పాఠశాలలో మాదకద్రవ్యాలు ....

>> Saturday, August 26, 2006

నిన్నటి "STAR NEWS" లొ పగిలిపోతున్న వార్త (క్షమించండి దీనినే Breaking News అంటారు)

ప్రాంతము: దేశ రాజధాని "డిల్లీ" నగరము...(మన పక్క సందు కూడా కావచ్చు)
సమయము: ఉదయము 10.45
వేదిక : ఒక పేరున్న పబ్లిక్ స్కూలు
కళాకారులు : కొందరు విద్యార్ధులు
ఉదయము 10.45., స్కూలు మైదానము లో విద్యార్ధుల జేబులలో 3 పొట్లాలు దొరికినాయి.

ఇంక ఇక్కడినుంచి స్టార్ న్యూస్ విలేఖరులదే కార్యక్రమము మొత్తము.

అసలు మాదక ద్రవ్యాలు అంటె ఏమిటి?,
ఎక్కడ దొరుకుతాయి?
ఎంత ఖరీదు చెస్తాయి?
ఎక్కువ పరిమాణం లొ కావాలంటె ఏమిచెయాలి?

"తెలియని వారికి కూడా అర్ధం అయ్యెట్టు బాగా తెలియచెప్పారు"

స్టార్ న్యూస్ కి ధన్యవాదములు - ఇంత చక్కగా విడమర్చి చెప్పినదానికి.

ఇంక అసలు విషయానికి వస్తే:

ఈ మాదకద్రవ్యాలు విధ్యార్ధులకు సులభముగా స్కూళ్ళ ప్రక్కనే దొరుకుతాయి. మనము మామూలుగా బిస్కెట్టులు, చాక్లెట్టులు కొనుక్కునే కొట్లలోనే దొరుకుతాయి.

ఇక సులభముగా దొరకు రకాలు :

నల్లమందు-అతి తక్కువ రేటు
గాంజాయి - తక్కువ రేటు
మరిజునా - మధ్యరకం (దీనినే cannabis అని కూడా అంటారు)
హెరాయిన్ - ఇది యువకులకు సంభందించినది (రేటు కొంచెం ఎక్కువ - ముఖ్యముగా soft ware/ call center/party animals వాడుతుంటారు)

ఇదేకదా అసలైన గ్లోబలైజేషన్.


తప్పెవరిది...

మాదకద్రవ్యాలను అమ్మే వారిదా?
వారిని పట్టుకోలేని నిఘా వ్యవస్తదా?
బడి ఆవరణ లోకి వాటిని రప్పించిన స్కూలుదా?
పిల్లలదా?
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పిల్లలని క్రెచ్ (డబ్బులకు తల్లి కొరత తీర్చె, పిల్లలను సమ్రక్షిస్తున్నామనే కొన్ని సంస్థలు) కి అలవాటు చేసే, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రయపడుతూ, పిల్లలకి ఏవి ఇష్టమో తెలుసుకోకుండా, మన ఇష్టాలను వారి మీద బలవంతంగా రుద్దే తల్లితండ్రులదా?

చివరిగా:

అమ్మయ్యా !!

భారత దేశాన్ని అమెరికాగా మార్చాలన్న మన ప్రయత్నం 90% సఫలీకృతమైనది.

చూడండి., అమెరికా లాగే మన స్కూళ్ళ లోనూ విరివిగా, విచలవిడిగా మత్తు దొరుకుతుంది, అదీకాక దేశం ఎత్తుకి ఎదగదానికి పిల్లలేగా ముఖ్యం....వారికే ఈ ఎరువు వేస్తే దేశం ఎంత అభివృద్ది చెందుతుందో...

2 అభిప్రాయాలు:

Naga August 26, 2006 12:38 pm  

ఇటువంటి దిక్కుమాలిన ప్రోగ్రాములు విదేశాల్లో మరీ ఎక్కువ. పిల్లిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు, మన మీడియా మూర్ఖులు... పిల్లల్ని చెడగొడుతున్నారు... అడ్డమైన విషయాల గురించి తెలియజేసి...

త్రివిక్రమ్ Trivikram August 26, 2006 3:33 pm  

మరీ ఈ మధ్య మన మీడియా కనీస ఇంగితజ్ఞానం లేకుండా ప్రవర్తిస్తోంది చాలా విషయాల్లో.