తుప్పు పట్టిన 'కారు'
>> Saturday, August 26, 2006
తుప్పు పట్టిన కారా? - అదేమిటి?
గుర్తు రావటములేదా?....కారండి---కారు----CAR .. మన చంద్రశేఖర రావు గారి గుర్తు., గులాబీ రంగు పై కారు....గుర్తొచిందా...?....హమ్మయ్యా...
దానికేమైందని అడుగుతున్నారా....దానికేమి కాలేదు...ఆల్రెడీ తుప్పుపట్టిన కారునుని బయటకు లాగీ...."ప్రత్యేక తెలంగాణా" ని మళ్ళీ మొదటికి తెచ్చారు.
కొంత కాలం క్రిందట "రక్తాన్ని ధారపోసైనా, తలలు బద్దలు కొట్టైనా ప్రత్యేక తెలంగాణాను తెస్తాము" అన్న చంద్రశేఖరుడు......
కొన్ని నెలల క్రింద " సోనియా కాళ్ళు పట్టుకొనైనా తెలంగాణా రాస్ట్రాన్ని సాధిస్తాము" అన్న శేఖరుడు
కొన్ని రోజులక్రితము మేడంగారిపై అలిగి, కోపంతెచ్చుకొని, రాజీనామా సమర్పించుకొని, నిరాహార దీక్ష చేపట్టి, అమవాస్య చంద్రునిలా చిక్కి,శల్యమై, లోకసభ మీద గౌరవంతో, నిరాహార దీక్షను విరమించి "శాంతి కపోతము" అయ్యారు.
"తెలంగాణా పై అనవసరపు రగడ చేయ్యొద్దని, పల్లె పల్లె కూ వెళ్ళి 'కాంగ్రెస్సు వారు, మేడం గారు' చేసిన మోసంగురించి, అన్యాయము గురించి ప్రజలకు వివరిద్దాము, దీనితో ప్రజలు నిజం తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారని, కావాలసిన్నని సీట్లు వస్తే, ప్రభుత్వమే దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇస్తుంది" అని చంద్రశేఖర రావు సెలవిచ్చారు...
ఇదిగో ఇలా చెప్పే పోయిన ఎలక్షన్లలో "కారుతో" ఓట్లు గుద్దించుకొందామని అనుకొంటె, పాపం అదేకారు గుద్ది, ఓడిపోయి, చావుతప్పి కన్ను లొట్టబోయిందని, తన గురించి, ప్రత్యేక తెలంగానా గురించి ప్రజలు ఏమనుకొంటున్నరో అని ఇంకా అర్ధం కావడములేదు...పాపం.!
ఖర్మకాలి కాంగ్రెస్సు తో జత కట్టి, ఎన్నికల్లొ ఓడిపోయి, పదవి రాక కొన్నాళ్ళు, రక్తము, తలలు, కాళ్ళు, చేతులు, నరకడం అని కొన్నాళ్ళు అనడము,పదవి వచ్చిన తరువాత దాన్ని వదులుకోలేక కొన్నాళ్ళు, వదిలిన తరువాత, తప్పనిసరై నిరాహార దీక్షకు పూనుకోవడం, ఒకటున్నర రోజులోనే విరమించుకోవడం, మళ్ళీ ఎన్నికలు అనడం చూస్తోంటె, నాకు చంద్రశేఖర రావు గారు ఇక్కడ ఉండవలసిన వారు కాదేమో అని అనిపిస్తోంది.
మరి ఎక్కడ అంటారా - ఎమో - ఏ వాపునైతే చూసి, బలుపు అనునుకొన్నాడొ, ఏ నగరాన్ని చూసి, తన రాజధానిని చేద్దము అనుకొన్నాడో, - అదే నగరపు నడి బొడ్డులో ఉన్న - హాస్పిటల్ - అదేందో మీకు ప్రతేకముగా చెప్పక్కరలేదు అనుకొంటా... అక్కడ ఉంటే మంచిదేమో ..!
1 అభిప్రాయాలు:
మీ బ్లాగు చాలా బాగుందండీ! చంద్రశేఖరొక్కడే కాదు. ప్రస్తుతం చాలా మంది రాజకీయనాయకులు ఉండవలసిన చోటు అదే.
Post a Comment