సంకలనం

>> Sunday, September 17, 2006

నేటి చదువు

ఓం నమఃశివాయ పోయి
ఓహ్ - ఆహ్ స్వరాలు వచ్చాయ్,
అ, ఆ ల స్థానంలో ఎ బి లొచ్చాయ్
పెద్దబాల శిక్ష అసలే లేదు
పెద్ద బరువుల బాల 'శిక్ష' వచ్చి
చిన్న చిన్న పసికూనల్ని
అతలాకుతలం చేస్తోంది
ఇష్ఠపడి చదవడం మాట అటుంచి
కష్టపడి చదవటం ఎక్కువైంది
ఊ అంటే ఫారిన్ చందాన
నేటి చదువు - కకావికలుగా
రూపంతరం చెంది
శాపాంతరంగా మారింది

- కోలపల్లి ఈశ్వర్, నెల్లూరుచప్ర (చలపాక ప్రకాష్)

ఉమ్మడి కుటుంబాలు
ఏమైపోయాయబ్బా!
అ'పార్ట్' మెంటు రూపం
దాల్చినట్లున్నాయి కాదూ..

- చలపాక ప్రకాష్, విజయవాడపీడకల

మనిషికి మనిషే భారమైన వేళ
నైతిక విలువలు దిగజారిన వేళ
విషపు మార్కెట్ సంస్కృతిలో పడి
ప్రేమానురాగాలు లాభనష్టాల
బేరీజులో ఓటమిపాలైన వేళ
రాజ్యం తన విధులను విస్మరించిన వేళ
గుండెలోని ఆర్ధ్రత కన్నీటి రూపంలో
బయటపడుతున్న వేళ
భవిష్యత్తు గురించిన ఆలోచన
నేడు కనే పీడకల

- ముషం చంద్రకళ., కమలాపూర్, కరీంనగర్ జిల్లా

0 అభిప్రాయాలు: