలకు. ప్రస్తుతానికి పామర బాషే అత్యుత్తమం.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం October 02, 2006 3:02 pm  

అనిల్‌గారూ, నేను కూడా మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎవరికోసమో ఎప్పుడూ ఎదురుచూడకూడదు. "మనం తెలుగులో రాయడం ఇంగ్లీషు మీద ద్వేషంతో కాదు, మన తెలుగు ప్రేమికత్వం ప్రతిచర్య (reaction)కాదు, చర్య (action) మాత్రమే" అని అర్థం చేసుకోగలవారు మొదట్లో తక్కువగా ఉంటారు. మా వాడు ఇంగ్లీషు మీడియంలోనే చదువుతున్నాడు. కాని నేను బళ్ళో వాడికి తెలుగు ఐచ్ఛికంగా ఇప్పించాను. పైగా నేను ప్రతి ఆదివారమూ పిల్లల బొమ్మల రామాయణం, భారతం చదివించాను. వేసవి సెలవుల్లో సుమతీ శతకం పద్యాలు ఒక పాతిక దాకా బట్టీ పట్టించాను. నేను వాడి చదువు పట్ల చూపించిన శ్రద్ధ తక్కువే గాని, ఆ కొంచెమే అంది పుచ్చుకుని వాడు ఈరోజు ఈనాడు పేపరు కూడా చదివేస్తున్నాడు.

మా అపార్ట్‌మెంట్ భవనంలో నేను కార్యదర్శిని అవ్వకముందు నోటీసులన్నీ ఇంగ్లీషులోనే ఉండేవి. నేను తెలుగు కూడా ప్రవేశపెట్టాను. నేను గమనించిన విషయం- ఇంగ్లీషు క్షుణ్ణంగా వచ్చినవారికంటే, అది రానివారికీ, అరకొరగా వచ్చినవారికే ఆ వ్యామోహం ఎక్కువ అని.

Anonymous February 06, 2007 5:50 am  

అనిల్ గారూ,

మీరు ఎప్పుడో రాసింది ఇప్పుడు చదువుతున్నా. నేను బ్లగులోకంలో అడుగుపెట్టిన రోజుల్లో(మొదట September లో) మీరు ఈ టపా ను రాసారు. దీన్ని నేను ఇంత వరకు చూడలేదు. ఎదో గూగుల్ వాడి సెర్చ్ లో నా పేరు మీద చూస్తే మీ టపా తగిలింది. ఇందులో మీరు నా ఉత్తరాల వ్యాఖ్యలు చూసి రాస్తున్నా అన్నారు. అవేంటో తెలుసుకోవాలని కాస్త ఆసక్తి గా వుంది. గుర్తొస్తే కాస్త చెబుదురూ.

విహారి.