అవలోకనం
>> Wednesday, January 31, 2007
తెలుగు సినిమా వజ్రోత్సవం గురించి అందరూ తమ తమ బ్లాగుల్లో ఇరగదీసి వ్రాశారు.. తెలుగువాడి ఆయువుపట్టు సినిమా అని చెప్పకనే చాటి చెప్పారు..
ఏ దేశమేగినా ఎందు కాలిడినా...మన పద్దతులు, అలవాట్లు, సినిమా వ్యామోహము, పిచ్చి తగ్గవు అని నిరూపించాము..
నిన్నటి దాకా ఆంధ్ర, తమిళనాడులకే పరిమితమైన హీరోల పిచ్చి (అభిమానము) విదేశాలలో కూడా పాకించాము..బానర్లు కట్టి మన అభిమానం చాటుకున్నాము...
కానీ వారికి అంత విలువ ఇవ్వటం ముఖ్యమా అనేదె ఒక గొప్ప ప్రశ్న..
ఇక వజ్రోత్సవం గురించి చెప్పాలంటె నావరకు నాకు, ఇక్కడ వ్యక్తి/వ్యక్తుల అరాధనోత్సవమే జరిగిందని అనిపిస్తోంది..
NTR, ANR, దాసరి, డ్రామానాయుడు (క్షమించండి అది డి.రామానాయుడు), చిరు, బాలకృష్ణ, నాగ్, వెంకి లకు తప్ప మరెవరికీ ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది నా భావన.
సినిమా అంటె అనేక భాగాల సమాహారం..కధ, మాటలు, పాటలు, సంగీతం, కెమరా, లైట్లు ఇంకా చాలా చాలా..
పాతతరం మరియు ప్రస్తుతపు నిర్దేశకులను ఎంతమందిని, తలచుకొన్నాము, అసలు వారికి తగిన విలువ ఇచ్చామా?
సంగీత దర్శకులను, మాటల, పాటల రచయితలను అసలు తలచుకొన్నామా?
ఇలా చాలా చాలా అనుమానాలను నాకు కలగచేసింది ఈ ఉత్సవం.
నా ఉద్దేశంలో పాత విషయాలను ప్రస్తుతతరానికి తెలియచెప్పే వేదికగా కూడా మారిఉంటే బాగుందేది.
పాత తరం హీరో, హీరోయిన్లు, కధ, పాటలు, మాటల రచయితల, స్క్రిప్టు, కెమెరా, మేకప్పు విభాగాలో ప్రతిష్టులైన వారి స్టాళ్ళను నేటి తరం వారితో రీసర్చ్ చేయించి పెట్టి ఉంటే బాగుండేది..
చివరిగా...
మోహన్ బాబుకు ఎందుకు పద్మశ్రీ ఇచ్చారో అనేది లక్ష మిలియన్ డాలర్ల ప్రశ్న. తను వైవిధ్యమున్న నటుడే ఒప్పుకుంటాను.. కానీ ఇతని నటనకు ఈ అవార్డు రాలేదు అన్నది జగమెరిగిన విషయం...లాబీయింగ్ ఎంత బాగా జరిగినది అనేది మన అందరికీ తెలుసు.. (వీరి గురించ్ తరువాత చెప్పుకుందాం)
ఇంకావుంది...మళ్ళా కలుద్దాం
2 అభిప్రాయాలు:
చక్కగా చెప్పారు. మనకు కాస్త సినిమా పిచ్చి ఎక్కువే అని రెండువేల థియేటర్లు చెప్పకనే చెప్తున్నాయి.
మోహన్ బాబు పద్మశ్రీ గురించి నేను మీతో రెండు వందల శాతం ఏకీభవిస్తున్నా...
మనకు సినిమా మత్తు ఎంత వుందో చిరంజీవి ఒత్తి మరీ చెప్పాడు తన ప్రసంగంలో. "మన తెలుగువాళ్ళు సినిమా అంటే పడి చస్తారు" అని ఒత్తి ఒత్తి చెప్పాడు. తెలుగు వీడియో లో చూసేవుంటారు.
విహారి
http://vihaari.blogspot.com
Post a Comment