రాధిక గారి వాఖ్యకు నా జవాబు
>> Thursday, January 04, 2007
దేశం గుర్తిచడం అంటే?
మీ ఉద్దేశం లో వారికి పద్మలు, శ్రీ లు, భూషణలు, రత్నలు ఇవ్వటమేనా, లేక నడి రోడ్డులో విగ్రహం పెట్టటమేనా?
మనపక్కింటి పిల్లవాడు, గొప్ప క్రికెటర్ అని, వాడిని TV చూసినప్పుడు గానీ గుర్తించని మన గొప్పదనాన్ని దేశం మీదకు నెట్టటమే మనకు తెలిసిన విద్య..
పక్కింటి అమ్మాయి టెన్నీస్ ఆడుతుందని, మనము తెలుసుకొనేంత వ్యవధి, తీరిక ఈ పరుగుల కాలంలో మనకి ఉన్నాయా..ఉంటే మనము అలాంటి విషయాలకు ప్రాముఖ్యత యిస్తున్నామా?
ఎవరిదాకో ఎందుకు, నాగురించే తీసుకోండి..డిగ్రీ చదివేటప్పుడు, గణిత బ్రహ్మ లక్కోజు గారి గురించి తెలుసు..కానీ, ఈ రోజు ఇంకెవరోగాని చెబితే గుర్తుకి తెచ్చుకోవటం, నా తప్పు కాదా?
మీ ఇంట్లో లేక పక్కింట్లో లేక తెలిసిన వారి పిల్లలకి "రవీంద్రనాథ్ టాగోర్", "రామానుజం", "ఆర్యభట్ట", "గాంధీ", "లాల్ బహదూర్ శాస్త్రి", "మౌలానా అబుల్ కలాం ఆజాద్" లేక "బాబు జగ్జీవన్ రాం" తెలుసునేమో కనుక్కోండి..
మన దేశంలో పుట్టి, జాతి పితగా పూజింపబడ్డ గాంధీని గురించి తెలుసుకోవాలంటే "Google" లో వెదికే రోజులు వచ్చినప్పుడు...తప్పు ఎవరిది, పరిగెడుతున్న కాలానిది తప్ప.
పూజించవలసిన గాంధీని, వెధవ, చేయవలసినదంతా వయస్సులో చేసి ముసలోడిగా ఉన్నప్పుడు నాటకాలు వేశాడు అని, వాడు లేకపోతే ఇంకా ముందే స్వారాజ్యం వచ్చేది అని, పిల్లలే కాదు, యువకులు ఈరోజు అనటం మన అజాగ్రత్త వలన కాదా?
మీ పిల్లలని అడగండి, "వందేమాతరం" ఎవరు రాశారు అని...A.R. రెహెమాన్ అని చెప్పకపోతే సంతోషమే..దీనికి ఒక కారణం, మన పిల్లలు పెద్ద కంప్యూటర్ ప్రొఫెషనల్ కావాలని, లేక పెద్ద డాక్టర్ కావాలని, పక్కింటి వాళ్ళ అబ్బాయికి నెలకి లక్ష రూపాయల జీతమని, చిన్నప్పటి నుంచే ఇంటర్నేషనల్ బడులలో చేర్చడం, ఒకరకంగా మన అజాగ్రత్తే.
మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీరులు, కలెక్టర్లు కావాలని అనుకోవటమే గానీ, మంచి మనిషి, ఒక బాధ్యత కలిగిన భారతీయుడు కావాలని మనము అనుకోకపోవడమే దీనికి మరొక కారణం.
చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎవరికి వారే తీరికగా కూర్చొని (ఇది జరగని పని అని నాకూ తెలుసు) అలోచిస్తే తెలుస్తాయి.
4 అభిప్రాయాలు:
దేశమంటే మట్టి కాదోయ్!
దేశమంటే మనుషులోయ్!
కదా మరి. మనమే దేశం. మమం మన పిల్లల్లో సృజనాత్మకతనే గుర్తించక, మీరన్నట్లు ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో కావాలనుకుంటాం. దేశమూ అంతే!
--ఫ్రసాద్
http://blog.charasala.com
మీరన్నది నిజమే.కాని ఒక వ్యక్తి ప్రాచుర్యం పొందాలంటే పత్రికలు,టీవి లు,సన్మానాలు,బిరుదులు చాలా అవసరం.సినిమా వాళ్ళకి,ఆటగాళ్ళకి ప్రాచుర్యం కల్పించడంలో చూపిస్తున్న శ్రద్దలో కొంత అన్నా ఇలాంటి వాల్లని వెలుగులోకి తీసుకురావడం లో చూపించడం చాలా ముఖ్యం.మేధస్సు వలస పోతుంది అంటే ఎలాంటి గుర్తింపూ,ప్రోత్సాహం లేకే అని నా ఉద్దేస్యం.ప్రతీ నాణానికి రెండు ముఖాలున్నట్టు ప్రతీ విషయానికి రెండు వాదనలుంటాయని నమ్ముతాను నేను.మీరు చెప్పినది ఎంత ముఖ్యమొ నేను చెప్పిన గుర్తింపూ అంతే ముఖ్యం.
పద్మశ్రీలు, పద్మభూషణాలు ఇవ్వక్కరలేదు. ఆయన బతికినన్నాళ్లు అడుక్కునే పరిస్థితిరాకుండా చూస్తే చాలు.
అడుక్కునే పరిస్థితి ఎలా వచ్చింది? దానికీ గవర్నమెంట్ కు ఏమి భాంధవ్యం..?
సంపాదించే వయస్సులో సంపాదించక, సంపాదించినది దాచిపెట్టక పోతే జరిగే అనర్ధం "అడుక్కు తినవలసిందే"...
ఉదాహరణకు ఆలీ ఖాన్ నే తీసుకోండి..తన దగ్గర ఉన్నవారి సంఖ్య 54, సంపాదన ఏమీ లేదు..అప్పుడప్పుడు గవర్నమెంటు ఇచ్చేది తప్ప..ఆయను ఏమీ ఇవ్వలేదు అని అనవద్దు...బాగానే ఇచ్చింది...నేను ఒక పెద్ద పత్రికలో చదివాను...ఆయన తన విధ్యను ఎవరికీ నేర్పలేదు..
జాకీర్ హుస్సేన్ ని తీసుకోండి..అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరచుకొన్నాడు..
ఇంకొందరికి ఇలా కూడా జరుగుతుంది...కొడుకులు కూతుర్లు ఇంటినుంచి వెళ్ళగొడతారు..దీనికి ఎవరు భాధ్యులు..మనమే మనము ఏమి నేర్పితే పిల్లలు అవినేర్చుకొంటారు..మనము మన పెద్దలని గౌరవిస్తే మన పిల్లలు మనలని గౌరవిస్తారు...నాకు కొన్ని ఉదాహరణలు కూడా తెలుసు..
అనిల్.
Post a Comment