ఫ్రీడం 59

>> Tuesday, August 15, 2006



59 వ భారత స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు.



ప్రతీ సంవత్సరం ఆగస్టు 15వ తేదినాడు, జెండా ఎగురవేయడము, పాత ఙాపకాలు తలచుకోవడము...ఇదేనా స్వాతంత్ర్యదినోత్సవము?

వీటిసంగతీ కొంచెము చెబుతారా?

1) గట్టి భద్రత మధ్య ప్రధాని మువ్వన్నెల జెండాను ఆవిష్కరించడము....ఇదేనా స్వాతంత్ర్యం..?(ఇది మనకు ఏవిధమైన స్వాతంత్ర్యము?).

2) పేపర్లలొ "ప్రశాంతముగా స్వాతంత్ర్యదిన సంబరాలు" అని చదవడము - ఇదేనా స్వాతంత్ర్యం..?

3) అన్నీ రాస్ట్రాలలోనూ రైతుల ఆత్మహత్యలు - ఇదేనా స్వాతంత్ర్యం..?

4) అర్ధరాత్రి తిరిగే (ఉద్యోగాలనుండి ఇంటికి వెల్లె)ఆడవారి పై జరిగె అమానుష చర్యలు ...ఇదేనా స్వాతంత్ర్యం..?

5) క్లబ్బుల్లో, పబ్బుల్లో....మబ్బుల్లో తేలుతున్న యువత - ఇదేనా స్వాతంత్ర్యం..?

6) అభ్యంతరకరమైన నాట్యాలు చెసిందని గొంతెత్తి అరిచిన మహిళా సంఘాలు, T.V.Channels, ఐశ్వర్యా రాయ్, ప్రీతీ జింతా, కరిష్మా మెదలు నిన్న వచ్చిన పార్వతీ మిల్టన్ వరకూ వేసుకొనే కురచ దుస్తులు అభ్యంతరముగా అనిపించలేదా - ఇదేనా స్వాతంత్ర్యం..?

7) ఎందుకు చంపుతున్నామో, ఎందుకు ఛస్తున్నామో అర్ధం కాని పరిస్థితిలొ ఉన్న పోలీసు, నక్సలైటు, హొం డిపార్టుమెంటు - ఇదేనా స్వాతంత్ర్యం..?

8) కులం పేరుతో తిట్టారని, మీ ఊరి అంతుచుస్తాను అన్న MLA - ఇదేనా స్వాతంత్ర్యం..?

9) ఎంత గొప్ప వ్యక్తిని హత్య చేసినా, క్షమాభిక్ష పెట్టె సుప్రీం కోర్టు

ఇలా చెప్పుకొంటూ పోతె...59 ఏళ్ళు సరిపోవు....

అందుకే

అర్ధ శతాబ్దపు అగ్నానాన్ని స్వతంత్రమందామా? స్వర్నోత్సవాలు చేద్దామా?
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా? దానికి సలాము చేద్దామా?
శాంతికపోతపు కొత్తుక త్రెంచి తెచ్చిన బహుమానం
ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మ ఓ పవిత్ర భారతమా

కులాల కోసం గుంపులు కడుతూ
మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువను చూపి తగువుకి లేస్తారే
జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకు తనం లొ
ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరే?, తెలిసి భుజం కలిపి రారే?
అలాంటి జనాల తరఫున ఎవరొ ఎందుకు పోరాడాలి?
పోరి ఏమిటి సాధించాలి?

ఎవ్వరికోసం ఎవరు ఎవరితొ సాగించే సమరం
ఈ చిచ్చుర సిందూరం జవాబు చెప్పె భాద్యత మరచిన
జనాల భారతమా ఓ అనాధ భారతమా

తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే
వదులుకొని తనలో భీతిని, తన అవినీతిని
తన ప్రతినిధులుగ ఎన్నుకొని
ప్రజాస్వామ్యమని తలచె జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదొ తనకె వుందని శాసిస్తుందట అధికారం
క్రిష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితి మంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాధ భారతమా?




-----జై భారత్ ------

2 అభిప్రాయాలు:

spandana August 16, 2006 10:30 pm  

"తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే
వదులుకొని తనలో భీతిని, తన అవినీతిని
తన ప్రతినిధులుగ ఎన్నుకొని
ప్రజాస్వామ్యమని తలచె జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదొ తనకె వుందని శాసిస్తుందట అధికారం
క్రిష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితి మంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాధ భారతమా? "
భలే చెప్పారు.
ప్రతి అక్షరం ఓ అగ్నికణంలా మండుతోంది.
-- ప్రసాద్
http://charasala.wordpress.com

త్రివిక్రమ్ Trivikram August 26, 2006 3:52 pm  

ఒక వైపు స్వేచ్చాస్వాతంత్ర్యాలు దుర్వినియోగమై విశృంఖలత విజృంభిస్తూంటే ఇంకొకవైపు స్వాతంత్ర్యం అనుభవించే ప్రతి ఒక్కరిమీదా దాన్ని సద్వినియోగమయ్యేలా చూసుకోవలసిన బాధ్యత ఉందని మరిచిపోతున్నాం.