నమ్మలేని నిజం

>> Tuesday, August 29, 2006

1)
చిత్తూరు జిల్లాలో తెలుగు మాధ్యమంలో చదివితే " ఉపాధ్యాయ శిక్షణలో ప్రవేశానికి కేవలం 1శాతం అవకాశం ఉంది.

తమిళ మాధ్యమంలో చదివితే 16 నుంచి 17 శాతం, ఉర్దూ మాధ్యమంలో చదివితే 30 శాతం అవకాశాలు ఉన్నాయి.

ఉర్దూను పక్కన పెట్టినా తెలుగు, తమిళ భాషలు రెండూ తెలిసిన సామాన్యుడు తన బిడ్డలను ఏ మాధ్యమంలో చదివిస్తాడో ఆలోచించండి!


2)
తమిళ సాహిత్యం లో మాదిగల గురించిన ప్రస్తావనే లేదు. ఆందుకే తమిళ ఉద్యమకారులు మాదిగల్ని కూడా 'వందేరిగళ్" (వలస వచ్చిన వారు) అంటుంటారు. ఏందుకో తెలియదుగానీ చరిత్రలో చిత్తూరు ప్రాంతంలో బలమైన తమిళ ఉద్యమమేదో జరిగింది. లేకపోతె ఇందరు తమిళూలు, ఇన్ని తమిళ జాతులు ఇక్కడ నిలబడి పోవడం జరుగదు. తమిళ ఉద్యమం బలంగా జరిగిందని సందేహపడడానికి ఇంకొక ముఖ్య ఉదాహరణ:

దళిత కులాల్లో 'మాదిగలూ ఉన్నారు కదా! తమిళనాడంతా కుడా వీరి తల్లిబాస తెలుగే. చిట్టచివరి కొస 'కన్యాకుమారీలో కుడా సుమారు వెయ్యిండ్లు మాదిగలవారు ఇప్పటికీ తెలుగులోనే మాట్లాడుకొంటున్నారు.

మరిన్ని వివరాలకు:

స.వెం.రమేశ్
తెలుగువాణి
7, రాజాజీ వీధి,
భారతీ నగర్ ఎక్సెటెన్షన్,
కాట్పాడి - 632 006
వెల్లూర్ జిల్లా, తమిళనాడు
ఫో:09443323517

ప్రచురణ : నడుస్తున్న చరిత్ర (జులై '06)

2 అభిప్రాయాలు:

cbrao August 30, 2006 10:41 AM  

What is Tamil Sanga Sahityam?
Your post is not published fully in Koodali.

అనిల్ చీమలమఱ్ఱి August 31, 2006 11:49 PM  

సి బి రావు గారికి

నా fast typing (దీనిని తెలుగులో ఏమంటారో గుర్థుకి రావటము లేదు / తెలియలేదు)వల్ల ఆ అచ్చుతప్పు పడినది. దానిని సరిదిద్దాను.

కూడలిలో నా వ్యాసం పూర్తిగా ఎందుకు అచ్చుకాలేదో, వీవెన్ గారినే అడగాలి, అడుగుతాను.

మీరు నా వ్యాసములను, పూర్తిగా చదవాలంటె, అనిల్ చీమలమఱ్ఱి లో చూడండి.