మీరు సింగిలా?

>> Thursday, August 17, 2006

ఏం..! అర్ధం కాలేదా?

అదేనండి, ఈ మధ్య వచ్చిన జాఢ్యం ఉందిగా - అదే అమెరికను ఆంగ్లము ( English - American Style)...దాని గురించి....నా గోల, గోడు....

ప్రతీ కాల్ సెంటరు వాల్లు ఫోన్ చెసి " మీరు సింగిలా" అని అడుగుతారు...., వెంటనే నాకు .....


"నేను" అనే పదము - ఏక వచనమా ? బహువచనమా ?

నా శరీరము - లావుగా (Double Size) ఉందనా?

నేను ఎవరినైనా ఉంచుకొన్నాననా?

అనే ప్రశ్నలు పుట్టుకొస్తాయి...

ఇంతకీ దీని అర్ధం - మీకు పెళ్ళైందా అని...

ఇంతకు ముందే నయం, బ్రిటీషు వారి భాషలో మర్యాద ఉండేది....

"Are you married?" అని కానీ, married, unmarried అనే options కానీ ఉండేవి...

మరి ఇప్పుడో.....మంచి, మర్యాదా మచ్చుకైనా కానరావు...

ఏ భాష లొనైనా మంచి, మర్యాదా, గౌరవం, ఉన్నప్పుడే అందముగా ఉంటుంది....


ఇంకో రకముగా చెప్పాలంటె,

ఎంత అందగత్తైనా, భాషలో గౌరవము, మంచితనము, మర్యాద ఉంటేనే అందగత్తె అనిపించుకొంటుంది....

3 అభిప్రాయాలు:

spandana August 17, 2006 7:48 pm  

ఆనిల్, మీ బ్లాగులు భలే చురుగ్గా, చలాకీగా, తమాషాగా వుంటూనే ఛళ్ మనిపిస్తాయి.
మీ ఈ బ్లాగు నన్ను ఇంకో బ్లాగు రాసేందుకు పురిగొల్పింది. నా బ్లాగు "మీరు సింగిలా?" చూడండి.

-- ప్రసాద్
http://charasala.wordpress.com

Anonymous August 17, 2006 9:01 pm  

Very funny!

త్రివిక్రమ్ Trivikram August 26, 2006 3:45 pm  

ఒక వైపు నవ్విస్తూనే మంచీ మర్యాదల గురించి వాతలు పెట్టడం చాలా బాగుంది.