అవమానం మనకా?...శిల్పకా?

>> Saturday, January 20, 2007







బిగ్‌బ్రదర్ రియాల్టీ షో లొ మన అమ్మడిని,

బ్రిటన్ వాసులు జో ఒమేరా, డాన్లీ లాయడ్, గూడీ ఈ విధంగా అన్నారు...




"భారతీయులు ఆరోగ్యంగా ఉండరు, బక్కపలచగా ఉంటారు, సరీగ వండడం చేయడం రాదు, చేతులతొ తింటరు..నల్లవాళ్ళు, తెల్లగా కనపడాలని తాపత్రయపడుతుంటారు, కుక్క, పాకీది, మీదేశానికి దెం....(బూతు)"




మన అమ్మడు అవమానం జరిగిందని, కళ్ళనీళ్ళు పెట్టుకొంది..కన్నీరు చూస్తే కరిగిపోయే భారతీయులు, కన్నేర్ర చేశారు..ఇదంతా ఒక వైపు ఐతే...ఈ అమ్మడు..సినిమాలలో డ్రస్సులు మార్చినట్లు తన డైలాగ్ మార్చింది...




'అబ్బే, అంత ఏమీ ఫీలవలేదు..ఇది జాతి వివక్షత కాదు..నన్ను అవమానిస్తే దేశాన్ని అవమానించడంకాదు (నిన్న కన్నీళ్ళు పెట్టుకొంటూ...తను భారతీయులని అవమాన పరిచారు అనడం మీకు గుర్తే గా?).ఇదేమీ పెద్ద సమస్య కాదు అంటోంది...



మీరేమంటారు?




అవమానం శిల్పకా మనకా?





(మనలని తక్కువగా చూసే దేశాలకు మనము ఎందుకు పోవాలి? ఇప్పటికన్నా ప్రవాసాంధ్రులు కొంచెం ఆలోచించండి...)

9 అభిప్రాయాలు:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం January 20, 2007 11:04 pm  

మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఆ దేశాలకి పోవడం కంటే ముందు మనం మానెయ్యాల్సింది ఒకటుంది. అదేంటంటే-ఆ దేశాల వారిని దృష్టిలో ఉంచుకుని వారి మెప్పు కోసం మనం ఇక్కడ పిచ్చి వేషాలెయ్యడం.ఈ విషయంలో మనకి అరబ్బులు ఆదర్శం కావాలి.

Unknown January 21, 2007 12:26 am  

ఇదంతా ఆ ఛానల్ వాళ్ళు ఆడించే నాటకం అండి. ఒక్క రోజులో ఆలోచనలు ఎలా మారిపోతాయి లేకపోతే.

Bhasker January 21, 2007 1:52 am  

Hi Anil,
I am afraid I have to disagree with you on those two points you touched upon.
1) From the day one I have been following this program closely and all the news & discussions happening here (in UK).
Those comments you wrote in bold red are made “behind” Shilpa. We can see these comments but not Shilpa. She knows only half of the story (till now) so her entire opinion is based on what ever she saw/heard directly. I don’t see any wrong in that comment of her. In fact this shows how tolerant and forgiving we Indians in general.
Also even our tourism board gave full page add in most of national papers here inviting Jade and her bully friends to visit India on a free trip to learn more and Indian culture and relieve the stress that they might undergo after eviction.

2) About your comment in blue, are you intend you say we Indians shouldn't go to US or UK because we might face racism? I am not completely with you!
On other side do you think our country is free from racism?

But I agree that Shilpa shouldn’t have taken her comments back after knowing that she have called as Shilpa Papadam this let us bit down. I guess this might part of her game plan to win this show she might regret that later.

Anonymous January 21, 2007 7:36 am  

కుక్క, పాకీది, మీదేశానికి దెం....(బూతు)"
దీన్ని మాత్రం కచ్చితంగా ఖండించాల్సిందే. ఇలాంటివి.. భారతీయులుగా బిగ్ బ్రదర్లు.. టైనీ మైండ్స్.. మనకవసరమా అన్నదే ప్రశ్న

Bhasker January 21, 2007 2:55 pm  

రవి గారు,
When I was watching last Wednesday’s episode of this programme I was very much upset to see such treatment to one of our fellow Indian.
నేను ఆ కామెంట్స్ ను తప్పకుండా/నిస్సంకోచంగా ఖండిస్తున్నా.
Worst thing is racism is part of many Indians life in these so-called developed nations.

Also I completely agree with you we don't need programs like Big brother in any civilised society.
Irony the show sponsors carphone wherehouse pullout their sponsorship but one sick company is ready to sponsor this BB show.

Bhasker January 21, 2007 2:56 pm  

one sick asian company

Anonymous January 22, 2007 4:41 am  

ఈ బిగ్ బ్రదర్ భారతదేశము వస్తుందనే దాకా నాకీ షో ఒకటి ఉందని తెలియని టీవీ అజ్ఞానిని నేను. పాశ్చాత్య ప్రపంచములో భారతీయులకు వ్యతిరేకముగా రేసిజం ఉండటము పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయమేమి కాదు ఇప్పుడిప్పుడే పెద్ద సంక్యలో మనవాళ్లు ఆయా దేశాల్లో కనిపిస్తున్నారు కదా. అమెరికాలో మనకంటే ముందు వచ్చిన వాళ్లందరూ ఎదుర్కొన్నదే. ఇటాలియన్లకు అప్పిచ్చే నాధుడే లేకుంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా స్థాపించుకొన్నారు. పిజ్జానా అదేం తిండి అని హేళన చేసిన దేశాన్నే పిజ్జా దాసులను చేసేశారు. మనము బాధిత పాత్ర పోషించకూడాదు కానీ రేసిజం మన దేశంలోనైనా (బోలెడంత..ఢిల్లీలో ఈశాన్య భారతీయ విధ్యార్ధులనిడిగితే చెబుతారు), విదేశాలలోనైనా ఖచ్చితంగా హేయమైన పనిగా ఖండించాల్సిందే.

శిల్పమ్మ లాంటి వాళ్లు డబ్బుకోసం దేశాన్ని దిగజార్చడం మానెయ్యాలి

అనిల్ చీమలమఱ్ఱి January 22, 2007 8:29 pm  

ఈ విషయంలో వారి వారి అభిప్రాయాలను తెలియచెప్పిన వారికి ధన్యవాదములు..

భాస్కర్ గారు..

మీరు చెప్పిన మొదటి పాయంటు - వెనుక మాట్లాడారు..

ఎదురుగా అన్నా, లేనప్పుడు అన్నా...తప్పు తప్పే కదా?
తను కన్నీరు పెట్టుకున్నప్పుడే కదా మంట రగిలింది?
(నేను ఆ కార్యక్రమము చూడలేదు...నేను ఉండేది భారతం లో, కానీ ఆ వీడియో కోసం ప్రయత్నిస్తున్నాను) ఐనా నేను వ్రాసింది, నేను విన్న, కన్న వరకే కదా...

రెండవ పాయంటు - విదేశాలకు పోవద్దా?

నేను వద్దు అంటె మీరు (మీరు అంటె ఎవరైనా అని) ఆగుతారా?
నేను ఆలోచించమన్నాను గానీ వెళ్ళొద్దు అని అనలేదు..

రవి గారు - మన చానళ్ళకీ ఆ అంటురోగం పట్టుకొని చాలా కాలమే అయింది..మన బిగ్ బాస్..అలాంటిదే కదా..మీరు కొంచెము ఈ కాలంలోకి రావడము అవసరము, ముఖ్యంగా మన బుల్లితెరలో వచ్చే దగుల్బాజీ కార్యక్రమాలను చూడటం అలవటు చేసుకుంటె మంచిది..ఎందుకంటె, దొంగల భయము ఉండదు (రాత్రంతా TV చూస్తూనే ఉంటాము కదా), యువకులకి దొంగచాటుగా బ్లూ ఫిల్ములు చూసే అవసరము ఉండదు (వీటిని TV వాళ్ళే ప్రసారము చేస్తున్నారు), ఇంటిలో సగం ఖర్చు తగ్గును, భార్యలని షాపింగులకి, సినిమాలకి తీసుకు వెళ్ళక్కరలేదు...మొగవారు నలభీములవుతారు..భార్యలు వంటలు చేయరు కనుక....అందువలన మీరు మా కాలమునకు వేతెంచుడు..


అనిల్.

spandana January 23, 2007 3:40 am  

అనిల్,
ఇంతకంటే క్రూరంగా మన సొంత ప్రజలనే మనం చూడట్లేదా?
మద్రాసు నుండీ బొంబాయి వరకు రైలు ప్రయాణం చేయండి. తమిళనాడూలో తమిళంలో మిగతావాళ్ళని ఎద్దేవా చేస్తే, ఆంద్రాలో అరవవాళ్ళని తెలుగు వాళ్ళూ ఇవి మనకు కొత్తేం కాదు. కాకపోతే పాశ్చాత్య దేశాలల్లోనే వీటిని అదుపులో పెట్టుకుంటారు. ఇలాంటి కార్యక్రమమే ఇండియాలో జరిగివుంటే 30వేల పైచిలుకు పిర్యాదులు భారతీయులు చేసేవారా? మహా అంటే అప్పటికప్పుడు నిట్టూర్చి ఇది తప్పు అని వూరకుండేవారు.
ఆ మద్య తెలుగు వాడు హిందీలో చక్కగా పాడినా ఎందుకు రెండోవాడిగానే మిగిలిపోయాడు? మూనటి న్యూస్ చూడండి లాశ్ ఏంజలిస్ లో భారతీయుల పిల్లలు మొదటి రౌండ్‌లో అమెరికన్ ఐడల్ పోటీళో నెగ్గారు.
ప్రతి చోటా జాత్యహంకారము వుంది. కానీ మనకంటే పాశ్చాత్యులే దానిని గట్టిగా వ్యతికిరిస్తారు అని నా అబిప్రాయం.
ఇక శిల్ప మాటల్లో తేడా గూడీని ఆమె క్షమించడం కోసం అన్న మాటలని నా అభిప్రాయం. క్షమ అనేది భారతీయ తత్వం కదా?
ఇక జాత్యహంకారముందని మనం వెళ్ళకూడని దేశముంటే అందులో ఇండియానే మొదటి స్థానంలో వుంటుంది. మంకున్నన్ని జాత్యహంకార కుల పిచ్చి గాళ్ళు ఇంకెక్కడైనా వుంటారా?
సుబ్రమణ్యం గారూ మనం ఏ విషయంలో అరబ్బులను ఆదర్షంగా తీసుకోవాలో కాస్త వివరించండి.

--ప్రసాద్
http://blog.charasala.com