గోవిందా...గోవిందా !!!

>> Monday, September 11, 2006

సోదరులారా!...

కోపం వద్దు....పుట్టపర్తి వారు అదృష్టవంతులు....

ఎలాగంటారా...

ఎఱ్ఱటి ఎండలో, లేక, ఝోరు వర్షం లొ, నీడలేక నిలబడి, మట్టి కోట్టుకు పోకుండా కాపాడారు....సంతోషించండి..

మామూలుగా ఐతే, కాకుల రేట్టలకు ఆలవాలము..మన సరస్వతీ పుత్రుల విగ్రహం....

అవునా కాదా?

భారతీయ చింతన: అంత ప్రేమ, భక్తి, గౌరవం ఉంటే ఇంట్లో పెట్టుకొని పూజించు... వాడు విగ్రహం తీసేసాడని గోలెందుకు...అయినా తెలుగు తల్లి విగ్రహం పగిలినప్పుడు రాని కోపం ఇప్పుడెందుకు?

2 అభిప్రాయాలు:

spandana September 12, 2006 1:52 am  

అనిల్,
తెలుగు తల్లి విగ్రహం పగిలినప్పుడూ భాధే! కాకపోతే అది ప్రమాదవశాత్తూ పగిలింది, దీనికి రాజకీయ గ్రహణం పట్టింది. ప్రేమ మాటకొస్తే ఎవరి విగ్రహమూ వీధుల్లో పెట్టన్వసరం లేదు. కానీ ఇంకొకరి విగ్రహం కోసమని మరొకరి విగ్రహం తొలగించడం, అదేదో ఈమె ఆయనకంటే గొప్పదయినట్టు! ఎవరిగొప్ప వారిది, కావాలంటే ఇందిరా విగ్రహానికి ఇక కూడళ్ళు లేవా ప్రొద్దుటూరులో!

-- ప్రసాద్
http://charasala.wordpress.com

అనిల్ చీమలమఱ్ఱి September 12, 2006 5:49 am  

ప్రసాదు గారు

1. అది, నా చింతన కాదు...75% మంది భారతీయులలో ఉండే గుణామే...అదే చెప్పాను...

2. దేశభక్తి గీతానికే రాజకీయ రంగు పులిమిన దేశం మనది, ఇంక ఇక్కడ సాహిత్య పిపాస కుడానా?

3. విజయవాడ ను ఏలిన ఒక గూండా బొమ్మను, ఆంధ్రదేశము నలుమూలలా ఏర్పాటు చేసుకొన్న మనకు....కావలసినది ఇందిరమ్మో, లేకపోతే ఇంకో అమ్మో....కానీ ఒక పుట్టపర్తి, లెక ఒక మల్లాది లేక ఒక రావిశాస్త్రి కాదు...

4. అయినా అసలే రేపు దసరాకి మంత్రి వర్గ విస్తరణ ఉన్నప్పుడు, రాజశేఖరునిదో, సోనియా మాతదో, ప్రియాంకాదో లేక ఆమె కొడుకో కూతురుడొ, రాహుల్ దో వారి బాబుదో ఇలా వారివి పెడితే పదువులొస్తాయి గానీ, బక్క చిక్కిన పంతుల్ని పెడితే ఏమొస్తాయి?

5. ఇంతకీ మన పిచ్చి కాకపోతె, ఇదంతా ఎక్కడ జరుగుతోంది....రాయలు ఏలిన సీమ, రక్తాలు పారుతున్న సీమ, రాయల సీమ ... ఇక్కడ ఏమి జరిగినా తప్పుకాదు....

ఇదంతా ఏమీచెయలేనితనముతో వెళ్ళగ్రక్కుతున్న బాధ...అంతే కాని, వేరే ఉద్దేశముతో కాదు...