అమ్మ

>> Wednesday, January 17, 2007




1892 లో అలెక్సే మక్షీమొవిచ్ పేష్కాన్ తొలి రచన "మక్సీం గోర్కి" అనే కలం పేరుతో వెలువడింది.


1906 అనగా సరీగా 100 సంవత్సరాల క్రితం అతని కలం నుండి వెలువడింది ఒక అమూల్య రత్నం " అమ్మ".

1906లో రచించిన 'అమ్మ' నవలలో గోర్కీ విప్లవాత్మక మానవతావాద సమస్యను ముందుకు తెచ్చాడు. గోర్కీ రచించిన ఈ పుస్తకం అసంఖ్యాక చదువరుల మనస్సులను చూరగొన్నట్టి, లక్షలాది మనష్యుల జీవితాలపై బలమైన, ప్రత్యక్షమైన ప్రభావం చూపినట్టి మరొక పుస్తకం, ప్రపంచ సాహిత్యమంతటిలో ఇంచుమించు మనకు కనపడదు.
ఈ నవలకు వాస్తవలైన చారిత్రాత్మక ఘటన - 1902 లో రష్యాలోని సోమోవో నగర కార్మికులు జరిపిన కార్మిక దినోత్సవ (మే డే) వేడుకలు, ప్రదర్శన పై దాడులు, దాని తరువాత జరిపిన కోర్టు విచారణాలే, ప్రాతిపదికలు.

యదార్ధ ఘటనలకి కొంచెం కల్పితం జోడించిన చారిత్రాత్మక వివరణే 'అమ్మ'.

నవలలోని పాత్రలు నిజజీవితంలోని వ్యక్తులే..


"ఇది అతి సమయోచితమైన పుస్తకము" - వి.ఐ . లెనిన్







0 అభిప్రాయాలు: